
Shruti Haasan: ఏఐ మార్ఫింగ్ ఫొటోలపైశ్రుతిహాసన్కు భారీ ఊరట..
Shruti Haasan: ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై శ్రుతిహాసన్‌కు భారీ ఊరట..

Shruti Haasan: ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై శ్రుతిహాసన్‌కు భారీ ఊరట..

నటి శ్రుతి హాసన్ (Shruti Haasan) తన పెంపుడు పిల్లి అస్లాన్‌ను రీహోమ్ (Pet Cat Rehoming) చేయడంపై తొలిసారి స్పందించారు. నటి శ్రుతి హాసన్ (Shruti Haasan) తన పెంపుడు పిల్లి అస్లాన్‌ను రీహోమ్ (Pet Cat Rehoming) చేయడంపై తొలిసారి స్పందించారు. తీవ్రమైన అలర్జీ సమస్య కారణంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఎంతో ప్రేమగా పెంచుకున్న మూగజీవిని దూరం చేసుకోవడం తన జీవితంలోనే అత్యంత బాధాకరమైన విషయమని భావోద్వేగానికి గురయ్యారు. శ్రుతి హాసన్ నుంచో ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా పెంపుడు పర్షియన్ పిల్లి అస్లాన్‌ను వేరే వారికి రీహోమ్ చేయడం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. అస్లాన్‌ను ఎందుకు దూరం చేయాల్సి వచ్చిందనే దానిపై శ్రుతి హాసన్ తెలిపారు. 'తీవ్రమైన అలర్జీ సమస్య తలెత్తడంతోనే అస్లాన్‌ను రీహోమ్ చేయాల్సి వచ్చింది. ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు పిల్లిని దూరం చేయాల్సి రావడం నాకు చాలా బాధ కలిగించింది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అస్లాన్‌ను నా దగ్గర ఉంచుకోలేకపోయాను. అస్లాన్‌ను దూరం చేసిన క్షణాలు నా జీవితంలోనే అత్యంత బాధాకరమైన సందర్భాల్లో ఒకటి. ఆ సమయంలో నేను అనుభవించిన బాధను మాటల్లో చెప్పలేను. మానసికంగా చాలా కుంగదీసింది. ఇది నేను ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం కాదు. నా ఆరోగ్య పరిస్థితుల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అస్లాన్‌ను దూరం చేసిన విషయంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అందుకే అసలు కారణాన్ని స్పష్టంగా చెప్పాలనుకున్నాను. కొందరు నా నిర్ణయాన్ని భిన్నంగా అర్థం చేసుకున్నప్పటికీ.. తీవ్రమైన అలర్జీ వంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అస్లాన్ ఇప్పుడు నా దగ్గర లేకపోయినా.. దాని సంక్షేమం, ఆరోగ్యం నాకు ఎప్పటికీ ముఖ్యమే. నేను దాన్ని ఎంతో ప్రేమించాను, ఎప్పటికీ

తన ఫొటోలు, వీడియోలను ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారంటూ శ్రుతిహాసన్ కోర్టును ఆశ్రయించారు. కృత్రిమ మేధ (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి తన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రముఖ నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బాంబే హైకోర్టు (Bombay High Court)ను ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటో, ఇమేజ్ను ఉపయోగించి వ్యాపార ప్రయోజనాల కోసం నకిలీ ప్రకటనలు చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. తన ముఖాన్ని ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి అశ్లీల ఫొటోలు, వీడియోలు రూపొందించి ఇంటర్నెట్లో వైరల్ చేస్తున్నారని శ్రుతిహాసన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా తన అనుమతి లేకుండానే పేరు, ఇమేజ్ను ఉపయోగించి పలు ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. తన ఫొటోలను ఉపయోగించి నకిలీ ప్రకటనలు సైతం రూపొందిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన వ్యక్తిగత హక్కులు, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న సంబంధిత సంస్థల నుంచి రూ.15 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని శ్రుతిహాసన్ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌తో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్న కంపెనీల పేర్ల జాబితాను కూడా కోర్టుకు సమర్పించారు. సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం ఇటీవల తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇదే తరహాలో తన పేరు, ఫొటోలు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ సీనియర్ నటి టబు కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే