రేవతి నక్షత్రంలో శనిప్రవేశం, ఈ 4 రాశులకు కష్టకాలం, తస్మాత్ జాగ్రత్త
మేష రాశి వారికి శని సాడే సతి తొలి దశ ప్రభావం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఈ సమయంలో మీకు మానసిక ఒత్తిడి పెరగొచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనులలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరగొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం రాకపోవచ్చు. మీ మాటలు, ప్రవర్తనపై ప్రత్యేక నియంత్రణ పాటించాలి. మీ ఓర్పు, క్రమశిక్షణ, ఆలోచనాత్మక నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. పరిహారం : శని చాలీసా పఠించాలి. కర్కాటక రాశి వారికి శని సంచారం సమయంలో ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ కాలంలో మీరు చేసిన పనిలో నిరాశ ఎదురుకావొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు రాకపోవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం లభించకపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో విభేదాలు తలెత్తొచ్చు. ఈ కాలంలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఆస్తి సంబంధిత వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం : శని దేవుడిని స్మరించుకుంటూ ఆవాల నూనె దానమివ్వాలి. కుంభ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. ప్రస్తుతం ఈ రాశి వారికి శని సాడే సతి చివరి దశ కొనసాగుతోంది. ఈ కారణంగా మీకు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. దీర్ఘకాలంగా ఉన్న ఆందోళనలు, మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతాయి. కెరీర్ పరంగా పురోగతి తగ్గే అవకాశం ఉంది.. ఉద్యోగులకు, వ్యాపారులకు కొంత ఉపశమనం లభించొచ్చు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పరిహారం : శనివారం రోజున శనీశ్వరుని ఆలయంలో నల్ల నువ్వులు సమర్పించాలి. మీన రాశి వారికి శని సాడే సతి మధ్య దశ కొనసాగుతోంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అత్యంత సవాలుతో కూడుకుని ఉంటుంది. మీరు చేసే పనిలో ఒత్తిడి పెరగొచ్చు. మీ కుటుంబ జీవితంలో విభేదాలు పెరగొచ్చు. ఆర్థిక
