
బడి కోసం డొనేట్’ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ నిశాంతి
Paderu: ‘బడి కోసం డొనేట్’ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ నిశాంతి ఈ వార్తకు సంబంధించిన

Paderu: ‘బడి కోసం డొనేట్’ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ నిశాంతి ఈ వార్తకు సంబంధించిన

Paderu: అల్లూరి జిల్లాలో 87.71% పెన్షన్ల పంపిణీ పూర్తి: కలెక్టర్ నిశాంతి! ఈ వార్తకు సంబంధించిన

కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్బీఐ వేసిన 7 శాతం అంచనాలను తలకిందులు చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన ప్రదర్శన కనబరిచింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు మరియు పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ఈ తరహా ప్రతిభ కనబరచడం విశేషం. పటిష్టమైన దేశీయ డిమాండ్, మూలధన పెట్టుబడులు మరియు సేవల రంగం సాధించిన ప్రగతి ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే తొలి త్రైమాసికంలో నమోదు అయిన 6.9 శాతం వృద్ధితో పోలిస్తే ప్రస్తుతం దేశ ఆర్థిక వేగం గణనీయంగా పుంజుకుంది. అయితే మునుపటి నాలుగో త్రైమాసికంలో నమోదు అయిన 8.6 శాతంతో పోలిస్తే వృద్ధి రేటు కొంత మందగించినట్లు స్పష్టమవుతోంది. స్థిర ధరల ఆధారంగా భారత వాస్తవ జీడీపీ రూ. 81.36 లక్షల కోట్లకు చేరగా, నామమాత్ర జీడీపీ 10.3 శాతంతో రూ. 88.27 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో వాస్తవ జీవీఏ వృద్ధి రేటు 8.2 శాతాన్ని తాకి నికర పన్నుల కంటే సబ్సిడీల ప్రభావం ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. ప్రాథమిక రంగంలో కొంత మందగమనం కనిపించినప్పటికీ ద్వితీయ మరియు తృతీయ రంగాలు ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపించాయి. దీంతో సేవల రంగం 10.0 శాతం వేగంతో వృద్ధి చెందగా, ఫైనాన్షియల్ మరియు ఐటీ రంగాలు 12.1 శాతంతో సత్తా చాటాయి. ఇదిలా ఉండగా తయారీ రంగం 9.2 శాతం సాధించగా, స్థిర మూలధన నిర్మాణం అనగా పెట్టుబడుల వృద్ధి 11.9 శాతానికి చేరుకుంది. అయితే వ్యవసాయ రంగం వృద్ధి 3.6 శాతానికి పరిమితం కాగా, గనుల త్రవ్వకం రంగం ప్రతికూల వృద్ధిని నమోదు చేసి కాస్త ఆందోళన కలిగించింది. భారత

కోలీవుడ్ లో యోగిబాబు స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ఒక వైపున కీలకమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున ప్రధానమైన పాత్రలను పోషిస్తూ కథానాయకుడిగాను కొనసాగుతున్నాడు. ఆయన నుంచి ఇటీవల వచ్చిన తమిళ సినిమానే 'సన్నిధానం పోస్ట్ ఆఫీస్'. అముత సారథి దర్శకత్వం వహించిన సినిమా ఇది. జూన్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఆ మరుసటి నెలలోనే స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే రీసెంటుగానే తెలుగులో అందుబాటులోకి వచ్చింది.యశోద (సితార) ఒక ఒంటరి మహిళ .. ఆమెకి మాటలు రావు. ఆమెకి పదేళ్ల వయసున్న ఒక కొడుకు ఉంటాడు. అతని పేరే 'శబరి. అతనికి కూడా మాటలు రావు. అయితే అతనికి మాటలు రావాలనే బలమైన కోరికతో యశోద ఉంటుంది. అయ్యప్పస్వామి మాల వేస్తే మాటలు వస్తాయని కొంతమంది చెప్పడంతో ఆమె శబరికి మాల వేస్తుంది.దీక్ష పూర్తిచేయించి .. ఇరుముడి కట్టించి 'పులిమేడు' సన్నిధానానికి తీసుకొస్తుంది. శబరికి దాహంగా ఉండటంతో, అతనికి మంచినీళ్లు తీసుకురావడానికి యశోద వెళుతుంది. 'సన్నిధానం పోస్టాఫీస్' దగ్గర నిలబడిన అతను, ఆ తరువాత కనిపించకుండా పోతాడు. శబరి కనిపించకపోవడంతో యశోద కంగారు పడిపోతుంది. తన కొడుకు కోసం కంగారుగా వెదకడం మొదలుపెడుతుంది. అదే సమయంలో కొంతమంది పోలీసులు అక్కడికి వస్తారు. ఒక గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఆమెను అరెస్ట్ చేస్తారు. తనకి ఎలాంటి సంబంధం లేదని ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా ఆమెను స్టేషన్ కి తీసుకు వెళతారు. ప్రత్యక్ష సాక్షులు ఉండటం వలన ఆ కేసు నుంచి బయటపడటానికి ఆమెకి చాలా కాలం పడుతుంది. యశోద నుంచి తప్పిపోయిన శబరి ఎక్కడికి వెళతాడు? మాటలు రాని అతనిని ఎవరు ఆదరిస్తారు? అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? జైలు నుంచి విడుదలైన యశోద తన కొడుకుని కలుసుకోగలుగుతుందా? అయ్యప్పస్వామి ఆ తల్లి కొడుకుల జీవితాలను ఏ గమ్యానికి చేరుస్తాడు? అనేది మిగతా కథ.అయ్యప్పస్వామి మహిమలకు సంబంధించిన

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల(జేఎన్వీ) ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఏపీలో ప్రస్తుతం 28 జిల్లాలు ఉండగా 15 జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలు మంజూరైనట్లు తెలిపారు. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడంలో నవోదయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. 2024 డిసెంబర్లో కేంద్ర మంత్రివర్గం ఐదేళ్ల కాలానికి రూ.2,359.82 కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 28 కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని ఎంపీ గుర్తుచేశారు. అదే ప్రాతిపదికన ఏపీలో మిగిలిన 13 జిల్లాల్లో జేఎన్వీల ఏర్పాటుకు ఐదేళ్ల కాలంలో సుమారు రూ.1,096 కోట్ల మేర నిధుల అవసరం ఉంటుందని తెలిపారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయాలని ఆర్థిక మంత్రిని కోరారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. 2014లో పునర్వ్యవస్థీకరించిన రాష్ట్రంలో జాతీయ స్థాయి విద్యా, వైద్య సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారని, దాని ఫలితంగా మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటైందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తద్వారా అత్యున్నత వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు సూపర్

ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఇటీవల లేథోవిస్ అనే మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడం జరిగింది. ఈ లేబుల్ ద్వారా ఇప్పటికే నాలుగు పాటలు ఆ పాటలు మ్యూజిక్ లవర్స్ నుండి అద్భుతమైన ఆదరణను పొందాయి. కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ లేబుల్ ద్వారా వచ్చిన తొలి గీతం ముమ్ముకుస్సు వివిధ భాషలలో రావడంతో ప్రత్యేక ఆదరణ లభించింది. ఆ తర్వాత వచ్చిన రాసింది కీరవాణి కూసింది చంద్రబోస్ అంటూ సాగే పాటకు గాయని లిప్సిక తన గాత్రం అందించారు. ఆ తరువాత వచ్చిన రాహుల్ సిప్లిగన్జ్ సర్పంచ్ కూతురు వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ లేబుల్ నుండి వచ్చిన నాలుగవ పాట అన్‌ఫైర్ లైఫ్ ఒక వినూత్న విధంగా షార్ట్ ఫిలిం తరహాలో వచ్చింది. అయితే ఇప్పుడు ఈ లేబుల్ నుండి వచ్చిన 5వ పాటను ప్రముఖ మలయాళ సింగర్ సితార కృష్ణకుమార్ గారు పాడటం మరొక సంచలనం. ఆమెతో కలిసి కీరవాణి గారు తొలిసారి వీడియోలో కనిపిస్తూ రానున్న సాంగ్ చాయురంగ్. ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ పాటకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడంతో ఈ పాట పై ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ నుండి ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి వచ్చిన పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ పాట ఎలా ఉండబోతుందో అంటూ అందరూ ఈ పాటపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఈ పాట గురించి తెలిసిన వారంతా ఈ పాట కీరవాణి గారి మనసులో నుండి పుట్టుకు వచ్చిన పాటగా చెప్తున్నారు. దీనితో ఈ పాట ఏ స్థాయిలో ఉండబోతుందో అంటూ ప్రేక్షకులలో మరింత అంచనాలు పెరిగాయి. అంతేకాక ఈ లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి మరెన్నో పాటలు రానున్నట్లు, రాబోయే కొన్ని

దర్శకుడు వెంకీ అట్లూరి సితార ఎంటర్టైన్మెంట్స్తో తనకున్న ప్రత్యేక అనుబంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్య కథానాయకుడిగా నాగవంశీ నిర్మించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సితార సంస్థతో తనకున్న సంబంధం డబ్బులు, అగ్రిమెంట్లకు అతీతమైనదని ఆయన స్పష్టం చేశారు. తన్ను నమ్మి వరుసగా అవకాశాలు ఇచ్చినందుకు ఆ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మూడేళ్ల క్రితమే సిద్ధమైన కథఈ సినిమా వెనుక ఉన్న నిర్మాణ ప్రయాణాన్ని వెంకీ అట్లూరి వివరంగా పంచుకున్నారు. ఈ కథను 2022 లోనే రాసుకున్నానని, సూర్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా కొన్ని మార్పులు చేశానని తెలిపారు. సూర్య కూడా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్న సమయంలో ఈ కథ వినగానే ఎంతో ఇష్టపడ్డారని పేర్కొన్నారు. అనవసరమైన కామెడీ లేకుండా కథను ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా చెప్పాలని సూర్య సూచించడంతో దానికి అనుగుణంగా చిత్రీకరించినట్లు వెల్లడించారు. పాత్రల ఎంపిక మరియు వసూళ్ల తీరుకథాంశం మరియు నటీనటుల ఎంపిక గురించి కూడా ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. 'ప్రేమలు' సినిమా చూసిన తర్వాత మమితా బైజును ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశామని, తమిళంపై ఆమెకున్న పట్టు సినిమాకు ప్లస్ అయిందని తెలిపారు. దీంతో తమిళ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రాన్ని ప్రధానంగా తమిళంలో రూపొందించినట్లు చెప్పారు. అక్కడ థియేటర్లు, టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ప్రారంభ వసూళ్లు తక్కువగా కనిపిస్తాయి, అయితే లాంగ్ రన్ బలమైన ప్రభావం చూపిస్తుందని ఆయన విశ్లేషించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయంసినిమా వసూళ్ల వివరాలను చూస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా మొదటి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ₹155 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో నికరంగా ₹81.63 కోట్లు వసూలు

నిర్మాత నాగవంశీకి ఈ ఏడాది గోల్డెన్ ఇయర్‌గా మారింది. వరుస విజయాలతో గతేడాది ఎదురైన నష్టాలు, విమర్శలకు బాక్సాఫీస్ కలెక్షన్లతో గట్టి సమాధానం ఇచ్చారు. టాలీవుడ్లో నిర్మాతలు చాలామంది ఉంటారు. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్, క్రేజ్ క్రియేట్ చేసుకున్న నిర్మాతలు మాత్రం కొందరే కనిపిస్తారు. అందులో ముందు వరుసలో వినిపించే పేరు సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) అలియాస్ చింటూ. సినిమా మేకింగ్‌లోనే కాదు, ప్రమోషన్లలో కూడా ఆయన స్టైలే వేరు. మైక్ పట్టుకుంటే మనసులో ఏముందో ఓపెన్‌గా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం నాగవంశీ నైజం. ఎవరి కోసమో మాట మార్చకుండా, డేరింగ్ అండ్ డాషింగ్‌గా స్టేట్మెంట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. అందుకే ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రేమమ్ సినిమాతో నిర్మాతగా తన జర్నీ మొదలుపెట్టిన నాగవంశీ, సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్‌ను టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ ఏటా కనీసం మూడు నాలుగు రిలీజ్‌లతో థియేటర్లను కళకళలాడేలా చేస్తుంటారు. అయితే సినిమా పరిశ్రమలో గెలుపోటములు సహజం. ఎంతటి టాప్ ప్రొడ్యూసర్‌కైనా ఒక్కోసారి లెక్కలు తప్పుతుంటాయి. గతేడాది నాగవంశీకి కూడా కొన్ని ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. గతేడాది నాగవంశీ ఏకంగా నాలుగు సినిమాలకు నిర్మాతగా, మూడు క్రేజీ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. ఇందులో డాకు మహారాజ్ (Daaku Maharaaj), మ్యాడ్ స్క్వేర్ (Mad Square) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించి మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అలాగే కింగ్డమ్ (Kingdom), మాస్ జాతర (Mass Jathara) చిత్రాలు యావరేజ్ టాక్‌తో నెట్టుకొచ్చాయి. అయితే ఆయన భారీ ఆశలు పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన వార్-2 (War 2), రెట్రో (Retro) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. ఈ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవినా టాండన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. మరీ బ్లాక్ బస్టర్ టాక్ రానప్పటికీ డీసెంట్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో ఎప్పటిలాగే సూర్య తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇక మమితా బైజు తన క్యూట్ యాక్టింగ్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక ఇదే సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రల్లో సంజయ్ విశ్వనాథ్ కొడుకు అభయ్ ఒకటి. సినిమాలో ఈ పిల్లాడు తన క్యూట్ నెస్, న్యాచురల్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అభయ్ అసలు పేరు చార్విక్. చాలా మంది ఈ అబ్బాయిని సెలబ్రిటీల పిల్లాడని అనుకుంటున్నారు. కానీ అదేమీ కాదు. ఈ బాబు కామన్ మ్యాన్ వాళ్ల అబ్బాయి అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో చార్విక్ ను తీసుకోవడం వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉందని వాళ్ల తల్లిదండ్రులు తెలిపారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కోసం 6 నెలల నుంచి ఏడాది వయసున్న పిల్లలు కావాలని మేకర్స్ క్యాస్టింగ్ కాల్ ప్రకటించారు. దీంతో చార్విక్ ను ఆడిషన్ కు తీసుకెళ్లాం. అక్కడ చాలా మంది పిల్లలు ఏడుస్తుండగా చార్విక్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. దీంతో అతని క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నవ్వు చూసి మేకర్స్ వెంటనే సెలెక్ట్ చేశారు

టాలీవుడ్ లో అంతే సక్సెస్ ఉన్న వాళ్ళకే ఇక్కడ డిమాండ్. ప్రస్తుతం వెంకీ అట్లూరి పరిస్థితి అదే. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి బాక్సాఫీస్ సక్సెస్ లతో పాటు ఇటీవల ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో వెంకీ అట్లూరి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ట్రాక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడితో పని చేసేందుకు హీరోలు లైన్ లో ఉన్నారు. అయితే వెంకీ తన నెక్ట్స్ సినిమాను అక్కినేని హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడట. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన మైల్స్టోన్ 25వ చిత్రం కోసం దర్శకుడిని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు చైతన్య కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని చిత్రాలుగా ఇతర భాషల హీరోలతో పని చేసిన వెంకీ ఈసారి ప్రాపర్ తెలుగు హీరోతో ఓ వైవిధ్యమైన కథను తెరకెక్కించాలని భావిస్తున్నారు. గతంలో తాను రాసుకున్న అనేక కథలను ముందుగా నాగ చైతన్యకే వినిపించానని వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ క్రేజీ కాంబినేషన్‌ను నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అక్కినేని అఖిల్ కు లెనిన్ తో సూపర్ హిట్ ఇచ్చాడు నాగవంశీ. ఇప్పడు నాగ చైతన్య మైల్ స్టోన్ మూవీని నాగవంశీ టేకప్ చేసి వెంకీ అట్లూరితో మరో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నడట నాగవంశీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన ఓ ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు.నిర్మలా సీతారామన్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. "గౌరవనీయ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు అచంచలమైన శక్తితో దేశ ప్రగతికి మార్గనిర్దేశం చేస్తూ, సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను" అని చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.ఈరోజు నిర్మలా సీతారామన్ పుట్టినరోజు కావడంతో ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు. అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు. ఆపారమైన శక్తితో దేశ ప్రగతిని ఆమె ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చంద్రబాబు, లోకేశ్ పోస్టు పెట్టారు. 'గౌరవనీయ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను. దేశ ప్రగతికి మీరు అదే అంకితభావం, అవిశ్రాంత శక్తితో మార్గనిర్దేశం చేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్‌కు మంత్రి నారా లోకేశ్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ఆమె అందిస్తున్న విశిష్ట సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రికి మంచి ఆరోగ్యం, సంతోషం, మరింత శక్తి లభించాలని దేవుడిని కోరారు. రాబోయే ఏడాది మరిన్ని విజయాలు సాధించాలని లోకేశ్ ప్రార్థించారు. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చెడిపోయిన ప్రతి మొక్కకు వెయ్యి సాయం.. కొత్త మొక్కలు పెట్టిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు (Nirmala Sitharaman) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత ఆర్థిక ప్రస్థానం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.. నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. నారీ శక్తికి ప్రతీకగా నిర్మలా సీతారామన్ ప్రస్థానం కొనసాగుతోందని కితాబు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి ఆమె సకాల సహకారం అందిస్తున్నారని కొనియాడారు. నిర్మలా సీతారామన్‌కు అమ్మ దుర్గ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యం, శక్తి, దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షించారు. దేశ సేవలో నిర్మలా సీతారామన్ మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని పవన్ కల్యాణ్ అభిలాషించారు. నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

3 కేసుల్లో 33.98 లక్షలు లూటీ.. నిర్మలా సీతారామన్ పేరుతో ఏఐ ప్రకటన హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో సోమవారం ఒక్కరోజే సైబర్ నేరగాళ్లు రూ. 33.98 లక్షలు కొల్లగొట్టారు. బాధితుల్లో ఇద్దరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. ఒక దినసరి కూలీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి వాయిస్‌తో... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వాయి్‌సతో.. ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్) వీడియోను తయారు చేసిన సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలంటూ బురిడీ కొట్టించారు. నగరానికి చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ అసిస్టెంట్ కమాండెంట్ (సీఆర్పీఎఫ్) నుంచి రూ.3.85 లక్షలు దోచేశారు. ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ఇన్వెస్టిమెంట్ ప్లాన్స్, అధిక లాభాల గురించి వివరించాడు. పెట్టుబడి పెట్టడానికి సమ్మతించడంతో ఆధార్, పాన్, బ్యాంకు డిటెయిల్స్ తీసుకొని రిజిస్టర్ చేశారు. తర్వాత ప్రారంభంలో రూ.20వేలు మాత్రమే పెట్టుబడి పెట్టించి మంచి లాభాలు వచ్చినట్లు డాలర్స్‌లో (యూఎ్‌సడీ) చూపించారు. ప్రారంభంలో మంచి లాభాలు అందుకున్న బాధితుడిని మెల్లగా ఇన్వెస్ట్ మెంట్ ఊబిలోకి దింపారు. విడతల వారీగా పెట్టుబడులు పెట్టించి రూ.3.85 లక్షలు దోచేశారు. ఏపీకే ఫైల్స్‌తో రూ.30 లక్షలు.. ఏపీకే ఫైల్స్ పంపి.. వాటిని క్లిక్ చేయగానే ఫోన్ హ్యాక్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్.. నగరంలో ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, మరో దినసరి కూలీ నుంచి రూ. 30 లక్షలు దోచేశారు. బుద్వేల్‌కు చెందిన 63 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఏపీకే ఫైల్ మెసేజ్ వచ్చింది. మీరు ఖాతాకు కేవైసీ అప్డేట్ చేయలేదని అందుకే ఖాతాను బ్లాక్ చేస్తున్నట్లు అందులో ఉంది. వెంటనే అప్డేట్ కోసం లింకును డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పడంతో బాధితుడు ఆ ఫైల్‌ను ఇన్స్టాల్ చేశాడు. అంతే

నాగచైతన్య తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మైలురాయి చిత్రం కోసం యువ దర్శకుడు వెంకీ అట్లూరిని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. గతంలో వెంకీ అట్లూరి పలు కథలను నాగచైతన్యకు వినిపించినట్లు ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ మరియు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి వరుస విజయాలతో వెంకీ అట్లూరి ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇతర భాషల హీరోలతో సినిమాలు చేసిన వెంకీ అట్లూరి, ఇప్పుడు ఒక స్వచ్ఛమైన తెలుగు కథతో ముందుకు రానున్నారు. ఇందుకోసం నాగచైతన్య సరైన ఎంపిక అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా కథాంశం వైవిధ్యంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్నట్లు సమాచారం. ఇటీవల అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాగవంశీ, ఇప్పుడు నాగచైతన్యతో కలిసి మరో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య 25వ సినిమా బాధ్యతలను ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది. అన్ని అంశాలు కుదిరిన తర్వాత త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కథ, కథనం మరియు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా కొంత సమయం

ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఈ ఫీచర్లు చూస్తే అవాక్కే..ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఈ ఫీచర్లు చూస్తే అవాక్కే. Venkatrao Lella Images: Pinterest 17 AUG 2026 దేశంలో కరెన్సీ నోట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుమతి మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. రూ.10, రూ.20 పాలిమర్ నోట్లను పైలట్ ప్రాజెక్ట్ కింద చలామణిలోకి తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రయోగాత్మకంగా రూ.10, రూ.20 నోట్లను చెరో 100 కోట్ల నోట్ల చొప్పున తొలుత చలామణిలోకి తీసుకురానుంది. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 25 కింద ఆర్బీఐ బోర్డు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించగా ఆమోదం లభించింది. నోట్లను చలామణిలోకి తీసుకొచ్చాక ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తారు. విజయవంతమైతే.. కాగితపు నోట్లతో పాటు వీటిని సైతం సాధారణ చలామణిలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. అయితే ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన కరెన్సీ నోట్లను తొలగించమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రెండు సమాంతరంగా చలామణిలో ఉంటాయని తెలిపింది. ఎప్పటిలాగే పేపర్ నోట్లను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ప్లా్స్టిక్ నోట్ల తయారీ అనేది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. ఎంత ఖర్చు అవుతుందనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని కేంద్రం తెలిపింది. ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకొస్తామని ఇప్పుడే చెప్పలేమని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే 2027 ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నుంచే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ నోట్లను సింథటిక్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. నీటిలో తడిచినా లేదా మురికి పట్టినా ఇవి పాడవ్వవు. ప్లాస్టిక్ నోట్లలో అనేక భద్రతా ఫీచర్లు, పారదర్శక విండోలు ఉంటాయి. దీంతో నకిలీ నోట్లను ప్రింట్

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోంది. ఎంతలా అంటే ఇప్పుడీ హీరోయిన్ సినిమా చేస్తే సూపర్ హిట్ అన్న విధంగా మారిపోయింది. ఆ హిట్ అవుతోన్న సినిమాలు కూడా వందల కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే ది మోస్ట్ లక్కీ ఛార్మ్ గా మారిపోయిందీ క్రేజీ హీరోయిన్. కేరళ రాష్ట్రం ,కొట్టాయం సమీపంలోని కిడంగూర్ అని గ్రామానికి చెందిన ఈ చిన్నది ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చిన్నతనంలోనే తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అయితే డిగ్రీ పూర్తి చేయకుండానే హీరోయిన్ గా మళ్లీ సినిమాల్లో అడుగు పెట్టింది. 2017 నుంచే సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ రెండేళ్ల క్రితమే తెలుగుతెరకు పరిచయమైంది. కేవలం డబ్బింగ్ చిత్రాలు మాత్రమే చేస్తున్నా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. ముఖ్యంగా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారు హృదయాలు కొల్లగొడుతోందీ అందాల తార. అలాగే తన అభినయంతో చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడీ హీరోయిన్ పేరు మళ్లీ మార్మోగుతోంది. లేటెస్ట్ గా ఆమె నటించిన ఒక సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఆమె మరెవరో కాదు ప్రేమలు సినిమతో పలకరించి ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో తన అల్లరితో ఆకట్టుకున్న మమితా బైజు. ప్రేమలు తర్వాత జీవీ ప్రకాశ్ కుమార్ తో రెబెల్ సినిమాలో చేసింది మమితా బైజు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా మమితా యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. దీని తర్వాత ప్రదీప్ రంగనాథన్ తో కలిసి డ్యూడ్, ధనుష్ తో కలిసి కర అనే సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ. ఈ సినిమాలన్నీ

తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సినిమాల జాతర. 2027 సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఇప్పటికే పలు ఆసక్తికరమైన కాంబినేషన్లు, భారీ ప్రాజెక్ట్‌లు సిద్ధమవుతుండటంతో అప్పుడే సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. 2027 సంక్రాంతి రేసులో అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన సినిమాలను ఓసారి చూస్తే.. వెంకటేష్ – కల్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి : సంక్రాంతి కింగ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలసి ఒక క్రేజీ మల్టీస్టారర్ గా కత్తిలాంటి ఐడియాతో వస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి నవ్వుల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ : ‘హను-మాన్’ వంటి సంచలన విజయాన్ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. సాయి ధరమ్ తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రవితేజ – శ్రీవిష్ణు – దిల్ రాజు : మాస్ మహారాజా రవితేజ కామెడీ అండ్ విలక్షణ నటనకు పేరుగాంచిన శ్రీవిష్ణు కాంబినేషన్లో ఒక హిలేరియస్ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఎంటర్టైనర్కు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్ – శ్రీను వైట్ల –జార్జ్ క్రిష్ :‘సంక్రాంతి హీరో’గా పేరున్న శర్వానంద్, ఎంటర్టైన్మెంట్ సినిమాల స్పెషలిస్ట్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ ‘జార్జ్ క్రిష్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 14, 2027న విడుదల చేసేలా ప్లాన్ చేశారు. కార్తి – కళ్యాణ్ శంకర్ –
సౌతిండియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ వర్సలైట్ యాక్టర్ సూర్య నటించిన బైలింగ్వల్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ దూసుకుపోతోంది. తెలుగులో వరుస హిట్లతో జోరుమీదున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టండన్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. వినోదం, సున్నితమైన కుటుంబ భావోద్వేగాల కలయికతో రూపొందిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. చాలాకాలం తర్వాత సూర్య ఒక ఆహ్లాదకరమైన ఫ్యామిలీ డ్రామాలో కనిపించడం, వెంకీ అట్లూరి మార్క్ ఎమోషన్స్ వర్కవుట్ అవ్వడంతో చిత్రానికి పాజిటివ్ టాక్ లభిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.* సంక్రాంతి బ్లాక్‌బస్టర్ లోడింగ్... లీవ్స్, హాలిడేస్ లేకుండా ర్యాంప్ ఆడేస్తున్న అనిల్ రావిపూడిబాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తన సత్తా చాటుతోంది. మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లలో అనూహ్యమైన వృద్ధి కనిపించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు రూ. 74.47 కోట్ల గ్రాస్ రాబట్టి ప్రభంజనం సృష్టించింది. ఇండియాలో మొదటి రోజు రూ. 17.74 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు మరింత పుంజుకుని ఏకంగా రూ. 25 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మొత్తంగా ఇండియా వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 43.47 కోట్ల గ్రాస్ (సుమారు రూ. 37.60 కోట్ల నెట్) నమోదు చేసింది. ప్రాంతాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) రూ. 17 కోట్లు, తమిళనాడులో రూ. 18 కోట్లు, కర్ణాటకలో రూ. 5 కోట్లు, కేరళలో రూ. 3.50 కోట్లు సాధించి సాలిడ్ హోల్డ్ కనబరిచింది.* లక్షలాది మంది ఆకలి తీర్చిన ‘ఎన్టీఆర్ మీల్’ సర్వీస్ బంద్ఓవర్సీస్లో

ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ''ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ఇది నాకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగ ప్రయాణం' అని సూర్య (Suriya) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'విశ్వనాథ్ & సన్స్’ (Viswanath & Sons) వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటించగా, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ఆడుతోంది. సక్సెస్ లో భాగంగా చిత్రబృందం సెలబ్రేషన్స్ నిర్వహించింది. సూర్య మాట్లాడుతూ 'వ్యక్తిగత అనుబంధాలతో కూడిన కుటుంబ కథలు చాలా ముఖ్యమైనవి. త్రివిక్రమ్ సర్ మొదటి నుంచి ఇలాంటి కథలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఇకపై కూడా ఈ తరహా కథలతో మరిన్ని సినిమాలు వస్తాయని నేను భావిస్తున్నాను. ఇలాంటి విజయాలను కేవలం అమ్ముడైన టికెట్ల సంఖ్యతో లెక్కలు కట్టలేం. ప్రేక్షకులు సినిమాలో నవ్విన నవ్వులు, పెట్టిన కన్నీళ్లను లెక్కల్లో చూపించగలమా? సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా మాట్లాడుకుంటున్నారు, ఎంతగా కనెక్ట్ అవుతున్నారు అనేదే నాకు ముఖ్యం ఇదొక భావోద్వేగ ప్రయాణం. ఈ అద్భుతమైన కథను, చక్కని పాత్రలను రాసి ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రెట్టింపు స్థాయిలో వసూళ్లు రావడం, తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు వేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళనాడు నుంచి వచ్చాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. మమితా కేరళ నుంచి, రవీనా మహారాష్ట్ర నుంచి వచ్చారు. మేమంతా

ఒకప్పుడు భర్తలు భార్యలను హతమారుస్తున్న ఘటనలు జరిగేవి. ఇటీవల కాలంలో భార్యలే అత్యంత దారుణంగా భర్తలను పరలోకాలకు పంపిస్తున్న సంఘటనలు పెరిగిపోయాయి. అనుమానాలతో కొందరు, అక్రమ సంబంధాలతో కొందరు, ఆస్తి కోసం కొందరు ఇలా రకరకాలుగా దారుణ హత్యలకు పాల్పడుతున్నారు. సినిమాలలో కూడా చూడని విధంగా క్రిమినల్ వైఫ్స్ కొత్త కొత్త ప్లాన్ లు, స్కెచ్ లతో భర్తలను చంపేస్తున్నారు.అనుమానంతో భర్తను హతమార్చిన భార్య తాజాగా అలాంటి ఘటనే ఏపీలో జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. సుమారు మూడు దశాబ్దాల దాంపత్య జీవితం అనుమానం కారణంగా విషాదాంతంగా ముగిసింది. అనుమానం పెద్ద భూతంగా మారి భార్యను భర్తను హత్య చేసే స్థాయికి తీసుకెళ్లింది.ప్రేమ వివాహం చేసుకున్న కపుల్ రామ్మోహనరావుపేట సమీప అంబేడ్కర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్న కొండ్ల ఇందిర, ఆమె భర్త వెంకటరావు (58) లకు నలుగురు కుమార్తెలు. ఒక కూతురికి వివాహం జరిగింది. వెంకటరావు ప్రైవేటు కేబుల్ నెట్‌వర్క్‌లో ఉద్యోగం చేసేవాడు. భార్యా భర్తలు ఇద్దరూ స్థానికులే. వారిది ప్రేమ వివాహం. కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసుల సహాయంతో పెళ్లి చేసుకున్నారు.వేరే మహిళతో సంబంధం ఉందని భర్త గొంతు కోసిన ఇందిరవెంకటరావు మరో మహిళతో సంబంధం ఉందన్న అనుమానంతో దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతుండేవి. అనకాపల్లిలో ఉన్న కుమార్తె ఇంటి నుంచి శనివారం తిరిగి వచ్చాక మళ్లీ తీవ్రమైన గొడవ జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ దగ్గరకే వెంకటరావు వెళ్లి వచ్చాడని భావించి, ఆ సమయంలో పట్టరాని ఆవేశంతో ఇందిర కత్తి తీసుకుని భర్త గొంతు కోసి హత్య చేసింది. తర్వాత మృతుని తల వద్ద దీపం పెట్టి పోలీసుల ముందు లొంగిపోయింది.ఏపీలో వారికి తీపికబురు.. ఆగస్టు 20లోగా మీ ఖాతాల్లో రూ.25 వేలు!హత్యకు పాల్పడిన ఇందిర అంగన్వాడీ కార్యకర్త ఈ

ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ''ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ఇది నాకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగ ప్రయాణం' అని సూర్య (Suriya) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'విశ్వనాథ్ & సన్స్’ (Viswanath & Sons) వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటించగా, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ఆడుతోంది. సక్సెస్ లో భాగంగా చిత్రబృందం సెలబ్రేషన్స్ నిర్వహించింది. సూర్య మాట్లాడుతూ 'వ్యక్తిగత అనుబంధాలతో కూడిన కుటుంబ కథలు చాలా ముఖ్యమైనవి. త్రివిక్రమ్ సర్ మొదటి నుంచి ఇలాంటి కథలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఇకపై కూడా ఈ తరహా కథలతో మరిన్ని సినిమాలు వస్తాయని నేను భావిస్తున్నాను. ఇలాంటి విజయాలను కేవలం అమ్ముడైన టికెట్ల సంఖ్యతో లెక్కలు కట్టలేం. ప్రేక్షకులు సినిమాలో నవ్విన నవ్వులు, పెట్టిన కన్నీళ్లను లెక్కల్లో చూపించగలమా? సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా మాట్లాడుకుంటున్నారు, ఎంతగా కనెక్ట్ అవుతున్నారు అనేదే నాకు ముఖ్యం ఇదొక భావోద్వేగ ప్రయాణం. ఈ అద్భుతమైన కథను, చక్కని పాత్రలను రాసి ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రెట్టింపు స్థాయిలో వసూళ్లు రావడం, తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు వేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళనాడు నుంచి వచ్చాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. మమితా కేరళ నుంచి, రవీనా మహారాష్ట్ర నుంచి వచ్చారు. మేమంతా

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ (పీఎంఐఎస్) కింద పనిచేస్తున్న ఇంటర్న్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె యువతకు ముఖ్యమైన సందేశం ఇచ్చారు. “మీరు ఏ పని చేసినా జాగ్రత్తగా, పరిపూర్ణంగా చేయాలి. ఎందుకంటే చిన్న తప్పు కూడా వేరొకరికి తీవ్ర పరిణామాలు కలిగించవచ్చు” అని ఆమె చెప్పారు.మోటార్‌సైకిల్ తయారీలో ఒక చిన్న భాగంలో తప్పు జరిగితే, కొనుగోలు చేసిన వ్యక్తికి ప్రమాదం, నష్టం కలగవచ్చని ఉదాహరణగా చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో కూడా ఒక వెయ్యి రూపాయల బదులు లక్ష రూపాయలు పంపితే నష్టం ఎవరికి వస్తుందని ప్రశ్నించారు. డిజిటల్ సమాచారం నిర్వహణలో తప్పు జరిగితే కస్టమర్‌కు కొత్త సమస్యలు వస్తాయని హెచ్చరించారు. “మీరు నష్టపోరు, వేరొకరు భరించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి క్షణం పరిపూర్ణంగా పని చేయండి” అని ఆమె సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి వచ్చిన ఇంటర్న్లు పరిశ్రమ అనుభవం, నైపుణ్యాలు సంపాదిస్తున్నారని నిర్మలా సీతారామన్ అభినందించారు. పీఎంఐఎస్ పథకం ద్వారా యువతకు భారత్‌లోని టాప్ 500 కంపెనీల్లో 12 నెలల హ్యాండ్స్-ఆన్ అనుభవం లభిస్తోందని, విద్యా-పరిశ్రమ మధ్య గ్యాప్‌ను తగ్గించడమే దీని లక్ష్యమని తెలిపారు

సినిమా పేరు & తారాగణం సినిమా పేరు: విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons) తారాగణం: సూర్య, మమిత బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టండన్ తదితరులు దర్శకత్వం: వెంకీ అట్లూరి సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి ఎడిటింగ్: నవీన్ నూలి నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కథ : సినిమా కథలోకి వెళితే, సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక అత్యంత ధనవంతుడైన ఇండస్ట్రియలిస్ట్. అంతేకాదు, గతంలో ఓ ఒలింపిక్స్ పోటీలో గన్ సరిగ్గా పని చేయక తన కెరీర్ మలుపు తిరిగిన నేపథ్యం ఉన్న మాజీ షార్ప్‌షూటర్. ఇప్పుడు అతను ఒక కార్పొరేట్ ప్రపంచంలో క్రైసిస్ హ్యాండ్లర్‌గా వ్యవహరిస్తూ ఉంటాడు. జీవితంలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. అయితే తన తల్లి కోరిక మేరకు, ఒక బిడ్డకు తండ్రి కావాలని అతను సరోగసి మార్గాన్ని ఎంచుకుంటాడు. ఈ ప్రయాణంలో అనుకోకుండా అతని జీవితంలోకి మ్యాడీ (మమిత బైజు) ప్రవేశిస్తుంది. మొదట ఒక సాధారణ పరిచయంగా మొదలైన వీరిద్దరి బంధం క్రమంగా ప్రేమగా మారుతుంది. సంజయ్ తన తల్లి కోరికను ఎలా నెరవేర్చాడు? సరోగసి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? విదేశాల నుంచి వచ్చిన మ్యాడీని సంజయ్ తన జీవిత భాగస్వామిగా అంగీకరించాడా? ఈ ప్రయాణంలో కుటుంబం ఎదుర్కొన్న భావోద్వేగాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్ర కథాంశం. విశ్లేషణ: డైరెక్టర్ వెంకీ అట్లూరి ఎప్పుడూ కూడా కాంటెంపరరీ అర్బన్ ఫ్యామిలీ డ్రామాలను చాలా స్టైలిష్‌గా తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటారు. ఈ చిత్రంలో కూడా ఆయన అదే ఫార్ములాను నమ్ముకుని, ఒక సున్నితమైన పాయింట్‌ను ఎంచుకుని కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా ప్రారంభంలోనే సంజయ్ విశ్వనాథ్ పాత్రను పరిచయం చేసే

పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మత్యాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మోష్య సత్యారావు ఫిన్లాండ్లో జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. ప్రాథమిక స్థాయిలో అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, అభ్యాస నైపుణ్యాలను బలోపేతం చేయడానికి ఆగస్టు 17 నుంచి 26వ తేదీ వరకు ఫిన్లాండ్లోని తుర్కు యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎఫ్.ఎల్.ఎన్ శిక్షణా కార్యక్రమంలో సత్యారావు పాల్గొంటారు. మొత్తం 29 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరవుతున్నారు. 2025 సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మోష్య సత్యారావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సంగతి విధితమే. అల్లూరి సీతారామరాజు జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సత్యారావుని జిల్లా విద్యాశాఖ అధికారి, భానుమూర్తి రాజు, ఉప విద్యాశాఖ అధికారి ఎస్ .చెల్లయ్య, మండల విద్యాశాఖ అధికారి కె.ఈశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

వర్సటైల్ స్టార్ హీరో సూర్య, యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్లను అందించే యువ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. కోలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో సూర్య, యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్లను అందించే యువ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons). 'సార్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అటు వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సూర్య హీరోగా నటిస్తుండటంతో మొదటి నుంచీ ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా.. రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని రూ. 130 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే అసలు మేజిక్ ఇక్కడే జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 90 కోట్లకు అమ్ముడుపోగా.. డిజిటల్, శాటిలైట్, ఆడియో వంటి నాన్-థియేట్రికల్ హక్కులు రూ. 125 కోట్లు పలికాయి. అంటే మొత్తంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ రూపంలోనే ఈ చిత్రం రూ. 215 కోట్లు రాబట్టింది. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే మేకర్స్‌కు ఏకంగా రూ. 85 కోట్ల భారీ టేబుల్ ప్రాఫిట్ దక్కింది. సూర్య (Suriya) ఇటీవల నటించిన 'కరుప్పు' చిత్రం బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ. 320 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. ఆ సూపర్ హిట్ ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ ఊపును ఇప్పుడు 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో కూడా కంటిన్యూ చేస్తానని సూర్య చాలా ధీమాగా ఉన్నారు. అంతేకాదు, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సాంగ్స్ యూట్యూబ్‌లో

సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో కథానాయకుడు సూర్య మాట్లాడుతూ.. “ఈ వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే నవీన్ గారికి, మా సినీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధన్యవాదాలు. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నా అభిమానులు, వారి కుటుంబ సభ్యులకు నా నమస్కారం. 28 ఏళ్ళ నుంచి మీరు నాపై ఈ ప్రేమను చూపిస్తున్నారు. మీ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. నాగవంశీ గారు, వెంకీ వల్లే ఇలాంటి మంచి సినిమా సాధ్యమైంది. ఈ సినిమాను మీరు థియేటర్లలో చూసి ఖచ్చితంగా ప్రేమిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాకు ప్రారంభం నుంచి త్రివిక్రమ్ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఆయన మాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. త్రివిక్రమ్ గారు కుటుంబ విలువలతో కూడిన మంచి సినిమాలను, ఈ జనరేషన్ మెచ్చేలా అందించారు. త్రివిక్రమ్ గారిని వెంకీ స్ఫూర్తిగా తీసుకున్నారు. జీవీ ప్రకాష్ అద్భుతమైన సంగీతం అందించారు. వెంకీ, జీవీ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ అవుతుంది. డీఓపీ నిమిష్, ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ ఇలా ప్రతి ఒక్కరూ సినిమా అద్భుతంగా రావడానికి కారణమయ్యారు. ఈ సినిమా కోసం నేను హైదరాబాద్ లో ఉన్న ఆరు నెలలను అసలు మరచిపోలేను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. 20 ఏళ్ల క్రితం గజినీ సినిమాలో నన్ను సంజయ్ రామస్వామిగా ఆదరించారు. అదే మ్యాజిక్ ని తీసుకురావాలని వెంకీ, వంశీ అనుకున్నారు. రాధిక గారి వల్ల
Polymer Notes: భారత దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి రానున్నాయి. రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్ (క్షేత్రస్థాయి పరిశీలన) ప్రాతిపదికన ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ నోట్లకు సంబంధించిన వివరాలు, పేపర్ నోట్లు రద్దు వంటి అంశాలను తెలుసుకుందాం.దేశంలో కరెన్సీ నోట్లకు సంబంధించి కీలక మార్పులు రానున్నాయి. రూ.10, రూ.20 విలువ గల పాలిమర్ నోట్లకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఈ రెండు నోట్లను చెరో 100 కోట్ల నోట్ల చొప్పున (2 బిలియన్ నోట్లు) చలామణిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 25 కింద ఆర్బీఐ బోర్డు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించగా తాజాగా ఆమోదం లభించింది. ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే కాగితపు నోట్లతో పాటు వీటిని సైతం సాధారణ చలామణిలోకి తెస్తామని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.కాగితపు నోట్లను రద్దు చేస్తారా?కొత్తగా ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తీసుకొస్తున్నప్పటికీ ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత కాగితపు నోట్లను ఉపసంహరించే ఉద్దేశం ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైనా మార్కెట్లో పాత కాగితపు నోట్లు, పాలిమర్ నోట్లు (Plastic Notes) రెండూ సమాంతరంగా చలామణిలో ఉంటాయని తెలిపింది. అయితే, పాలిమర్ నోట్ల తయారీ ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో, అందుకు ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని ఆర్థిక మంత్రి తన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.పాలిమర్ నోట్లు ఎందుకు

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Plastic Currency Notes in India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతిపాదించిన ₹10, ₹20 నోట్లలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను క్షేత్రస్థాయి పరిశీలన (Field Trials) కోసం ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని మంగళవారం రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు. ఒక్కో విభాగంలో వంద కోట్ల పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్‌కు పంపించనున్నారు. కేంద్ర ఆమోద ముద్ర వేసినంత మాత్రన తక్షణమే దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం లేదు. క్షేత్రస్థాయి ప్రయోగాలు విజయవంతమైతే.. ఇప్పటికే ఉన్న కాగితపు కరెన్సీతో పాటు పాలిమర్ ₹10, ₹20 నోట్లను ప్రవేశపెట్టనున్నారు. ఆర్బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 25 ప్రకారం ఆర్బీఐ సెంట్రల్ బోర్డు ప్లాస్టిక్ నోట్ల ప్రణాళికను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ప్రయోగాత్మక పరిశీలనలు సక్సెస్ అయితే.. సాధారణ చెలామణిలోనూ ఈ నోట్లను కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లను తక్షణమే పూర్తిగా ఉపసంహరించుకోకుండా.. కొత్త పాలిమర్ నోట్లను కూడా వాటితో పాటు సమాంతరంగానే చెలామణిలోకి తీసుకువస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ నోట్ల కొనుగోలు, తయారీ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని.. అందువల్ల ఇవి కచ్చితంగా ఏ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి..? లేదా ఈ ప్రాజెక్ట్‌కు ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను ఇప్పుడే ఖరారు చేయలేమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సందర్భంలో ఆర్థిక మంత్రి దేశ ద్రవ్యోల్బణం పరిస్థితిపై కూడా వివరణ ఇచ్చారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Lady teacher swept away in flood water in ap: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ నుంచి అతి భారీగా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల ఎల్ నినో ప్రభావంతో ఇప్పటికి కూడా వానలు కురవక పోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం వరుణుడు కుండపోతగా వానలు కురిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విధి నిర్వహణ కోసం బయలుదేరిన ఒక ఉపాధ్యాయురాలు ఆకస్మికంగా వరదలో చిక్కుకుంది. ఈ ఘటన వార్తలలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా కర్లపొద గ్రామం వద్ద ఈ భయంకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎం. మణి ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లేందుకు బయలు దేరింది. ఇంతలో ఆమె మార్గంలో వాగును దాటుతుండగా వరద ప్రవాహం విపరీతంగా పెరిగిపోయింది.దీంతో ఆమె వరదలో కొంత దూరం కొట్టుకుని పోయింది. ఆ తర్వాత ఆమె ఒక చెట్టు కొమ్మను పట్టుకుంది. అక్కడ అరవడంతో చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమై వెంటనే ఆమెను కాపాడారు. Read more: Tirupati: తిరుపతి అటవీ ప్రాంతంలో 22 ఏనుగుల సంచారం.!. హైఅలర్ట్ జారీచేసిన ఫారెస్ట్ సిబ్బంది... వీడియో వైరల్.. అనంతరం హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. పెద్ద ప్రమాదం నుంచి బైటపడటంతో లేడీ టీచర్ ఊపిరిపీల్చుకుంది. దీనిపై ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఆ వాగుపై వెంటనే బ్రిడ్జి నిర్మించాలని స్థానిక ప్రజలు
.webp)
దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ.. నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు పార్లమెంట్ ఆమోదం..! భారతీయ కరెన్సీ వ్యవస్థలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. చిన్న డినామినేషన్లయిన రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రయోగాత్మకంగా చెలామణిలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో కీలక ప్రకటన వెలువడింది. ఈ క్షేత్రస్థాయి పరిశీలనల (ఫీల్డ్ ట్రయల్స్) కోసం ఒక్కో డినామినేషన్ పరిధిలో 100 కోట్ల చొప్పున పాలిమర్ నోట్లను ముద్రించి జారీ చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్బీఐ చట్టం-1934లోని సెక్షన్ 25 ప్రతిపాదనల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు సమర్పించిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన, ఈ నోట్ల మన్నికను పరిశీలించిన తర్వాతే తదుపరి విస్తరణపై నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా రానున్న పాలిమర్ నోట్లు ప్రస్తుత కాగితపు నోట్లకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వాటితో పాటే మార్కెట్లో చెలామణి అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి పాత కాగితపు నోట్లు రద్దవుతాయనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. సాధారణంగా చిన్న డినామినేషన్ కరెన్సీ నోట్లు తరచుగా చేతులు మారడం, తడిచిపోవడం లేదా చిరిగిపోవడం వల్ల త్వరగా పాడైపోతుంటాయి. దీనివల్ల ఆర్బీఐ ప్రతి ఏటా కోట్లాది రూపాయల వ్యయంతో కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తోంది. అయితే పాలిమర్ ఆధారిత కరెన్సీ నోట్లు నీటిలో తడిచినా పాడవవు, కాగితపు నోట్లతో పోలిస్తే చాలా కాలం మన్నికగా ఉంటాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా వంటి పలు అంతర్జాతీయ దేశాల్లో పాలిమర్ కరెన్సీ విజయవంతంగా చెలామణిలో ఉంది. భారత వాతావరణ పరిస్థితులు, వినియోగదారుల వినియోగ అలవాట్లకు ఈ నోట్లు ఎంతవరకు అనుకూలంగా ఉంటాయో తెలుసుకోవడానికే ప్రస్తుత ప్రయోగాత్మక పరిశీలనలు నిర్వహిస్తున్నారు

ఏపీలో స్కూల్‌కు వెళ్తూ వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది.. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విధి నిర్వహణకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలు తీవ్ర ప్రమాదం నుండి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే క్రమంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆమె, సమయస్ఫూర్తితో చెట్టు కొమ్మను పట్టుకుని నిలదొక్కుకోగా గ్రామస్థులు చాకచక్యంగా కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కర్లపొద గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎం. మణి ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎప్పటిలాగే ఆమె ఉదయం విధుల్లోకి చేరేందుకు పాఠశాల వైపు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఉన్న వాగు వద్దకు చేరుకునేసరికి ఎగువ ప్రాంతాల నుంచి ఆకస్మికంగా వరద నీరు పెరిగింది. విధులకు సమయానికి చేరుకోవాలనే తపనతో ఆమె వాగును దాటేందుకు ప్రయత్నించగా, ఒక్కసారిగా వచ్చిన నీటి ఉద్ధృతికి తట్టుకోలేక ప్రవాహంలో కొట్టుకుపోయారు. వరద నీటిలో కొంతదూరం కొట్టుకుపోయిన మణి, అదృష్టవశాత్తు ఒడ్డు సమీపంలో ఉన్న ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకోగలిగారు. వెంటనే కేకలు వేస్తూ సాయం కోసం అభ్యర్థించారు. ఆమె ఆక్రందనలు విన్న సమీప గ్రామస్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వాగులోకి దిగి, ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆమెను హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ధ్రువీకరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ వాగు పొంగిపొర్లుతూ పాఠశాల పిల్లలకు, ఉద్యోగులకు, గ్రామస్థులకు నరకం చూపిస్తోందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించి కర్లపొద వాగుపై తక్షణమే పక్కా వారధి (బ్రిడ్జి) నిర్మించాలని, భవిష్యత్తులో ఇటువంటి భయాందోళనకర పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

దేశంలో కరెన్సీ వాడకంలో త్వరలోనే ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. మనం రోజువారీ లావాదేవీల్లో వాడే పేపర్ నోట్లకు బదులుగా పాలిమర్ నోట్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలి విడతగా రూ.10, రూ.20 నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చి నాణ్యత, మన్నికను పరిశీలించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభ వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. దీనితో పాటు దేశంలో ద్రవ్యోల్బణం, పన్నుల తగ్గింపు, పెట్రోల్ సరసమైన ధరలు, ప్రజల ఆదాయం పెరిగిన తీరుపై సమగ్ర వివరాలను సభకు సమర్పించారు.దేశంలో కరెన్సీ వాడకంలో త్వరలోనే ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. మనం రోజువారీ లావాదేవీల్లో వాడే పేపర్ నోట్లకు బదులుగా పాలిమర్ నోట్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలి విడతగా రూ.10, రూ.20 నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చి నాణ్యత, మన్నికను పరిశీలించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభ వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. దీనితో పాటు దేశంలో ద్రవ్యోల్బణం, పన్నుల తగ్గింపు, పెట్రోల్ సరసమైన ధరలు, ప్రజల ఆదాయం పెరిగిన తీరుపై సమగ్ర వివరాలను సభకు సమర్పించారు.RBI Plastic Notes: పార్లమెంట్ సాక్షిగా అధికారిక ప్రకటన, పాత నోట్లు రద్దు?సాధారణంగా చిన్న నోట్లు చేతులు మారి త్వరగా నలిగిపోవడం లేదా పాడైపోవడం జరుగుతుంటుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదన మేరకు 100 కోట్ల సంఖ్యలో రూ.10, రూ.20 పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇవి ప్రాథమిక సేకరణ దశలో ఉన్నాయని, త్వరలోనే మార్కెట్లో చలామణిలో ఉన్న పేపర్ నోట్లతో పాటు సమాంతరంగా ఇవి అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. ఇవి నీటిలో తడిచినా, ఎంత వాడినా పాడవకపోవడం వీటి ప్రత్యేకత. కాగా ఈ నోట్లు 2027 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్బీఐ రంగం సిద్ధం చేసిందిపంటలు, పెట్రోల్‌పై

విధి నిర్వహణ కోసం బయలుదేరిన ఒక ఉపాధ్యాయురాలిని ఆకస్మికంగా వచ్చిన వరద ఉద్ధృతి ముంచెత్తింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కర్లపొద గ్రామం వద్ద ఈ భయంకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులను నిర్వర్తిస్తున్న ఎం.మణి ఎప్పటిలాగే స్కూలుకు వెళ్లేందుకు బయలుదేరగా, మార్గమధ్యంలో ఉన్న వాగును దాటే క్రమంలో ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. భారీ ప్రవాహంలో కొంతదూరం కొట్టుకుపోయిన ఆమె, ఒక చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తూ బిగ్గరగా కేకలు వేశారు. ఆ కేకలు విన్న గ్రామస్థులు తక్షణమే స్పందించి, ప్రాణాలకు తెగించి ఆమె వద్దకు చేరుకుని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు, గ్రామస్థులు తెలిపారు. ఏటా వర్షాకాలంలో ఈ వాగు పొంగిపొర్లుతూ ప్రాణాలమీదికి తెస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ వాగుపై వెంటనే బ్రిడ్జి నిర్మించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
UPI MDR Charges : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారులకు ఎలాంటి లావాదేవీ ఛార్జీలు ఉండవని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ను (MDR) ప్రవేశపెట్టినా అది కేవలం వినియోగదారులకే కాకుండా కొన్ని ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. దీంతో యూపీఐ ఛార్జీలు వస్తాయన్న ఆందోళనలకు కేంద్రం స్పష్టత ఇచ్చినట్లయింది.యూపీఐ ప్రారంభమైనప్పటి నుంచి కూడా వినియోగదారులకు ఉచితంగానే డిజిటల్ చెల్లింపులు అందుబాటులో ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక ముందు కూడా ప్రతి భారతీయుడు ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లించకుండానే యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని రాజ్యసభలో స్పష్టం చేశారు. యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం పన్ను లేదా నేరుగా వినియోగదారుల నుంచి ఛార్జీ వసూలు చేసే విధానాన్ని ఈ బిల్లు ప్రతిపాదించడం లేదని ఆమె వివరించారు. ముఖ్యంగా చిన్న దుకాణాలు, రోడ్డు పక్కన వ్యాపారులు, చిన్న వ్యాపార సంస్థల దగ్గర జరిగే తక్కువ విలువైన చెల్లింపులు ఎక్కువగా ఉచితంగానే కొనసాగుతాయని తెలిపారు.అసలు ఎండీఆర్ అంటే ఏంటి?మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అనేది వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల్ని స్వీకరించేందుకు చెల్లించే రుసుము. సాధారణంగా ఈ మొత్తాన్ని పేమెంట్ సిస్టమ్‌లోని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు వంటి సంస్థల మధ్య పంచుకుంటారు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల విషయంలో జీరో ఎండీఆర్ విధానం అమల్లో ఉంది. అంటే వ్యాపారి యూపీఐ ద్వారా కస్టమర్ నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఆ లావాదేవీపై ఎండీఆర్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధానం వల్ల డిజిటల్ చెల్లింపులు దేశంలో భారీగా పెరిగాయి.Read Also: జులైలో అత్యధికంగా అమ్ముడుబోయిన కార్లు ఇవే.. వార్నీ మారుతీ నుంచే 6 మోడల్స్ ఉన్నాయిగా!ఇక యూపీఐ వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ దాని నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, సాంకేతిక మౌలిక వసతులు వంటి వాటికి భారీగా

రూపే, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ల ద్వారా జరిపే లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తారన్న అనుమానాలపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. న్యూఢిల్లీ, ఆగస్టు 10: రూపే, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ల ద్వారా జరిపే లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తారన్న అనుమానాలపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రాజ్యసభలో స్పష్టత ఇచ్చారు. వీటిని ఉపయోగించే వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోరని పేర్కొన్నారు. కొన్ని రకాల లావాదేవీలకు మాత్రర భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు చేసే అవకాశం ఉందని తెలిపారు. దీనిని ఇంకా ఖరారు చేయలేదని, తరువాత నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని తెలిపారు. ఛార్జీలు వసూలు చేసేందుకు వీలు కలిగేంచేలా చట్టాన్ని సవరించామే తప్ప, వినియోగదారుల నుంచి ఇప్పటికిప్పుడు వసూలు చేయడానికి కాదని చెప్పారు. ఏ వస్తువుపై ఎండీఆర్ వసూలు చేయాలి, ఎంత ధరకు పరిమితం చేయాలన్న దాన్ని తరువాత నిర్ణయిస్తామని తెలిపారు. యూపీఐ విధానాన్ని 2016లో ప్రారంభించగా, అప్పటి నుంచి ఉచితంగా సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. అది కొనసాగుతుందని తెలిపారు. చిరు వ్యాపారులపై భారం పడబోదన్నారు. ఈ సందర్భంగా సీపీఎం సభ్యుడు జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ అమెరికా ఒత్తిడి మేరకే యూపీఐ చెల్లింపులపై రుసుములు వసూలు చేయాలని నిర్ణయించారని ఆరోపించారు. దీనిపై మంత్రి చెప్పే సమాధానం వినకుండానే ఆయన వాకౌట్ చేశారు. ఆమె స్పందిస్తూ ‘కమ్యూనిస్టులే అంత... వాస్తవాలు చెప్పరు. ఆపై వక్రీకరణలు’ అని వ్యాఖ్యానించారు. సమాధానం వినే ధైర్యం లేని పిరికిపందలని విమర్శించారు. సవరణ బిల్లును రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. పరిశీలన నిమిత్తం లోక్‌సభకు పంపించింది. తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం.. సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు

తొలిప్రేమ, సార్, లక్కీ భాస్కర్ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలతో పాటు వరుస ప్రాజెక్ట్‌లతో స్టార్ డైరెక్టర్ గా మారాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. మరోవైపు టాలీవుడ్లో వరుస సినిమాలతో హల్ చల్ చేస్తుంది కథానాయకి మీనాక్షి చౌదరి. అలాగే వరుస ప్లాప్స్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ. ఈ ముగ్గురు ఇప్పుడు డిజిటల్ వేదికపై ఒక భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డ, గ్లామరస్ బ్యూటీ మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక మైండ్ బ్లోయింగ్ బ్యాంక్ హీస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కోసం నిర్మిస్తున్నారు. తెలుగులోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కాస్ట్లీయెస్ట్ వెబ్ సిరీస్‌గా ఇది రికార్డు సృష్టించనుంది. మీనాక్షి చౌదరిఈ వెబ్ సిరీస్‌తో ఓటీటీ స్పేస్‌లోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది మీనాక్షి. సిద్ధు, మీనాక్షి మధ్య వచ్చే సన్నివేశాలు ఒక డిఫ్రెంట్ ఎక్స్ప్రిరియన్స్ ఇష్టమట. ప్రస్తుతం సూర్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి భారీ చిత్రాన్ని పూర్తి చేసిన అనంతరం వెంకీ అట్లూరి ఈఓటీటీ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, సరికొత్త కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రేపు లోక్‌సభ, రాజ్యసభల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీటిలో కేరళ పేరు మార్పు, ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు, గనులు, ఖనిజాల చట్ట సవరణ తదితర బిల్లులున్నాయి. ఢిల్లీ, ఆగస్టు 9: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రేపు (సోమవారం) లోక్‌సభ, రాజ్యసభల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేరళ పేరు మార్పు (Kerala Alteration of Name Bill, 2026) కేరళ రాష్ట్రం పేరును 'కేరళం'గా మారుస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వివిధ ట్రిబ్యునళ్ల చైర్పర్సన్లు, సభ్యుల నియామకాలు, సేవా నిబంధనలలో పారదర్శకత, స్వతంత్రతను పెంచేందుకు ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు (Tribunals Reforms Bill, 2026) చట్టసభల ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దీనిని ప్రవేశపెడతారు. గనులు, ఖనిజాల చట్ట సవరణ (MMDR Amendment Bill, 2026): గనులు, ఖనిజాల అభివృద్ది, క్రమబద్ధీకరణ చట్టం-1957కు సవరణలు చేసే బిల్లును కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సమర్పిస్తారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు: ఎన్సీడీసీ (NCDC) చట్టం-1962కు సవరణలు చేస్తూ రూపొందించిన ఈ బిల్లును కూడా అమిత్ షా సభలో ప్రవేశపెట్టనున్నారు. బ్యాంకర్ల పుస్తకాల నిరూపణ బిల్లు (Bankers' Books Evidence Bill, 2026): డిజిటల్ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా బ్యాంకింగ్ సాక్ష్యాధారాల చట్టాన్ని ఆధునీకరించే ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలన, ఆమోదం కోసం మూవ్ చేస్తారు. పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లు: పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007, ఇన్కమ్ టాక్స్ యాక్ట్-2025 లలో అవసరమైన సవరణల కోసం ఈ బిల్లును ఎగువసభ పరిశీలించనుంది. ఈ కీలక బిల్లులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జయంత్ చౌదరి తదితరులు సంబంధిత అధికారిక

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ విధించకుండా బోర్డు క్లియరెన్స్ ఇవ్వడం విశేషం. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సెన్సార్ పూర్తవ్వడంతో చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ప్రమోషన్లను నిర్వహిస్తోంది. ఇది సూర్య కెరీర్లో 46వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గతంలో వచ్చిన ‘కరుప్పు’ చిత్రం భారీ విజయం సాధించడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో సూర్య ‘సంజయ్ విశ్వనాథ్’ అనే పాత్రలో కనిపించనున్నారు. 40 ఏళ్ల అంతర్జాతీయ పిస్టల్ షూటర్‌గా, తన కలల కోసం పోరాడే వ్యక్తిగా ఆయన నటించారు. కుటుంబ బంధాలు మరియు భావోద్వేగాల మధ్య సాగే సంఘర్షణే ఈ సినిమా కథాంశం. ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా, నటి రవీనా టాండన్ దాదాపు 25 ఏళ్ల తర్వాత తమిళ సినిమాలోకి తిరిగి రావడం గమనార్హం. దీంతో ఈ సినిమాపై పరిశ్రమ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందించారు. ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలి నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ప్రమోషన్లలో భాగంగా సూర్య స్వయంగా ఒక డ్యాన్స్ నంబర్ పాడటం విశేషం. అలాగే వెడ్డింగ్ సాంగ్ విడుదల చేసి ప్రేక్షకులలో