
సీఎం విజయ్ ని కలిసిన సమంత
Samantha Meets CM Vijay : టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, దళపతి విజయ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్ కోసం ఆమె చెన్నై వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగానే ఆమె చెన్నైలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం విజయ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కాసేపు సాదరంగా ముచ్చటించుకున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ ఒక అగ్ర నటుడి స్థాయి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమంత ఆయనను కలవడం ఇరు పరిశ్రమల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Read Also : ‘సింగ్ గీతం’ ఓటీటీ రిలీజ్లో నాగ్ అశ్విన్ కీలక మార్పులు! సమంత, విజయ్ ఇద్దరూ వెండితెరపై అత్యంత విజయవంతమైన పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘కత్తి’, ‘పోలీసోడు’ (తెరి), మరియు ‘అదిరింది’ (మెర్సల్) వంటి చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఆనాటి జ్ఞాపకాలను, ప్రస్తుత సినిమా విశేషాలను వీరు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక సమంత తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రం ఈ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో, తమిళనాడు సీఎం విజయ్‌తో సమంత భేటీ కావడం ఈ చిత్ర ప్రమోషన్లకు విపరీతమైన మైలేజ్‌ను తెచ్చిపెట్టింది. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. US-India : ఇండియా, అమెరికా మధ్య గొప్ప రక్షణ బంధం ఉంది – ట్రంప్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు