పాకిస్థాన్క్రికెట్ లో కుర్చీలాట.. ఈసారి బాబర్ ఆజమ్ వంతు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఆ జట్టు టెస్ట్ సారథి విషయంలో కుర్చీలాట ఆడుతోంది. కొన్ని రోజులు ఒకరు, ఆ తర్వాత మరొకరు అన్నట్లుగా ఆ బోర్డు తీరు సాగుతోంది. గతంలో ఉన్నఫలంగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్‌ను తప్పించింది పాక్ బోర్డు. షాన్ మసూద్‌కు బాధ్యతలు అప్పగించింది. అయితే మూడేళ్లు తిరగక ముందే మళ్లీ అతడిపై వేటు వేసింది. మరోసారి బాబర్ ఆజమ్కే టెస్ట్ జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు వెస్టిండీస్, ఇంగ్లాండ్‌లతో సిరీస్‌కు ముందు ఆ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.త్వరలో జరగనున్న వెస్టిండీస్, ఇంగ్లాండ్ సిరీస్‌ల కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. అయితే అనూహ్యంగా షాన్ మసూద్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. 2021 నుంచి 2023 వరకు పాక్ టెస్ట్ కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ ఉన్నాడు. అతడి సారథ్యంలో ఆ జట్టు.. 20 మ్యాచులలో 10 విజయాలు సాధించింది. ఆరింట్లో ఓడి, నాలుగు మ్యాచులను డ్రా చేసింది. ఆ తర్వాత అతడిపై వేటు వేసింది.ఇక బాబర్ తర్వాత సారథ్య పగ్గాలు చేపట్టాడు షాన్ మసూద్ . అతడి హయంలో ఆ జట్టు ప్రదర్శన మరింత దిగజారిపోయింది. 16 మ్యాచులలో కేవలం నాలుగింట్లోనే గెలిచింది. 12 మ్యాచులలో పరాజయం పాలైంది. ఇందులోనూ బంగ్లాదేశ్ చేతిలో రెండుసార్లు వైట్ వాష్‌కు గురైంది. దీంతో మసూద్‌పై వేటు తప్పలేదు. మరోవైపు బాబర్ ఆజమ్ ఫామ్ ఇటీవల అంత గొప్పగా ఏమీ లేదు. 2022 నుంచి టెస్టుల్లో అతడు ఒక్కశతకం కూడా కొట్టలేదు. మరి రాబోయే సిరీస్‌లలో అతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది తేలాల్సి ఉంది. పాక్ జులై 25 నుంచి వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్, ఆగస్టు 19 నుంచి ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది.వెస్టిండీస్, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు..బాబర్ అజామ్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా ఫజల్, అలీ ఉస్మాన్, అజాన్