
Russia Ukraine War: పోర్న్ నుంచి వచ్చే ఆదాయంతో రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం..
Russia Ukraine War: పోర్న్ నుంచి వచ్చే ఆదాయంతో రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం..

Russia Ukraine War: పోర్న్ నుంచి వచ్చే ఆదాయంతో రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం..

Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!

Delhi University | ఏడు లక్షల మందికి 8 వేల గదులు.. గత్యంతరం లేకనే పీజీల్లో బస..!

Singer Nisar నిసార్ వయనాడ్ కన్నుమూత.. షోకు కొన్ని గంటల ముందే విషాదం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Injured)నుదురు, చేతికి తీవ్ర గాయాలవ్వగా, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కాలికి గాయమైంది.

హీరోయిన్ రాశి సింగ్ (Rashi Singh) రంభ ఊర్వశి మేనక మూవీ షూటింగ్ సెట్స్‌లో తన పాత్రకు సంబంధింన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

నేటి నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. మొత్తం పదహారు మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ఆరుగురు కామనర్స్, పదిమంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు.(Bigg Boss Telugu 10)
Singer Jhansi : అక్కడ టికెట్ గెలుచుకుని వచ్చా.. ఇక్కడ కప్పు గెలచుకుని పోతా: సింగర్ ఝాన్సీ శపథం

NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..

ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశం కేబినెట్లో ఖాళీ అయిన 3 బెర్తుల భర్తీ అంశంపై చర్చ మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం Telangana Cabinet Expansion : తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరింత హీట్ పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 6) నాడు తెలంగాణ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేబినెట్ లో భారీగా మార్పులకు ఛాన్స్ : కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంతో కేబినెట్లో ఖాళీ అయిన 3 బెర్తులను భర్తీ చేసే అంశంపై కాంగ్రెస్ నేతల్లో ఆశలను రేకిత్తిస్తోంది. ఈ కేబినెట్ విస్తరణ సమయంలో విస్తృత మార్పులకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానంతో మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముహుర్తం ఖరారైనట్టేనా? : ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే.. ఆదివారం వరకే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ‘ముహూర్తం’ ఖరారయ్యే అవకాశంపై జోరుగా అంచనాలు పెరుగుతున్నాయి. కేవలం ఒక్కరి తొలగింపుతో ఆగకుండా ఖాళీగా ఉన్న స్థానాలు, పెండింగ్‌లో ఉన్న శాఖల విషయంలో పూర్తి రీ-అరేంజ్మెంట్ జరగవచ్చని భావిస్తున్నారు. Read Also : Telangana Cabinet Expansion : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ.. ఖాళీ బెర్తులపై ఎవరికి ఛాన్స్? వారికే బెర్త్ దక్కనుందా? : ఈ విస్తరణలో ఎవరి ఛాన్స్ ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయినా బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అలాగే, కొందరు సీనియర్ నేతలకు, పార్టీకి సేవలతో పాటు రాజకీయ సమీకరణల ప్రభావంతో కీలక బెర్తులు దక్కే అవకాశాలపై కాంగ్రెస్ వర్గాలు

Womens Asia Cup 2026 : మహిళల ఆసియాకప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా హాంగ్‌కాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన (124 ; 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగింది. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. దీంతో హాంగ్‌కాంగ్ ముందు 194 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. HUNDRED! 💯 Vice-Smriti Mandhana brings up her second T20I century 🥳 Updates ▶️ | #INDvHK — BCCI Women (@BCCIWomen) September 3, 2026 Rohit Sharma : మీటింగ్‌కు రాని అజిత్ అగార్కర్.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ (28; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు తొలి వికెట్‌కు శుభారంభాన్ని అందించారు. 7.6 ఓవర్లలో 74 పరుగులు జోడించారు. వేగంగా ఆడే క్రమంలో షఫాలీ ఔటైంది. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రతీకా రావల్ (10), రిచా ఘోష్ (11), హర్మన్‌ప్రీత్ కౌర్(10) విఫలమైనప్పటికి కూడా మరో ఎండ్ స్మృతి మంధాన తనదైన శైలిలో దూకుడుగా ఆడింది. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌండరీ వరద పారించింది. 57 బంతుల్లోనే సెంచరీ సాధించింది. టీ20ల్లో మంధానకు ఇది రెండో శతకం. సెంచరీ తరువాత కూడా స్మృతి దూకుడుగా ఆడింది. ఆఖరి ఓవర్లో రనౌట్ అయింది. స్మృతి రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. హాంగ్ కాంగ్ బౌలర్లలో మరీనా లాంప్లో రెండు వికెట్లు తీసింది. రుచిత వెంకటేష్, జోయిలీన్ కౌర్‌లు చెరో ఓ వికెట్ సాధించారు

ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌కు భారత బృందాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. మొత్తం 768 మంది సభ్యులతో కూడిన భారత బృందంలో 503 మంది క్రీడాకారులు, 246 మంది అధికారులు, సహాయక సిబ్బంది, 19 మంది కంటింజెంట్ సిబ్బంది ఉన్నారు.ఆసియా గేమ్స్ సమయంలో రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు విశ్రాంతి ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో భారత్ వైట్‌బాల్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గంభీర్‌కు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో లక్ష్మణ్ భారత పురుషుల జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు.లక్ష్మణ్‌కు సునీల్ జోషి, హృషీకేశ్ కనిత్కర్, శుభదీప్ ఘోష్ సహాయకులుగా వ్యవహరిస్తారు. మహిళల జట్టుకు అమోల్ ముజుందార్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. ఇంగ్లాండ్‌తో వైట్‌బాల్ సిరీస్ తర్వాత గంభీర్‌కు విశ్రాంతి ఇచ్చిన సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగనున్నాయి. 2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో రెండు జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. అప్పుడు పురుషుల జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించగా.. మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించారు.మరోవైపు ఆసియా గేమ్స్‌లో క్రికెట్ జట్లకు వసతి ఏర్పాట్లపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో జపాన్ క్రికెట్ సంఘం సీఈవో నవోకి అలెక్స్ మియాజీ కీలక

Trump Dollar Ccoins : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా 250వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా టంకశాల ప్రత్యేక నాణేన్ని ముద్రించింది. ఒకవైపు అధ్యక్షుడు ట్రంప్ ముఖం కనిపించే ఈ ఒక డాలర్ నాణెంను యూఎస్ మింట్ విక్రయానికి ఉంచింది. దాదాపు 100 ఏళ్ల తర్వాత జీవించి ఉన్న అమెరికా అధ్యక్షుడి చిత్రం దేశ కరెన్సీపై కనిపించడం ఇదే తొలిసారి. కొత్త నాణెంపై ట్రంప్ ముఖచిత్రంతో పాటు లిబర్టీ, 1776 అని ముద్రించారు. మరోవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధికారిక ముద్ర ఉండేలా డిజైన్ చేశారు. దీనిని ఈ ఏడాది యూఎస్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆమోదం తెలియజేసింది. ఈ కమిషన్ సభ్యులను డొనాల్డ్ ట్రంప్ స్వయంగా నియమించారు. గంటల్లోనే స్టాక్ ఖాళీ.. ఈ ఒక డాలర్ నాణేలు భారీ ధరకు విక్రయానికి ఉంచారు. 25 నాణేలున్న ఒక రోల్ ధర 61 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.5,500)గా, 100 నాణేలున్న ఒక బ్యాగ్ ధర 154.50 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.14,000)గా నిర్ణయించారు. అయితే అమ్మకాలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే యూఎస్ మింట్ వెబ్సైట్లో ఈ నాణేలు ప్రస్తుతం స్టాక్‌లో లేవు అని కనిపించింది. వాషింగ్టన్ డీసీలోని యూఎస్ మింట్ స్టోర్‌లో ఏర్పాటు చేసిన వెండింగ్ మెషీన్ల ద్వారా కూడా ఈ నాణేలను విక్రయిస్తున్నారు. నాణెంలో బంగారం లేదు.. ఇదిలాఉంటే.. ట్రంప్ చిత్రంతో ఉన్న ఈ నాణెం బంగారు రంగులో కనిపించినప్పటికీ ఇందులో అసలు బంగారం లేదని యూఎస్ మింట్ తెలిపింది. నాణెంలో 88.5 శాతం రాగి ఉండగా, మిగిలిన భాగంలో జింక్, మాంగనీస్, నికెల్ వంటి లోహాలను ఉపయోగించారు. ఇదిలా ఉండగా, ట్రంప్ చిత్రాన్ని అమెరికా నోటుపై ముద్రించే అంశం కూడా గతంలో చర్చకు వచ్చింది. మే నెలలో అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్.. ట్రంప్ చిత్రంతో కూడిన కొత్త 250డాలర్ల నోటును

Kavitha : తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత..బీఆర్ఎస్కు దూరం అయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు తన టార్గెట్‌ను మారుస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్లో తనకు అన్యాయం జరిగిందన్న మాటనే బలంగా వినిపిస్తున్న కవిత..పార్టీ తనను దూరం పెట్టడానికి..తన తండ్రి కేసీఆర్‌కు తనకు గ్యాప్ పెంచడానికి కారణం..వాళ్లే అంటూ పలువురు లీడర్లపై బాణాలు ఎక్కుపెడుతు వస్తున్నారు. మొన్నటి వరకు జోగినపల్లి సంతోష్‌ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత గుంటనక్క అంటూ హరీశ్‌పై అటాక్ చేశారు. అటు కేటీఆర్‌ను అప్పుడప్పుగు గట్టిగానే విమర్శిస్తున్నారు. లేటెస్ట్గా ఇందూరు సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డే తన రాజకీయ ప్రత్యర్థి అన్నట్లుగా మాట్లాడుకొచ్చారు కవిత. దీంతో ఆమె టార్గెట్ మారినట్లే కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. కవిత ప్రశాంత్‌రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక ఆమె లక్ష్యమేంటన్న చర్చ మొదలైంది. కేసీఆర్‌తో తనకు దూరం పెరగడానికి ప్రశాంత్‌రెడ్డే కారణమన్నది కవిత ఆరోపణ. తండ్రీకూతుళ్ల మధ్య చిచ్చు పెట్టారని విమర్శిస్తూ..మహాభారతంలోని శకునితో పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే..కవిత రాజకీయ కథనంలో ప్రశాంత్‌రెడ్డిని ఒక కీలక పాత్రగా చూపించే ప్రయత్నం జరుగుతోందా.? ఇంతకాలం హరీశ్‌రావు చుట్టూ తిరిగిన వివాదం..ప్రశాంత్‌రెడ్డి వైపు తిరగడానికి కారణమేంటన్నది డిస్కషన్‌కు దారితీస్తోంది. ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కవిత ఇందూరునే వేదికగా చేసుకున్నారు. అక్కడే సభలు పెడుతూ..రాజకీయ భవిష్యత్‌పై సంకేతాలు ఇస్తూ వస్తున్న కవిత.. అదే నిజామాబాద్ కేంద్రంగా ప్రశాంత్‌రెడ్డిపై నేరుగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్లో అన్యాయం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో కవిత కన్నీళ్లపై కూడా రాజకీయ చర్చ మొదలైంది. ఇది ఆమె వ్యక్తిగత ఆవేదనా.? లేక ప్రజల్లో సానుభూతిని పెంచుకునే రాజకీయ వ్యూహమా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పాలిటిక్స్‌లో సెంటిమెంట్ కూడా ఒక బలమైన ఆయుధమే. ఒక నాయకుడికి అన్యాయం జరిగిందన్న భావనను ప్రజల్లో బలంగా నాటగలిగితే..అది రాజకీయంగా సానుభూతిగా మారే అవకాశం ఉంటుంది. కవిత కూడా సానుభూతి కార్డుతోనే బీఆర్ఎస్ను బ్లేమ్ చేసే ప్లాన్‌లో ఉన్నారా

టాలీవుడ్ లో ఘనవిజయాలు అందించే కొన్ని సక్సెస్ ఫార్ములాలు ఉంటాయి. వాటిలో యమలోకం కాన్సెప్ట్ ఒకటి. ఈ కథాంశంతో వచ్చిన ఎక్కువ చిత్రాలు తెలుగులో కాసుల వర్షం కురిపించాయి. హీరోలు యమలోకానికి వెళ్లడం లేదా యముడే భూలోకానికి రావడం ఈ తరహా కథలతో చాలా చిత్రాలు వచ్చాయి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి అల్లరి నరేష్ వరకు ఈ ఫార్ములాతో సక్సెస్ అందుకున్నారు. ఎన్టీఆర్ యమగోల, చిరంజీవి యముడికి మొగుడు, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రాలలో హీరోలు యమలోకానికి వెళ్లి తిరిగి భూమిపైకి వస్తారు. అల్లరి నరేష్ యముడికి మొగుడు మూవీ కూడా అదే కాన్సెప్ట్. అలీ యమలీల సినిమాలో యముడే భూలోకానికి వస్తాడు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. నాగార్జున కూడా ఇదే తరహా కాన్సెప్ట్ తో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు లాంటి హిట్స్ అందుకున్నారు. కానీ ఈ ఫార్ములా మాస్ మహారాజ రవితేజకి మాత్రం కలసి రాలేదు. యమలోకం కాన్సెప్ట్ తో రవితేజ నటించిన దరువు చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. వాస్తవానికి ఇది అంత బ్యాడ్ మూవీ కాదు. కనీసం యావరేజ్ సినిమాగా ఆడి ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పటికీ ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్లు యూట్యూబ్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒకే ఒక్క తప్పు వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి దూకుడు మీద ఉన్న టైంలో దరువు చిత్రాన్ని రిలీజ్ చేశారు. గబ్బర్ సింగ్ హోరులో దరువు చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దరువు ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం ఇదే. సోలోగా రిలీజ్ అయి ఉంటే అబౌ యావరేజ్ లేదా హిట్ అయ్యే అవకాశాలు ఉండేవి. టీవీల్లో, యూట్యూబ్ లో ఈ సినిమాని ప్రేక్షకులు

పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన కేసులో గుంటూరు జిల్లా పోలీసుల తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన ధర్మాసనం, "గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.కేసు వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత జూన్ నెలలో ఓ బాలిక ట్యూషన్‌కు వెళ్లి అదృశ్యమైంది. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో, ఆయన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, పోలీసుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ ఒక బాలికను కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని అభిప్రాయపడింది. గతంలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్‌ను పోలీస్ స్టేషన్‌కు రాకుండా అడ్డుకున్న ఘటనను గుర్తుచేస్తూ, ఇలాంటి పోలీసులు ఉండటం ప్రభుత్వానికే సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేసింది.కేసు విచారణలో పోలీసులు సరైన స్ఫూర్తితో పనిచేయడం లేదని పేర్కొన్న కోర్టు, గురువారం నాటికల్లా బాలికను తమ ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన రంభ ఊర్వశి మేనక సినిమా సెప్టెంబర్ 4 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రంభ ఊర్వశి మేనక పాత్రల్లో నటించిన రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయి మెరిపించారు. ముగ్గురూ ఒకే స్టేజిపై డ్యాన్స్ వేసి అదరగొట్టారు. ఈవెంట్లో ఈ ముగ్గురూ కలర్ ఫుల్ గా సందడి చేశారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. నూతన రుణ యత్నాలు అనుకూలించవు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది. కీలక సమయంలో సోదరుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన

లేని భూమిని కాగితాల్లో సృష్టించిన రియల్ ముఠా డబ్బుతో అధికారులను ఏమార్చి.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి.. వాటిని బ్యాంకుల్లో తనాఖా పెట్టి ఏకంగా రూ. 4.11 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం సబ్ రిజిస్ట్రార్‌ను సైతం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లేని భూమితో బ్యాంకు రుణాలు రూ.4.11 కోట్లు కొట్టేసి రియల్ వ్యాపారం హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): లేని భూమిని కాగితాల్లో సృష్టించిన రియల్ ముఠా డబ్బుతో అధికారులను ఏమార్చి.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి.. వాటిని బ్యాంకుల్లో తనాఖా పెట్టి ఏకంగా రూ. 4.11 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం సబ్ రిజిస్ట్రార్‌ను సైతం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదు అందినా పట్టించుకోకుండా నిందితులకు సహకరించిన పోలీసులపైనా చర్యలు చేపట్టారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర సీఐ అంజనేయులతో కలిసి మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు... ప్రస్తుతం చంపాపేట ఎస్ఆర్వోగా ఉన్న మహ్మద్ యూసఫ్ రహమాన్ గతంలో కీసరలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఆ సమయంలో కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆయన్ను సంప్రదించారు. కేవలం కాగితాల్లోనే భూమిని సృష్టించి, వాటిని నిజమైన వ్యక్తులకు సంబంఽధించిన భూమి పత్రాలుగా రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకుగాను సబ్ రిజిస్ట్రార్‌కు రూ. 5లక్షలు ముట్టజెప్పారు. తాను మంచివాడినని నిరూపించుకోవడానికి జరిగిన మోసంపై గతేడాది డిసెంబర్లో కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కేవలం కంప్లైంట్ రావడమే తప్ప.. ఈఎంఐల విషయంలో గానీ, ఆర్థిక లావాదేవీల గురించి గానీ, బ్యాంకు అధికారుల నుంచి కూడా సమస్యలు లేకపోవడంతో.. అప్పట్లో కొంతమంది పోలీసులు ఈ ముఠాకు సహకరించారు. కాగా ఇటీవల కీసర పోలీస్ స్టేషన్లో కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ఇటీవల బాధ్యతలు

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు... ముంబై, సెప్టెంబరు 2: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని.. గత ఆరేళ్లుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ప్రమాదవశాత్తు మరణంగా ఎలా పరిగణిస్తారని పోలీసులను ప్రశ్నించింది. వారి దర్యాప్తు తీరు చూస్తుంటే సమాధానాల కన్నా ఎక్కువ సందేహాలే వ్యక్తమవుతున్నాయని ఆక్షేపించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరమని పేర్కొంటూ 44 పేజీల తీర్పును వెలువరించింది. 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్‌లో ఓ నివాస భవనం పైనుంచి పడి దిశా సాలియాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ తర్వాత వారం రోజులకే సుశాంత్‌సింగ్ తన ఇంట్లో మరణించడంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారంటూ కోర్టును ఆశ్రయించిన సతీశ్ సాలియాన్.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలోనే సతీశ్ సాలియాన్ వాంగూల్మాన్ని నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

Yellareddypeta: భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి - నగేష్ ఈ వార్తకు సంబంధించిన

Paderu: ‘బడి కోసం డొనేట్’ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ నిశాంతి ఈ వార్తకు సంబంధించిన

ఇంటర్నెట్ డెస్క్: బంగారం అక్రమ రవాణా (Gold Smuggling)కు స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా కేరళంలోని ఓ విమానాశ్రయంలో 8 నెలల చిన్నారిని స్మగ్లింగ్‌కు ఉపయోగించుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. శిశువు డైపర్‌లో దాదాపు రూ.50లక్షల విలువైన బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆ ‘నవ్వే’.. పదేళ్లకు అతణ్ని కుటుంబంతో కలిపింది! యూఏఈలోని రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుంచి మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి కరిపుర్ (కాలికట్) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు.. ఎనిమిది నెలల శిశువు, మరో ఇద్దరు చిన్నారులతో వచ్చిన సదరు వ్యక్తిని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా శిశువు డైపర్‌లో రూ.50లక్షల విలువైన బంగారంతోపాటు అతడి వద్ద మరింత బంగారం లభించింది. మొత్తం విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్మగ్లింగ్ మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. శిశువును ఉపయోగించి గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. లఖ్‌నవూలో మాజీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ నివాసం సమీపంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

HDFC బ్యాంక్ రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా వడ్డీ రేటును పెంచింది. 3 సంవత్సరాల 1 రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల లోపు కాలపరిమితి ఉన్న FDలపై వడ్డీని 0.10 శాతం పెంచింది. గతంలో ఈ కాలపరిమితిలో సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ లభించేది. ఇప్పుడు దానిని 7.10 శాతానికి పెంచారు. ఈ కొత్త రేట్లు ఆగస్టు 19 నుంచి అమల్లోకి వచ్చినట్లు సమాచారం. HDFC బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లకు FD కాలపరిమితిని బట్టి 3.25 శాతం నుంచి గరిష్టంగా 7.10 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. అలాగే 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న FDలపై 6.65 శాతం వడ్డీ అందుతోంది. సాధారణ కస్టమర్లకు గరిష్టంగా 6.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ కూడా రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్ల ప్రకారం సీనియర్ సిటిజన్లకు కాలపరిమితిని బట్టి 3.50 శాతం నుంచి గరిష్టంగా 7.20 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఫెడరల్ బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లకు అందుతున్న కొన్ని ముఖ్యమైన FD వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 7 నుంచి 29 రోజులకు 3.50%గా ఉండగా, 30 నుంచి 45 రోజులు 3.75%, 46 నుంచి 90 రోజులకు 4.75%, 91 నుంచి 180 రోజులకు 5%, 181 రోజులకు 6.50%, ఏడాదికి 6.75%, 1 సంవత్సరం కంటే ఎక్కువ నుంచి 15 నెలల లోపు 6.90%, 15 నెలలకు గాను 7.15%, 15 నుంచి 24 నెలలకు 6.90%, 24 నెలల కంటే ఎక్కువ నుంచి 48 నెలల లోపు పెట్టుబడికి 7%, 48 నెలలకు 7.20% వడ్డీ లభిస్తుంది. అదే 48 నెలల కంటే

గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో పదో తరగతి విద్యార్థిని ఆచూకీ గుర్తించలేకపోయారంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఏముందని అభిప్రాయపడింది. ఏదైమైనా గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. పోలీస్‌స్టేషన్‌కి రాకుండా ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్‌ను అడ్డుకున్నారని హైకోర్టు చురకలంటించింది. ఇలాంటి పోలీసులు ఉండటం ఏపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని ఘాటుగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి కనిపించకుండా పోయిందని జూన్‌లో పట్టాభిపురం పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మూడు నెలలు అవుతున్న తన కుమార్తె ఆచూకీ గుర్తించడంలో పోలీసులు విఫలం అయ్యారని హైకోర్టులో ఆమె తండ్రి హెబీయస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు సరైన స్ఫూర్తితో వ్యవహరిస్తే.. బాలికను కనుగొనేందుకు ఇన్ని రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించింది. రేపటి లోగా బాలికను కోర్టు ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించింది. పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్ ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తుక్కుగూడ నర్సుకేసును సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. హైదరాబాద్, సెప్టెంబర్02: ఇటీవలే తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ నర్సు హత్య కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనపై ఏడు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు గల కారణాల గురించి సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని జాతీయ మహిళా కమిషనర్ లేఖలో పేర్కొన్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని, త్వరితగతిన కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఆమె సూచించారు. నిందితుడి పూర్వ నేరచరిత్రపై ఆరా తీయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిందితుడిపై తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్

ఎంతసేపూ చదువులు, మార్కులు అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తారే కానీ.. వాళ్ల భావోద్వేగాల్ని చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకోరు. ఇది వారిలో ఒక రకమైన భయాన్ని, అభద్రతా భావాన్ని రేకెత్తిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులు-పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ లోపించి.. తమకున్న సమస్యల్ని, ఇబ్బందుల్నీ పేరెంట్స్‌తో పంచుకోలేకపోతారు. ఎంతసేపూ చదువులు, మార్కులు అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తారే కానీ.. వాళ్ల భావోద్వేగాల్ని చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకోరు. ఇది వారిలో ఒక రకమైన భయాన్ని, అభద్రతా భావాన్ని రేకెత్తిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులు-పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ లోపించి.. తమకున్న సమస్యల్ని, ఇబ్బందుల్నీ పేరెంట్స్‌తో పంచుకోలేకపోతారు. ఇది పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి పిల్లల మార్కులు, ఆటల్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా.. వారికి తామున్నామన్న భరోసా కల్పించడం, ఎమోషనల్‌గా దగ్గరవడం ముఖ్యమంటున్నారు. దీన్నే ‘ఎలిఫెంట్ పేరెంటింగ్’ అంటారు. మరి, దీనివల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి.. ⚛ ఏనుగుల్ని పరిశీలిస్తే.. అవి వాటి పిల్లల్ని ఎంతో ముద్దు చేస్తాయి. ఎప్పుడూ వాటికి దగ్గరగా ఉంటూనే వాటిని సంరక్షిస్తుంటాయి. ఇలా పిల్లల్ని మన రక్షణ వలయంలో ఉంచుకోవడం వల్ల వారిలో ఒక రకమైన ధైర్యం అలవడుతుంది. దీనివల్ల జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా వారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారంటున్నారు నిపుణులు. ⚛ గున్న ఏనుగు తన తల్లితోనే కాదు.. ఇతర ఏనుగులతోనూ ప్రేమగా ఉంటుంది. ఇందుకు ఆ పిల్ల ఏనుగు తల్లే కారణం. ఎందుకంటే తల్లి ఏనుగు చిన్న వయసు నుంచే తన పిల్లల్ని ఇతర ఏనుగులతో కలిసిపోయేలా ప్రోత్సహిస్తుందట! ఇలా మనమూ మన పిల్లలకు.. మన బంధువులు, స్నేహితులతో కలుపుగోలుగా ఉండడం నేర్పితే.. వారిలో సామాజిక నైపుణ్యాలు అలవడతాయంటున్నారు నిపుణులు. దీనివల్ల అనుబంధాల విలువ తెలుసుకోవడంతో పాటు నలుగురిలోనూ దూసుకుపోయే శక్తి లభిస్తుందంటున్నారు. ⚛ ఏనుగులు తమ తోటి జంతువులు చేసే పనుల్ని సునిశితంగా పరిశీలిస్తాయట. ఈ క్రమంలోనే పిల్ల ఏనుగులు చాలా విషయాలు నేర్చుకుంటాయట!

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ, కనెక్టివిటీపై ఐఏఎల్ఏ (IALA) రెండో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్‌ప్రీత్ సింగ్ పలు కీలక సూచనలు చేశారు. ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతో పాటు వాహనదారులు, పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో యుటిలిటీ పనుల కోసం తరచూ రోడ్లను తవ్వుతున్నప్పటికీ.. పనులు పూర్తైన తర్వాత రోడ్లను సక్రమంగా, నాణ్యతతో పునరుద్ధరించడం లేదని ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. దీంతో రోడ్లు unevenగా మారి ప్రమాదాలకు అవకాశం పెరుగుతోందని తెలిపారు. యుటిలిటీ పనులు పూర్తైన వెంటనే సంబంధిత సంస్థలు రోడ్లను సకాలంలో నాణ్యతతో పునరుద్ధరించాలని సూచించారు. మరోవైపు ఓలా, ఉబర్ వాహనాల అనియంత్రిత పార్కింగ్ కూడా ట్రాఫిక్ రద్దీకి కారణమవుతోందని అధికారులు తెలిపారు. ఉద్యోగులను పికప్, డ్రాప్ చేసే సమయంలో రోడ్లపై వాహనాలు గుమిగూడకుండా ఐటీ సంస్థలు, ప్రధాన సంస్థలు తమ ప్రాంగణాల్లోనే పికప్, డ్రాప్ ప్రాంతాలతో పాటు ఓలా, ఉబర్ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ లేదా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో రోడ్ల అభివృద్ధి, కనెక్టివిటీపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రతిపాదిత రోడ్డు అభివృద్ధి ప్రణాళికను పరిశీలించిన ట్రాఫిక్ అధికారులు.. రహదారుల అనుసంధానం, ట్రాఫిక్ ప్రవాహం, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఫ్రీ లెఫ్ట్‌లు, జంక్షన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఫ్రీ లెఫ్ట్ మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు జంక్షన్లలో ఛానలైజేషన్, రోడ్డు జ్యామెట్రీలో మార్పులు చేపట్టాలని సూచించారు. దీంతో జంక్షన్ల వద్ద వాహనాల వేచి ఉండే సమయం తగ్గి ట్రాఫిక్ మరింత సాఫీగా సాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే రోడ్డు

ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో విరుచుకుపడిన తీవ్రమైన ఫ్లాష్ ఫ్లడ్స్ ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. అక్కడ సంభవించిన ఐస్, రాక్ కొండచరియల విరిగిపాటు కారణంగా కొండప్రాంతాలు తీవ్రంగా ఊడ్చిపెట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు మృతుల సంఖ్య ఏకంగా 1,127కి చేరినట్లు అధికారులు అధికారికంగా నిర్ధారించారు. వేలాది మంది ప్రజలు తమ నివాసాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ భారీ ప్రమాదం తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తీవ్ర విపత్తు సమయాన రియల్ హీరో, సినీ నటుడు సోనూ సూద్ స్వయంగా రంగానికి దిగి నేపాల్ ప్రజలకు అండగా నిలిచారు. ఆయన సెప్టెంబర్ 1న కాఠ్మండు చేరుకుని, ఆ తర్వాత సెప్టెంబర్ 2న అత్యంత ప్రభావిత ప్రాంతాలైన త్రిశూలి బజార్, నువాకోట్ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయికి వెళ్లిన సోనూ సూద్ అక్కడ సర్వస్వం కోల్పోయిన వరద బాధితులను స్వయంగా కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన తక్షణ ఉపశమనాన్ని అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా వరద బాధితులకు అవసరమైన ఆహారం, దుప్పట్లు, ఇతర అత్యవసర సహాయ సామగ్రిని ఆయన పంపిణీ చేశారు. దీంతో అక్కడ నిరాశ్రయులైన వేలాది మందికి తక్షణ ఉపశమనం లభించినట్లయింది. ఇదిలా ఉండగా, బాధితులతో మాట్లాడే సమయంలో సోనూ సూద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా వరదల్లో సర్వస్వం కోల్పోయిన 8 ఏళ్ల చిన్నారి క్రిస్టినాను కలిసి ఆయన ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె పడిన బాధను చూసి కలచివేతకు గురైనట్లు ఆయన చెప్పారు. ఈ కష్టసమయంలో బాధితులను ఆదుకునేందుకు అందరూ కలిసి రావాలని సోనూ సూద్ పిలుపునిచ్చారు. ఫలితంగా అంతర్జాతీయ సమాజం కూడా నేపాల్ వైపు చూడాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, నేపాల్ ప్రజలు తమ ఇళ్లు, కుటుంబాలు, చివరకు పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు
హైదరాబాద్ కంటోన్మెంట్లో ఆర్మీ ఆయుధాలు చోరీ.. తుపాకులు ఎత్తికెళ్లిన దొంగలు హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. ఆయుధాలు భద్రపరిచే రూం తాళం పగులగొట్టి 12 ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆర్మీ ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలోకి బయటి వ్యక్తుల ప్రవేశం పరిమితంగా ఉండటంతో లోపలి వ్యక్తుల ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్కాజిగిరి పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన

నెలకు రూ.2 లక్షల జీతం వస్తే.. ఇంకేం కావాలి.. ఇక జీవితానికి తిరుగులేదని చాలామంది భావిస్తారు. కానీ బెంగళూరుకు చెందిన టెక్ ప్రొఫెషనల్ శశాంక్ దీక్షిత్ మాత్రం ఇదే ఆదాయం ఒక దశలో కెరీర్‌కు ‘డేంజర్’గా మారొచ్చంటున్నారు. ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం ఉద్యోగ నెటిజన్లలో విస్తృత చర్చకు దారితీసింది. శశాంక్ దీక్షిత్ వాదన ప్రకారం.. నెలకు రూ.2 లక్షలు సంపాదించడం ప్రమాదకరమని చెప్పడానికి కారణం ఆ మొత్తం ఎక్కువగా ఉండటం కాదు. ‘జస్ట్ ఎనఫ్’గా అనిపించడం అసలు సమస్య. ఈ స్థాయి ఆదాయం ఒక వ్యక్తికి మంచి జీవనశైలిని అందించడంతో పాటు, ప్రస్తుత ఉద్యోగం, కెరీర్ గురించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదనే భావనను కలిగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులకు ‘బాగానే సంపాదిస్తున్నా’ అని చెప్పడానికి, వారాంతాల్లో హాయిగా గడపడానికి, రోజువారీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ ఆదాయం సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఒక దశలో ఉద్యోగి తన సామర్థ్యాన్ని పెంచుకోవడం కంటే.. ప్రస్తుత జీతాన్ని కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని వివరించారు. దీక్షిత్ చెప్పిన మరో కీలక అంశం ‘కంఫర్ట్ జోన్’. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం అలవాటైన తర్వాత ఉద్యోగం వదిలి స్టార్టప్ ప్రారంభించడం, కెరీర్ మార్చుకోవడం లేదా తక్కువ జీతంతో కొత్త అవకాశాన్ని ఎంచుకోవడం రిస్క్‌గా కనిపిస్తుంది. ‘ఇప్పటికే కోల్పోవడానికి ఏదో ఉంది’ అనే ఆలోచన అక్కడ మొదలవుతుందని ఆయన అంటున్నారు. ఫలితంగా ఒకప్పుడు చేయాలనుకున్న పనులను ‘వచ్చే నెల’, ‘వచ్చే ఏడాది’ అంటూ వాయిదా వేసుకుంటూ వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. చివరకు ఆశయం పోయిందని కాదు.. దాన్ని పట్టించుకోనంతగా సంపాదించడం మొదలుపెట్టామని గ్రహించే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీక్షిత్ పోస్ట్‌కు పలువురు ఉద్యోగులు మద్దతు తెలిపారు. మంచి జీతం కొన్నిసార్లు ‘బంగారు పంజరం’లా మారుతుందని, సౌకర్యాన్ని వదులుకోవడం కష్టమవుతుందని కొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. మరికొందరు మాత్రం

ఏపీలో అధికార కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మధ్య తాజాగా గ్యాప్ నెలకొందన్న ప్రచారం జరుగుతోంది. పవన్ తరచుగా కేబినెట్ భేటీలకు, చంద్రబాబు పాల్గొంటున్న కీలక కార్యక్రమాలకు హాజరు కాకపోవడంతో ఈ ప్రచారం సాగుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ స్దానిక ఎన్నికల్లో జనసేన పోటీపై చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ ఎంపీ ఒకరు ఆయన పుట్టినరోజును ఇవాళ ఘనంగా నిర్వహించడంతో పాటు జనసేనాని నాయకత్వంపైనా ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది.ఉద్యోగులతో గ్యాప్ పెరుగుతున్న వేళ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. తిరువూరు జనసేన పార్టీ ఇంచార్జి మనుబోలు శ్రీనివాసరావు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరంమని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మైత్రి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని అన్నారు. కూటమి ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలమన్నారు. ఏం చేసినా క్రెడిట్ చోరీ చేసేస్తున్న జగన్ ..! రేపు ఇవన్నీ.. చంద్రబాబు జోస్యం..!ఎన్టీఆర్ జిల్లా కూటమి తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. గతంలో రాష్ట్రంలో సాగిన దుష్ట పరిపాలనకు చరమగీతం పాడేందుకు పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం, కూటమి ఏర్పాటులో ఆయన పోషించిన కీలక పాత్రను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువరని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఎలాంటి వ్యక్తిగత లేదా రాజకీయ లాభాలను ఆశించకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం

ములకలపల్లి, సెప్టెంబర్ 02 : అత్యాచారానికి గురై హత్యకు గురైన శిరీషా కుటుంబాన్నిఎంపీ వద్దిరాజు రవిచంద్ర బుధవారం పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం చౌటిగూడెంకు చెందిన ఊకే శిరీషా హైదరాబాద్ లోని ఒక ఆస్పత్రిలో నర్స్ గా పని చేస్తూ అత్యాచారానికి గురై హత్యకు గురైన విషయం తెలిసిందే. కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం చౌటిగూడెంలోని శిరీషా నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేటీఆర్ కు ఫోన్ చేసి శిరీషా తల్లి రామలక్ష్మీ, సోదరుడు శివరాంలతో మాట్లాడించారు. పుట్టెడు దుఃఖంతో ఉన్న వారిని కేటీఆర్ ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ దారుణానికి ఒడిగట్టిన రాక్షసుడిని కఠినంగా శిక్షించడం ద్వారా తమకు న్యాయం చేయాల్సిందిగా శిరీషా వారు కోరగా కేటీఆర్ స్పందించి ఈ దారుణ ఘటన గురించి అసెంబ్లీలో లేవనెత్తి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని అభయమిచ్చారు.ఆపదలో ఉన్న మిమ్మల్ని ఓదార్చి మనోధైర్యాన్ని ఇవ్వడానికే రవిచంద్ర, నాగేశ్వరరావులు వచ్చారని,న్యాయం జరిగే వరకు మీ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ వారికి చెప్పారు.శిరీషా తల్లి రామలక్ష్మీకి ఎంపీ రవిచంద్ర 50వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉప్పల వెంకటరమణ, కాపు సీతామహాలక్ష్మీ, సింధూ తపస్వి, ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావు, మోరంపూడి అప్పారావు, పుష్పాల చందర్ రావు, మేకల వెంకటేశ్వర రావు, కొండవీటి రాజారావు, మేకల రాజేష్, గ్రామ సర్పంచ్ పద్మ పాల్గొన్నారు

Ration Rice | రాయపోల్, సెప్టెంబరు 2 : ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకునే ప్రయత్నం మరోసారి వెలుగు చూసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట నుంచి అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఈచర్ వాహనాన్ని టాస్క్‌ఫోర్స్ టీం-5 బుధవారం తెల్లవారుజామున పట్టుకుంది. వాహనాన్ని వెంబడించిన అధికారులు రాయపోల్ మండలం రామారం గ్రామంలోని మహాలక్ష్మి రైస్‌మిల్ వద్ద తనిఖీ చేయగా 120 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. ఇదే మిల్లులో మరో 280 క్వింటాళ్ల వరకు పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించడంతో మొత్తం సుమారు 400 క్వింటాళ్ల రేషన్ బియ్యం వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ టీం–5 అధికారులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఈచర్ వాహనాన్ని గుర్తించారు. వెంటనే వాహనాన్ని వెంబడించగా అది సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం గ్రామంలోని మహాలక్ష్మి రైస్‌మిల్ వద్దకు చేరుకుంది. అక్కడ వాహనాన్ని తనిఖీ చేయగా 9 మెట్రిక్ టన్నుల (120 క్వింటాళ్ల) పీడీఎస్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిల్లులోనూ భారీగా నిల్వ.. ఈచర్ వాహనంలో బియ్యాన్ని గుర్తించిన అధికారులు మహాలక్ష్మి రైస్మిల్లోనూ తనిఖీలు నిర్వహించారు. మిల్లులో మరో 280 క్వింటాళ్ల వరకు పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో వాహనంలోని 120 క్వింటాళ్లతో కలిపి మొత్తం సుమారు 400 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు వెల్లడైంది. పీడీఎస్ బియ్యంతో పట్టుబడిన ఈచర్ వాహనం TS-05-UC-5599తో పాటు డ్రైవర్ మాలోత్ శ్రీకాంత్ (పుట్టగూడెం, రాజాపేట మండలం, యాదాద్రి-భువనగిరి జిల్లా)ను టాస్క్‌ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. మిల్లు యజమాని బచ్చు నాగరాజును కూడా విచారించారు. అనంతరం వాహనం, బియ్యం, డ్రైవర్‌ను స్థానిక పోలీసులకు అప్పగించారు. సంబంధిత డీటీసీఎస్ అధికారులకు సమాచారం అందించి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేయడానికి చర్యలు

Nirmal: రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది: ఎమ్మెల్యే! ఈ వార్తకు సంబంధించిన

Sircilla: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ మహేష్ గితే ఈ వార్తకు సంబంధించిన

తనకు సంబంధించిన వివాదంపై కాంగ్రెస్ అగ్రనేతలకు ఇప్పటికే రాతపూర్వకంగా వివరించినట్లు కొండా సురేఖ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వ్యక్తిగతంగా కలిసి తాజా పరిణామాలపై మాట్లాడినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర ముఖ్య నేతలకు కూడా తన వాదనను లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఖర్గేతో జరిగిన సమావేశంలో తనపై జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించానని, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరానని తెలిపారు. పార్టీ నాయకత్వం తన వివరణ విన్న తర్వాత ఆలోచిస్తామని చెప్పిందని వెల్లడించారు. ప్రస్తుతం తనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై వేచి చూస్తున్నట్లు తెలిపారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను తన రాజకీయ జీవితంతో ముడిపెట్టడం సరికాదని కొండా సురేఖ స్పష్టం చేశారు. కుమార్తెకు స్వతంత్ర వ్యక్తిత్వం ఉందని, ఆమె తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు స్వయంగా తీసుకుంటుందని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత ఆమె మరో కుటుంబంలో భాగంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసి ఉండవచ్చని అన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను తాను ఖండించబోనని, అదే సమయంలో సమర్థించబోనని స్పష్టం చేశారు. దేశంలో ప్రతిరోజూ ఎంతో మంది అనేక అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తుంటారని, కేవలం తన కుమార్తె కావడం వల్ల ఆమె మాటలకు తనను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. తాను, తన భర్త రాజకీయ జీవితానికి సంబంధించిన అంశాలు వేరని, కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాలు వేరని పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిపారు. తనపై మాత్రమే చర్యల విషయంలో చర్చ జరగడంపై కొండా సురేఖ ప్రశ్నలు సంధించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తన విషయంలో ఒక విధమైన ప్రమాణాలు, క్యాబినెట్‌లోని ఇతర సామాజిక వర్గాల నేతల విషయంలో మరో విధమైన ప్రమాణాలు అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇతర మంత్రులపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై పార్టీ వైఖరి

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ కుటుంబం తమ ఇంట్లో సుమారు 200 ఏళ్ల తర్వాత జన్మించిన ఆడబిడ్డకు అపూర్వ రీతిలో స్వాగతం పలికింది. నాలుగు తరాల నిరీక్షణకు తెరదించుతూ పుట్టిన ఆ చిన్నారిని రథంపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకువచ్చి తమ అమితమైన ఆనందాన్ని చాటుకున్నారు.బీడ్ జిల్లాకు చెందిన దహిఫలే కుటుంబంలో గత రెండు శతాబ్దాలుగా ఆడపిల్లలు జన్మించలేదు. ఇటీవల ఆ కుటుంబంలోకి ఓ పాపాయి అడుగుపెట్టడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ చిన్నారికి 'గర్గి' అని నామకరణం చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం, తల్లీబిడ్డలను మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ రథంపై ఊరేగింపుగా ఇంటికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పాప నానమ్మ సురేఖ దహిఫలే మాట్లాడుతూ, "మా ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టింది. ఆసుపత్రి నుంచే పాపకు ఘనంగా స్వాగతం పలకాలని అప్పుడే నిర్ణయించుకున్నాం" అని హర్షం వ్యక్తం చేశారు. పాప తాతయ్య కూడా స్పందిస్తూ, ఇది తమ గొప్ప అదృష్టమని, ఇన్నాళ్లుగా తమ వంశంలో ఆడపిల్ల లేదన్న వెలితి తీరిపోయిందని అన్నారు."సాధారణంగా చాలామంది కుమారుడు జన్మించాలని కోరుకుంటారు. కానీ ఆడపిల్ల పుడితే కలిగే అనుభూతే వేరు. తండ్రులకు కూతుళ్లంటే అమితమైన ప్రేమ. మా పాపను కంటికి రెప్పలా చూసుకుంటాం" అని గర్గి తండ్రి తన భావోద్వేగాన్ని పంచుకున్నారు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 02: మైనారిటీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఆర్థిక సాయం, ఉపాధి పరికరాలను పంపిణీ చేశారు. మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా 278 మంది మైనారిటీ వితంతు మహిళలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అలాగే, తుర్క కాశా ముస్లిం కమ్యూనిటీకి చెందిన 13 మందికి రూ. 60 వేల విలువైన జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించిన కుట్టు మిషన్లు, జనరేటర్లు, టూల్ కిట్లను సద్వినియోగం చేసుకొని మహిళలు, యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీల సంక్షేమంపై తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని తెలిపారు. ముస్లింల హజ్ ఏర్పాట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ. 7 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. పాతబస్తీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కమ్యూనిటీ పెద్దలు యువతకు సరైన మార్గదర్శనం చేయాలని సూచించారు. చేపలు పట్టడం నేర్పించినట్లుగా యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించి వారికి తమకు తాముగా, ఇతరులకు అండగా నిలిచేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. నిధుల డిమాండ్ల విషయమై స్పందిస్తూ.. తాను టెస్ట్ ప్లేయర్ లాంటివాడినని, పదవిలో ఉన్నంతకాలం ప్రజల సంక్షేమం కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తానని తేల్చిచెప్పారు. టీజీఎంఎఫ్‌సీ (TGMFC) చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్తో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు

హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రూ.620 కోట్లతో నిర్మించిన కీలక కారిడార్ ప్రారంభానికి సిద్ధమైందని పేర్కొన్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. రూ.620 కోట్లతో నిర్మించిన కీలక కారిడార్ ప్రారంభానికి సిద్ధమైందని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్–ఓవైసీ జంక్షన్ కారిడార్ ప్రారంభిస్తు్న్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కారిడార్ ప్రారంభోత్సవం జరుగుతోందని చెప్పుకొచ్చారు. నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్–సైదాబాద్–ఐఎస్ సదన్–ఓవైసీ జంక్షన్ మధ్య ఈ కారిడార్ ఉందని మంత్రి పొన్నం తెలిపారు. 3.23 కిలోమీటర్ల పొడవున కాన్ఫ్లిక్ట్ ఫ్రీ కారిడార్ నిర్మాణం ఉంటుందని వివరించారు. 2.53 కిలోమీటర్ల ప్రధాన వయాడక్ట్.. 200 మీటర్ల అప్ ర్యాంప్ ఉంటుందని చెప్పారు. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. ప్రయాణ సమయం సుమారు 30 నిమిషాల వరకు ఆదా అవుతుందని వెల్లడించారు. చంచల్‌గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారమవుతాయని మంత్రి పొన్నం చెప్పారు. ఆయా వాహనాలు నిలిచిపోయే సమయం తగ్గడంతో ఇంధన వినియోగం తగ్గుతుందని వెల్లడించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలోనూ కారిడార్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. హైదరాబాద్‌ను ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థ కలిగిన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ఫ్లైఓవర్లు, వంతెనలు, కాన్ఫ్లిక్ట్ ఫ్రీ కారిడార్లకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నూతన కారిడార్ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. KPHB Land Auction: తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కన్న అత్యధిక ధరలు పలుకుతుండగా ఇక హైదరాబాద్‌లో భూముల ధరలు దేశంలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా నిర్వహించిన భూముల వేలంలో ఒక్క గజం రూ.2.70 లక్షలు పలికింది. కేపీహెచ్‌బీకి సంబంధించిన భూముల వేలంలో భారీ ధరలు పలికాయి. ఆ భూముల ధరలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ భూములకు మరోసారి వేలం నిర్వహించగా ఈసారి తీవ్ర పోటీ నెలకొనడంతో భారీ ధరలు పలికాయి. మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు అమ్ముడుపోయాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.47.14 కోట్ల మేర ఆదాయం లభించిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ ప్రకటించారు. ఎటువంటి వివాదాలు లేని.. అన్ని వసతులతో అభివృద్ధి చెందిన కేపీహెచ్‌బీ ప్రాంతంలో నిర్వహించిన ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగం వేలంలో ఓపెన్ ప్లాట్లకు రికార్డు ధరలు వచ్చాయి. కేపీహెచ్‌బీ 7 ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఒక ప్లాట్‌కు ఒక చదరపు గజం భూమి 2.70 లక్షలకు ధర పలికింది. ఈ వేలానికి సంబంధించి హౌసింగ్ బోర్డు ఆగస్టు 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ ప్లాట్లకు చదరపు గజం కనీస ధరగా రూ.1.60 లక్షలు నిర్దారించింది. ఈ వేలం పాటలో ఓపెన్ ప్లాట్లను దక్కించుకోడానికి మొత్తం 19 మంది కొనుగోలుదారులు (బిడ్డర్లు) పోటీపడ్డారు. వేలంలో చదరపు గజం సగటు

మొన్న సాదిక్‌ఖాన్.. నేడు గౌస్ మోహిద్దీన్.. కాకినాడలో లవ్ జిహాద్ కేసులు కలకలం రేపుతున్నాయి. సాదిక్‌ఖాన్ అరాచకాలతో ఓ ఫ్యామిలీ బలైతే.. ఇప్పుడు గౌస్ మోహిద్దీన్ బాధితులు బయటకొచ్చారు. గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చి మోసం చేశాడంటూ కాకినాడ ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లాలో లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయి. సాదిక్‌ఖాన్ కేసు మరువక ముందే.. గౌస్ మొహిద్దీన్ కేసు తెరపైకి వచ్చింది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తిపై బాల రమ్యశ్రీ అనే మహిళ కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్నాధపురానికి చెందిన గౌస్ మొహిద్దీన్ తనను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకున్న తర్వాత.. మతం మార్చి చిత్రహింసలకు గురి చేశాడని కంప్లైంట్లో పేర్కొంది. ఒత్తిడి చేసి మతం మారేలా చేశాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు.. తనతో పాటు మరో ఐదుగురిని కూడా ఇలాగే మోసం చేసినట్టు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో లవ్ జిహాద్ల వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో గౌస్ మొహిద్దీన్ పలువురు యువతులను మోసం చేశాడని బాధితురాలు తెలిపింది. ఒకరికి తెలియకుండా మరొకర్ని ట్రాప్ చేసి, వారితో సహజీవనం చేశాడని బాల రమ్యశ్రీ ఆరోపించింది. తనను ముస్లిం సంప్రదాయంలో వివాహం చేసుకున్న తర్వాత వేధింపులకు గురిచేశాడని వెల్లడించింది. ఎన్నోసార్లు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. తనను.. తమ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గౌస్ మోహిద్దీన్‌పై ఇప్పటికే ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడని.. ఇదే అదను భావించి తమ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చానని బాధితురాలు చెప్పింది. అయితే.. గౌస్ మొహిద్దీన్ నుంచి తనకు రక్షణ కల్పించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీని కోరినట్టు తెలిపింది. “జలం… జీవం

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘రంభ ఊర్వశి మేనక’ కథ ఎలా ఉండబోతుంది? -సాధారణంగా ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్లో మానవులు ఇంద్రలోకం, యముడి వద్దకు వెళ్తుంటారు. కానీ ఇందులో ‘రంభ ఊర్వశి మేనక’ స్వర్గం నుంచి కిందకు వస్తారు. ఇందులో కథానాయకుడికి చిన్నప్పటి నుంచి ఒక డ్రామా కంపెనీ ఉంటుంది.‘రంభ ఊర్వశి మేనక’ను దేవతల్లా పూజిస్తుంటాడు. తనది కష్టపడకుండా హీరో అయిపోవాలనే క్యారెక్టర్. దేవతలు దీవిస్తే నెక్స్ట్ రాజమౌళి సినిమాలో తనే హీరో అనుకునే నమ్మకం ఉంటుంది. తన కుటుంబానికి ముత్తాతల నుంచి వస్తున్న ఒక పుస్తకం ఉంటుంది. అందులో ఒక ప్యాట్రన్ గీస్తే దేవతలు వచ్చి కోరికలు తీరుస్తారని నమ్మకం ఉంటుంది. హీరో ఆ ప్యాట్రన్ ఎలా గీశాడు, రంభ ఊర్వశి మేనక వచ్చిన తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు ఈ కథ చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎక్సైటింగ్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి? -చాలా రోజుల తర్వాత మంచి కామెడీ ఎంటర్టైనర్ విన్నట్టుగా అనిపించింది. ప్రేక్షకులు కూడా నా నుంచి ‘కితకితలు’, ‘బెండు అప్పారావు’ లాంటి కామెడీ సినిమాలు మిస్ అవుతున్నారు. అలాంటి కథ గురించి చూస్తున్నప్పుడు దర్శకుడు చంద్ర మోహన్ చెప్పిన ఈ కథ నాతో పాటు నాగార్జున గారికి, సుప్రియ గారికి, రాజేష్ గారికి, నిమ్మకాయల ప్రసాద్ గారికి అందరికీ నచ్చింది. సీజీ వర్క్ పరంగా ఎక్కువ బడ్జెట్ అవుతుందని తెలిసినా మంచి సినిమా అవుతుందని

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddharth) కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ(Karthikeya) ఫ్రాంచైజీకి మూడో భాగం రాబోతోందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తొలి రెండు భాగాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, రెండో భాగం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం ఈ సిరీస్‌పై అంచనాలను మరింత పెంచింది. దీంతో కార్తికేయ3(Karthikeya3) విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మరింత భారీ స్థాయిలో సినిమాను రూపొందించాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కథను పూర్తి స్థాయిలో రెడీ చేయడంతో పాటు, కథకు సరిపోయే లొకేషన్ల ఎంపిక వంటి వర్క్స్ జరుగుతున్నాయి. గత రెండు సినిమాల సక్సెస్‌ల నేపథ్యంలో మూడో భాగం కేవలం సీక్వెల్‌గా కాకుండా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఉండాలని నిఖిల్ భావిస్తున్నట్లు సమాచారం. సరైన ప్లానింగ్‌తోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని టీమ్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా నిఖిల్ ప్రస్తుతం తన పూర్తి దృష్టిని భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న స్వయంభుపై పెట్టారు. దాదాపు రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం టైమ్ కేటాయించిన ఆయన, సినిమా రిలీజ్ తర్వాతే తర్వాతి ప్రాజెక్టులపై క్లియర్ డెసిషన్స్ తీసుకునే అవకాశముంది. భరత్ కృష్ణమాచారి(Bharath Krishnamachari) దర్శకత్వంలో రూపొందుతున్న స్వయంభులో సంయుక్త(Samyuktha), నభా నటేష్(Nabha Natesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నిఖిల్ మళ్లీ కార్తికేయగా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది

విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. విజయవాడ: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 సీఐ నాగరాజు, A3 హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, A5 హెడ్ కానిస్టేబుల్ బాబురావు, A6 సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్‌కు సంబంధించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం A1 సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. A3 జంగం నాని ఏలూరు సబ్ జైలులో, A5 బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, A6 సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు నిందితులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం వారి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో నలుగురూ ప్రస్తుతం జైల్లోనే కొనసాగనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది. గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

వేడి నీళ్లు, డిష్ వాష్ సోప్ లిక్విడ్ తో మొండి మరకలను ఈజీగా వదిలించొచ్చు. దీని కోసం, పాన్ కొద్దిగా చల్లారిన తర్వాత, చెక్క గరిటెతో పైన ఉన్న మాడిన ఆహారాన్ని తీసేయండి. ఆ తర్వాత మాడిన భాగానికి సరిపడా నీళ్లు పోసి, కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ వేసి స్టవ్ మీద 10-15 నిమిషాలు మరిగించండి. వేడి నీరు, సబ్బు కలిసి మాడిన పొరను మెత్తగా చేస్తాయి. స్టవ్ ఆపి చల్లారాక మెత్తటి స్పాంజితో తుడిస్తే మరకలు సులభంగా ఊడిపోతాయి. మొండిగా మారిన నల్లటి పొరను తొలగించడానికి బేకింగ్ సోడా అద్భుతంగా సహాయం చేస్తుంది. దీని కోసం, మాడిన ప్రాంతంలో బేకింగ్ సోడాను ఎక్కువగా చల్లి, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయండి. దీనిని 15 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. బేకింగ్ సోడా పాత్రకు గీతలు పడకుండానే మాడిన పదార్థాన్ని వదిలిస్తుంది. ఆ తర్వాత నైలాన్ బ్రష్ లేదా స్పాంజితో రుద్దితే సరిపోతుంది. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలపై ఉన్న మొండి మాడు మరకలకు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. పాన్ నిండేలా సగం నీరు, సగం వైట్ వెనిగర్ పోసి స్టవ్‌పై మరిగించి దించేయండి. ఇప్పుడు ఆ నీటిని వంపేసి, పాన్‌లో బేకింగ్ సోడా చల్లండి. వెనిగర్, బేకింగ్ సోడా కలిస్తే నురుగు వస్తుంది. దీంతో.. తర్వాత ఈజీగా ఆ మొండి మరకలు వదులుతాయి. గిన్నె మాడిన వెంటనే శుభ్రం చేయడానికి సమయం లేకపోతే. మీరు రాత్రంతా నానపెట్టి.. మరుసటి రోజు శుభ్రం చేయచ్చు.. దీనికోసం, మాడిన పాత్రలో వేడి నీళ్లు, కొద్దగా డిష్ సోప్ వేసి.. రాత్రంతా నానపెట్టాలి. రాత్రంతా నానపెట్టి.. ఉదయాన్నే శుభ్రం చేస్తే.. సులభంగా మాడు పోతుంది. మీ పాత్రలు మళ్లీ కొత్త వాటిలా కనిపిస్తాయి. నాన్-స్టిక్ లేదా కోటింగ్ ఉన్న పాత్రలు మాడిపోయినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీటిని శుభ్రం చేయడానికి స్టీల్