
చపాతీలు దూదిలా మెత్తగా రావడంలేదా? పిండి కలిపేటప్పుడు ఇలా చేయండి
Soft Chapati Tips: చపాతీలు మృదువుగా, మెత్తగా ఉండాలంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాలో అవ్వాల్సి ఉంటుంది. చాలా మంది పిండిని నానబెట్టుకునే క్రమంలో చేసే తప్పుల కారణంగా చపాతీలు గట్టిగా తయారవుతున్నాయి. అయితే, ఇవి గట్టి పడకుండా ఉండడానికి తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. చపాతీలు గట్టిపడటానికి ప్రధాన కారణం గోధుమ పిండిని కలుపుకునే విధానమేనని కొంతమంది వంట నిపుణులు చెబుతూ ఉంటారు. కేవలం మంచి నాణ్యమైన పిండి వాడటం ఒక్కటే సరిపోదని.. పిండి కలిపే సరైన పద్ధతి తెలిసి ఉండటం కూడా అత్యంత ముఖ్యమని వారు చెబుతున్నారు. చపాతీలు గంటల తరబడి ఎంతో మెత్తగా, దూదిలా ఉండటానికి తప్పకుండా కొన్ని రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. పిండి తడిపే సమయంలో తప్పకుండా ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోయకూడదని వంటలు చేసే నిపుణులు చెబుతున్నారు. కొద్దికొద్దిగా నీళ్లు చిలకరిస్తూ.. పిండిని మంచిగా కలుపుకోవాల్సి ఉంటుంది.. దీనివల్ల పిండి మరీ గట్టిగా కాకుండా.. మరీ పల్చగా కాకుండా సరైన మోతాదులో తయారవుతుంది.. పిండిని త్వరత్వరగా కలిపేసి.. పక్కన పెట్టుకుండా ఉండడం చాలా మంచిది.. కనీసం 8 నుంచి 10 నిమిషాల పాటు చేతులతో బాగా పిసకాల్సి ఉంటుంది. దీనివల్ల పిండిలో సాగే గుణం (Gluten Development) పెరిగి చాలా మృదువుగా తయావుతూ ఉంటాయి.. పిండి కలుపుతున్న సమయంలో తప్పకుండా ఈ టిప్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. పిండిలో ఒక చిన్న చెంచా నూనె లేదా నెయ్యి వేసి కలిపితే పిండిలో తేమ సజీవంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది చపాతీలు ఆరిపోకుండా.. ఎక్కువ సేపు మృదువుగా ఉండేలా సహాయపడుతుంది.. పిండి కలిపిన వెంటనే చపాతీలు చేసుకోకుడు.. తప్పకుండా పిండిపై తడి గుడ్డ లేదా మూత పెట్టి కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది.. దీనివల్ల పిండి బాగా సెట్ అయి.. చపాతీలు సులభంగా ఒత్తడానికి రావడమే కాకుండా బాగా
