
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించారు. హైదరాబాద్, జులై 13 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు కీలక చర్యలు చేపట్టామని వ్యాఖ్యానించారు. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేశామని సీఎం వ్యాఖ్యానించారు. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ స్కూల్లోనే అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు. కోర్ అర్బన్ రీజియన్ లోపల ఉన్న ప్రాంతంలో మొదటగా వీలైనన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను పెంచుతున్నామని వివరించారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలను కల్పిస్తున్నామని సీఎం వెల్లడించారు. రాజకీయాల్లో, ఇతర రంగాల్లో కీలక స్థానాల్లో ఎస్సీలకు అవకాశాలు కల్పించామని వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చొరవ చూపాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ