
రాష్ట్రంలో పెనమలూరుప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి
Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

సీరియస్ పాత్రలతో ప్రయాణం చేస్తున్న కామెడీ కింగ్ అల్లరి నరేశ్ చాలా కాలం తర్వాత తనదైన శైలిలో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కింది. ఇందులో సురభి హీరోయిన్ గా నటించింది. రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్ ఓ డ్యాన్స్ నెంబర్ లో మెరిశారు. ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. గత కొంతకాలంగా ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి ఇంటెన్స్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన నరేశ్, మళ్లీ కామెడీ జోనర్లో సినిమా చేయడంతో ఆయన అభిమానులు, సినీ ప్రియులలో ఆసక్తి నెలకొంది.ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సెన్సార్ పనులు కూడా పూర్తి కావడంతో, థియేట్రికల్ రిలీజ్ కోసం చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సినిమాతో అల్లరి నరేశ్ తన మార్క్ కామెడీతో మరో విజయాన్ని అందుకుంటారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది

కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్బీఐ వేసిన 7 శాతం అంచనాలను తలకిందులు చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన ప్రదర్శన కనబరిచింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు మరియు పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ఈ తరహా ప్రతిభ కనబరచడం విశేషం. పటిష్టమైన దేశీయ డిమాండ్, మూలధన పెట్టుబడులు మరియు సేవల రంగం సాధించిన ప్రగతి ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే తొలి త్రైమాసికంలో నమోదు అయిన 6.9 శాతం వృద్ధితో పోలిస్తే ప్రస్తుతం దేశ ఆర్థిక వేగం గణనీయంగా పుంజుకుంది. అయితే మునుపటి నాలుగో త్రైమాసికంలో నమోదు అయిన 8.6 శాతంతో పోలిస్తే వృద్ధి రేటు కొంత మందగించినట్లు స్పష్టమవుతోంది. స్థిర ధరల ఆధారంగా భారత వాస్తవ జీడీపీ రూ. 81.36 లక్షల కోట్లకు చేరగా, నామమాత్ర జీడీపీ 10.3 శాతంతో రూ. 88.27 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో వాస్తవ జీవీఏ వృద్ధి రేటు 8.2 శాతాన్ని తాకి నికర పన్నుల కంటే సబ్సిడీల ప్రభావం ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. ప్రాథమిక రంగంలో కొంత మందగమనం కనిపించినప్పటికీ ద్వితీయ మరియు తృతీయ రంగాలు ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపించాయి. దీంతో సేవల రంగం 10.0 శాతం వేగంతో వృద్ధి చెందగా, ఫైనాన్షియల్ మరియు ఐటీ రంగాలు 12.1 శాతంతో సత్తా చాటాయి. ఇదిలా ఉండగా తయారీ రంగం 9.2 శాతం సాధించగా, స్థిర మూలధన నిర్మాణం అనగా పెట్టుబడుల వృద్ధి 11.9 శాతానికి చేరుకుంది. అయితే వ్యవసాయ రంగం వృద్ధి 3.6 శాతానికి పరిమితం కాగా, గనుల త్రవ్వకం రంగం ప్రతికూల వృద్ధిని నమోదు చేసి కాస్త ఆందోళన కలిగించింది. భారత

గాలే క్రికెట్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం పడే సూచనలు స్పష్టంగా కనిపించాయి. దీంతో మ్యాచ్ డ్రాగానే ముగుస్తుందని అందరూ భావించారు. కానీ, అప్పుడు శ్రీలంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు భారత యంగ్ ప్లేయర్. అద్భుతమైన బౌలంగ్ తో భారత యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ మ్యాచ్ ను ముగించాడు. వర్షం పడటానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు, సుతార్ భారత్ టీమ్ కు అద్భుతమైన సెలబ్రేషన్స్ అందించాడు. విదేశీ గడ్డపై తనకు తొలి 6 వికెట్ల హాల్ అందించిన మ్యాచ్ విన్నింగ్ బంతిని తీసుకున్నాడు. కేషర నువాంతను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు 165 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు బ్యాటర్ల ముందు కొన్ని కఠినమైన ప్రశ్నలు ఉంటాయి. ఎంతసేపు క్రీజులో నిలబడగలరు? అవుట్‌సైడ్ ఎడ్జ్ కాకుండా బంతిని ఎలా మిస్ చేయాలి? డిఫెన్సివ్ మైండ్‌సెట్‌తో రోజంతా బ్యాటింగ్ చేయడం సాధ్యమేనా? ఇవన్నీ ఆలోచిస్తేనే ఏ బ్యాటర్‌కైనా ఒత్తిడి పెరుగుతుంది. పాజిటివ్ నోట్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ధనంజయ డిసిల్వా, సోనాల్ దినూష మొదట్లో బాగానే నిలబడ్డారు. పిచ్‌పై స్పిన్‌కు పెద్దగా తిరుగుడు లేకపోవడంతో బ్యాటింగ్ చేయడం కాస్త ఈజీగానే అనిపించింది. రోజు ప్రారంభమయ్యే సమయానికి బంతి 34 ఓవర్ల పాతదిగా, కాస్త సాఫ్ట్‌గా మారింది. లంకకు ఇది కాస్త హోప్స్ ఇచ్చింది. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో పాత బంతితోనే కోలుకున్నారు. ఈసారి కూడా అదే రిపీట్ చేస్తే భారత్‌ను ఇబ్బంది పెట్టవచ్చని అనుకున్నారు. మొదటి గంటన్నర పాటు శ్రీలంక ప్లాన్ ప్రకారమే ముందుకు సాగింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ధనంజయ డిసిల్వా స్పిన్‌ను సరిగ్గా ఆడలేక రెండుసార్లు మాత్రమే పొరపాటు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో జడేజా బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే తప్పు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం మరోసారి వార్తల్లో నిలిచింది. నాంపల్లిలోని బోర్డు కార్యాలయంలో బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంటల పాటు ఈ సోదాలు నిర్వహించడంతో సిబ్బందిలో ఆందోళన నెలకొంది.2019 నాటి ఇంటర్ ఫలితాల వివాదానికి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. అప్పట్లో ఫలితాల వెల్లడి బాధ్యతలను నిర్వహించిన గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలు పెను దుమారం రేపాయి. మార్కుల కేటాయింపులో జరిగిన పొరపాట్ల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.తాజాగా ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ విభాగం విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగానే అధికారులు ఇంటర్ బోర్డు మాజీ కార్యదర్శి అశోక్‌ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది
గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 165 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు కుప్పకూలింది. మానవ్ సుతార్ ఐదు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. దీంతో రెండు మ్యాచుల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు మొదటి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే పరిమితం చేశారు. దీంతో 178 పరుగుల కీలకమైన ఆధిక్యాన్ని భారత్ సొంతం చేసుకుంది. తొలి రోజు నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. చివరి వరకూ అదే జోరు కొనసాగించింది.రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 193 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్‌తో కలిసి శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య శ్రీలంక.. 206 పరుగులకు కుప్పకూలింది. నాలుగో రోజే కీలక వికెట్లు కోల్పోయి భారీ ఓటమి దిశగా పయనించిన శ్రీలంక, ఆఖరి రోజున మిగిలిన వికెట్లను కూడా చకచకా సమర్పించుకుంది. దీంతో 165 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా స్పిన్నర్ మానవ్ సుతార్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచులో అతడు 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.తన 600వ టెస్ట్ మ్యాచులో భారత్ ఘన విజయం సాధించి.. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్‌కు కీలకమైన 12 పాయింట్లు దక్కాయి. ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది

IND VS SL: గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్ట్ ఐదో రోజు ఆటపై మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే ఉదయం సమయంలోనే భారీ వర్షం కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి రెండు సెషన్లలో వర్షం తీవ్రత కాస్త తగ్గినప్పటికీ, ఆకాశం నల్లటి మబ్బులతో నిండి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒకవేళ వర్షం తీవ్రమై మైదానం మైదాన సిబ్బంది నియంత్రణలోకి రాకపోతే, ఐదో రోజు ఆట మొత్తం నీటిపాలు కాక తప్పదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. టెస్ట్ క్రికెట్ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఐదో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా లేదా ఆట పూర్తి కాకుండా ఆగిపోతే, ఆ మ్యాచ్‌ను డ్రాగా ప్రకటిస్తారు. భారత్ గెలుపునకు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ, లేదా తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల భారీ ఆధిక్యం సాధించినప్పటికీ అది పరిగణనలోకి తీసుకోరు. వికెట్లు లేదా పరుగులు మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఆట పూర్తవ్వకపోతే విజేతను ప్రకటించే అవకాశం ఐసీసీ నిబంధనల్లో లేదు. ఫలితంగా టీమిండియా విజయం సాధించే అవకాశాలు పూర్తిగా నీరుగారిపోతాయి. ఇది కూడా చదవండి: Watch: గాలే టెస్ట్‌లో తీవ్ర వివాదం.. ధ్రువ్ జురెల్ క్యాచ్‌పై సోషల్ మీడియాలో రచ్చ.. అసలు నిజమేంటి? చరిత్రలో లేని రికార్డును శ్రీలంక అందుకుంటుందా? గాలే మైదానంలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా 342 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేజ్ చేయలేదు. ఆ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉంది. సొంత మైదానంలో శ్రీలంక ఇప్పటివరకు 300 పరుగుల మార్కును కూడా విజయవంతంగా ఛేజ్ చేయలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం లంకకు అసాధ్యమనే చెప్పాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక, గెలువడానికి ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. ఇది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికలపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఎన్నికల్లో వేలాది మంది నాన్ అమెరికన్లు ఓటు వేశారంటూ ఆయన తాజా వాదనను తెరపైకి తెచ్చారు. యూఎస్ సెన్సస్ బ్యూరో ఓటర్ల రికార్డులను పౌరసత్వ వివరాలతో సరిపోల్చినప్పుడు ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ పరిణామం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.దీనికి సంబంధించిన వివరాలను తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు ట్రంప్. యూఎస్ సెన్సస్ బ్యూరో ఇప్పటివరకు సుమారు 128,000,000 మంది ఓటర్ల రికార్డులను వారి పౌరసత్వ వివరాలతో సరిపోల్చి చూసిందని, ఈ ప్రాథమిక తనిఖీల్లోనే 24,000 మందికి పైగా నాన్ అమెరికన్లు చట్టవిరుద్ధంగా 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసినట్లు నిర్ధారణ అయిందని, ఈ సంఖ్య మరింత పెరుగుతుందనీ చెప్పారు.రానున్న రోజుల్లో ఓటర్ల వివరాల విశ్లేషణను మరింత వేగవంతం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సెన్సస్ బ్యూరో త్వరలోనే మరో 32,000,000 కోట్ల మంది ఓటర్ల రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించనుందని వెల్లడించారు. ఆ తదుపరి ప్రక్రియ కూడా పూర్తయితే అక్రమ ఓట్ల సంఖ్య ఊహించని రీతిలో భారీగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవన్నీ కూడా బయటపడితే 2020 నాటి ఎన్నికలలో తానే గెలిచినట్టవుతుందని వ్యాఖ్యానించారు.భారత్ ను చూసి నేర్చుకోండి- అర్జంట్ గా ఆ బిల్లు తీసుకురండియూఎస్ ఓటింగ్ ప్రక్రియలో కఠినమైన సంస్కరణలు, గుర్తింపు నియమాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల వ్యవస్థ పనితీరును సైతం ఆయన ప్రశంసించారు.భారత్ లో ఓటర్ ఐడీ తప్పనిసరిగా ఉండటాన్ని ఆదర్శంగా పేర్కొన్నారు. అమెరికన్ ఓటర్లు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకునే ముందు ఖచ్చితమైన ఫోటో గుర్తింపు కార్డులను చూపించేలా నిబంధనలను తీసుకుని రావాలనే పట్టుదలతో ఉన్నారు ట్రంప్.తెలంగాణలో రెండు రోజుల్లో

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Zee Media Q1 Results: ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక ఫలితాలు వచ్చేశాయి. క్వార్టర్ 1 ఫలితాల్లో జీ మీడియా అదరగొట్టింది. రూ.190.85 కోట్ల ఆదాయం పొందడం విశేషం. ఏఐ, డిజిటల్లో దూసుకెళ్తున్న భారత మీడియా దిగ్గజం జీ నెట్వర్క్ తదుపరి ప్రణాళికలు, లక్ష్యాలు ఏమిటో జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీ తెలిపారు. క్యూ1 ఫలితాలపై అతడు స్పందిస్తూ జీ మీడియా నెట్‌వర్క్‌కు సంబంధించి ప్రణాళికలను వెల్లడించారు. సాంప్రదాయ ప్రకటనలపై మాత్రమే ఆధారపడే మీడియా సంస్థ స్థాయి నుంచి విభిన్న ఆదాయ మార్గాలు కలిగిన టెక్-మీడియా కంపెనీగా జీ మీడియా రూపాంతరం చెందుతోందని నెట్వర్క్ సీఈవో రక్తిమ్ దాస్ తెలిపారు. క్యూ1 ఆర్థిక ఫలితాల అనంతరం జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్‌రూమ్‌లు, రీజినల్ నెట్వర్క్ విస్తరణే తమ ప్రధాన లక్ష్యాలని వెల్లడించారు. జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ (జెడ్ఎంసీఎల్) ఆర్థిక ఫలితాలు, సంస్థ డిజిటల్ వ్యూహం, భవిష్యత్ విస్తరణపై జీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆర్థిక పనితీరు – కీలక గణాంకాలు ఆదాయం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1) జీ మీడియా ఏకీకృత ఆదాయం రూ.190.85 ( రూ.1,908.5 మిలియన్లు) కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్ ఖర్చులు: నెట్వర్క్ నిర్వహణ ఖర్చులు రూ.174.59 కోట్లు (1,745.9 మిలియన్లు)గా ఉన్నాయి. వ్యూహాత్మక మైలురాయి: క్యూ1 పనితీరు సంస్థ తదుపరి వృద్ధి ప్రయాణానికి బలమైన పునాది వేసింది. సరికొత్త ఆదాయం వైపు మార్పు సాంప్రదాయ ప్రకటనలపై మాత్రమే ఆధారపడే న్యూస్

మెగా డీఎస్సీపై ప్రతి ఆరోపణకూ వివరణ ఇచ్చినా.. వైసీపీ వాళ్లు రోజుకో కుట్ర చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 80, 90 ఏళ్లవారిని కూడా నిరుద్యోగులుగా చూపించి ధర్నాలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. 80, 90 ఏళ్లవారినీ నిరుద్యోగులుగా చూపి ధర్నాలు చేయిస్తున్నారు మెగా టీచర్లు రోడ్లెక్కడం భేష్.. వారికి అండగా ఉంటాం మెరిట్ ఆధారంగానే వారికి ఉద్యోగాలు.. ఎంపికంతా ఆన్లైన్లోనే రెండున్నరేళ్లుగా సభకు రాని ఏకైక పార్టీ.. మళ్లీ జీతాలు తీసుకుంటారు బాధ్యత ఉంటే సభకు వచ్చి మాట్లాడాలి.. అసెంబ్లీలో సీఎం ధ్వజం అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీపై ప్రతి ఆరోపణకూ వివరణ ఇచ్చినా.. వైసీపీ వాళ్లు రోజుకో కుట్ర చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 80, 90 ఏళ్లవారిని కూడా నిరుద్యోగులుగా చూపించి ధర్నాలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ అంశంపై సోమవారం శాసనసభలో ఆయన మాట్లాడారు. ‘ఉద్యోగాలకు ఎంపిక కానివారు కూడా పారదర్శకంగా భర్తీ జరిగిందని చెబుతున్నారు. ఉద్యోగాలు సాధించినవారు రోడ్లెక్కి ర్యాలీలు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం. వైసీపీకి వారే సరైన సమాధానం చెబుతున్నారు. అయినా ఆ పార్టీ మారదు. రెండున్నరేళ్లు అసెంబ్లీకి రాని పార్టీని చూడడం నా జీవితంలో ఇదే తొలిసారి. అయినా జీతాలు, ప్రివిలేజెస్ పొందుతున్నారు. ప్రజలపై బాధ్యత ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి’ అని హితవు పలికారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఒక్క టీచర్ నియామకం కూడా చేపట్టలేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసి 15,941 ఉద్యోగాలు భర్తీచేశామని.. 148 రోజుల్లోనే పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేశామని గుర్తుచేశారు. ‘వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను కట్టుదిట్టంగా అమలుచేశాం. మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. క్రీడా కోటా పోస్టుల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలనే ఇక్కడా అమలుచేశారు. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు వచ్చినవారు అత్యుత్తమ ప్రతిభావంతులు. ఎంపిక ప్రక్రియంతా ఆన్లైన్లోనే జరిగింది. ఇంతకంటే పారదర్శకత

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 64లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబెల్‌పై సింధు 21-7, 21-11 తేడాతో సునాయస విజయం సాధించింది. ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. ఢిల్లీ వేదికగా నేడు మొదలైన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 64లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబెల్‌పై సింధు 21-7, 21-11 తేడాతో సునాయస విజయం సాధించింది. కేవలం 28 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. ప్రపంచ 9వ ర్యాంకర్‌గా బరిలోకి దిగిన సింధు.. 21 ఏళ్ల సోఫియా నోబెల్‌తో తొలిసారి తలపడింది. మ్యాచ్ ఆరంభం నుంచే సింధు దూకుడుగా ఆడింది. వరుస పాయింట్లు సాధిస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. దీంతో తొలి గేమ్‌లో నోబెల్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వని సింధు.. 21-7తో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌ను కూడా సింధు నాలుగు పాయింట్ల ఆధిక్యంతో ప్రారంభించింది. అయితే నోబెల్ పుంజుకునే ప్రయత్నం చేసింది. వేగాన్ని మార్చి వరుసగా పాయింట్లు సాధించడంతో కొంతసేపు పోటీ హోరాహోరీగా సాగింది. అయినప్పటికీ కీలక దశలో సింధు తన అనుభవాన్ని చూపించింది. వరుసగా ఏడు పాయింట్లు సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. చివరకు 21-11తో రెండో గేమ్‌ను కూడా గెలుచుకుని మ్యాచ్‌ను 2-0తో ముగించింది. దీంతో మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 64ను విజయంతో అధిగమించింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జంట తొలి రౌండ్లో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32కు దూసుకెళ్లింది. ఈ జోడీ వరుస గేమ్‌ల్లో 21-9, 21-13 తేడాతో స్పెయిన్‌కు చెందిన పౌలా-లూసియా జంటను చిత్తు చేసింది. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్- హరిహరన్ జంట కూడా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. టెస్టుల్లో అరుదైన ఘనత

ఏపీ అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలను సమర్ధంగా తిప్పికొట్టారు. మెగా డిఎస్సీ నిర్వహణ, ఫలితాలపై వైసిపి చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన అసెంబ్లీలో, మండలిలో ఆధారాలతో సహా ఖండించారు. ప్రభుత్వం పారదర్శకంగా రికార్డు స్థాయిలో 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిందని విద్యాశాఖ మంత్రి విస్పంష్టంగా తేల్చి చెప్పారు. లోకేష్ సభ సాక్షిగా ఇచ్చిన వివరణతో వైసీపీకి బుల్లెట్ దిగిందా అన్నట్లుగా రిప్లై ఇచ్చారు. లోకేష్ వైసీపీకి ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అక్కడ, అలా ఇచ్చేశారని విశ్లేషించారు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ అనలిస్టు డీవీ శ్రీనివాస్. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన డీవీ శ్రీనివాస్.. లోకేష్ సమావేశంతో జగన్ చెబుతున్నట్లు ప్రభుత్వం పారిపోలేదనీ జగనే పారిపోతున్నారని తేటతెల్లమైందని అన్నారు. సరిపోదా జగన్ సరిపోదా లోకేష్ రిప్లై అని ప్రశ్నించారు. లోకేష్ బుల్లెట్ లాంటి రిప్లై ఇచ్చారన్న ఆయన.. ఇప్పటికి మూడు సార్లు చర్చకు రావాలని చేసిన లోకేష్... ఇప్పుడు నాలుగో సారి సవాల్ చేశారన్న డీవీ శ్రీనివాస్.. సభకు రాకుండా వైసీపీ పారిపోయిందనడానికి ఆ పార్టీ సభ్యులు సభకు రాకపోవడమే నిదర్శనమన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు. డీవీ శ్రీనివాస్ ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యూస్ చానెల్ లో వీక్షించండి. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి.!

టెస్ట్ క్రికెట్ ప్రారంభమై 149 ఏళ్లు దాటింది. కానీ ఇప్పటివరకు ఎవరూ ఊహించని సంచలనం ఒకటి డార్విన్ మైదానంలో జరిగింది. క్రికెట్ దిగ్గజం ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే బంగ్లాదేశ్ జట్టు చిత్తు చేసింది. 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న నజ్ముల్ శాంటో సారథ్యంలోని బంగ్లాదేశ్ జట్టు ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డార్విన్ లోని మారా ప్రాంగణంలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ ఓడించడం టెస్ట్ చరిత్రలోనే ఇది మొదటిసారి కావడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో గ్రీన్ సెంచరీ చేసినప్పటికీ ఆస్ట్రేలియాను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. ఈ టెస్ట్ సిరీస్‌కు కొద్ది రోజుల ముందు క్రికెట్ ఆస్ట్రేలియా XIతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘోరంగా విఫలమైంది. కేవలం 54 పరుగులకే ఆలౌట్ అయి, ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ ప్రధాన టెస్ట్ మ్యాచ్ ప్రారంభమయ్యే సరికి బంగ్లాదేశ్ పూర్తిగా మారిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను బంగ్లా పేసర్ హసన్ మహమూద్ 55 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి 198 పరుగులకే కుప్పకూల్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఏకంగా 426 పరుగులు సాధించింది. దీంతో బంగ్లాదేశ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఈ ఆధిక్యమే మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసింది. సాధారణంగా కంగారూలు ఫీల్డింగ్‌లో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ లో తీవ్రంగా నిరాశపరిచారు. ఆస్ట్రేలియాలో ఆసియా జట్ల అత్యధిక టెస్ట్ విజయాలు (ఈ శతాబ్దంలో): మ్యాచ్ నాలుగో రోజు ఆల్ రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైన్ అప్ను దారుణంగా దెబ్బతీశాడు. ఆయన 33.1 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... డీఎస్సీ నిర్వహణ, విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలపై కీలక వివరాలు వెల్లడించారు. డీఎస్సీ పరీక్ష ప్రక్రియను ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఏకంగా 148 రోజుల్లోనే నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని సభకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని లోకేశ్ వివరించారు. ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలను అత్యంత పారదర్శకంగా తెలిపారు. ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు సింగపూర్, ఫిన్లాండ్ వంటి దేశాలకు పంపిస్తుంటే, గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద నిలబెట్టి కించపరిచిందని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రభుత్వంలో వ్యవస్థను ప్రశ్నించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై న్యాయస్థానాల్లో 336 కేసులు దాఖలైన విషయాన్ని మంత్రి గుర్తుచేస్తూ, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా దేశ చరిత్రలోనే తొలిసారిగా డీఎస్సీలో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను పక్కాగా అమలు చేశామని వెల్లడించారు. ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కి సంబంధించి 3.68 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1.87 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారనే గణాంకాలను అసెంబ్లీ వేదికగా లోకేశ్ సమర్పించారు

సూర్య, మమితా బైజు జంటగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 'సర్', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. ఇదే రోజు విశాల్ నటించిన `మకుటం`(మగుడం) మూవీ కూడా విడుదలైంది. కానీ దీనికి నెగటివ్ టాక్ వచ్చింది. సూర్య గత చిత్రాల్లోని యాక్షన్, మాస్ అంశాలకు భిన్నంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' మంచి కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడేస్తుంది. మమితా బైజు నటన కూడా యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించింది. దీని ఫలితంగా, సినిమా విడుదలైన మూడు రోజులకే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లను దాటినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. సూర్య కెరీర్లో అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే, 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు పోటీగా ఆగస్టు 14న విడుదలైన విశాల్ 'మకుటం' సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ తేలిపోయింది. 'ఈట్టి', 'ఐంగరన్' చిత్రాల దర్శకుడు రవి అరసు మొదట ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా పనిచేశారు. కథ, స్క్రీన్‌ప్లే పనుల్లో కూడా ఆయన పాలుపంచుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత నటుడు విశాల్ స్క్రీన్‌ప్లేలో మార్పులు చేసి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విడుదలైనప్పటి నుంచి 'మకుటం' సినిమాకు ఎక్కువగా నెగటివ్ టాక్ వచ్చింది. ఆ ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. సాక్నిల్క్ డేటా ప్రకారం, ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.10 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. ఒకవైపు 'విశ్వనాథ్ అండ్ సన్స్' రోజూ రూ.20 కోట్లకు పైగా వసూలు చేస్తూ రూ.110 కోట్ల
క్రికెట్ ప్రపంచంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది! సుదీర్ఘ కాలంగా కంగారూల కోటగా భావించే ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రను లిఖించింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాను దెబ్బకొట్టి, ఆస్ట్రేలియాలో తమ తొలి టెస్ట్ విజయాన్ని సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంతో 2 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఈరోజు మరిచిపోలేని రోజుగా మారిపోయింది.ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు ఆరంభం నుంచే అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 138 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 426 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో 228 పరుగుల కొండంత ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చూపిన పోరాటపటిమ ఈ మ్యాచ్ ఫలితాన్ని మార్చడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది.రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియా బ్యాటర్లు.. బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు నిలవలేకపోయారు. హసన్ మహమూద్, మెహిదీ హసన్, తైజుల్ ఇస్లామ్‌లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వణికించారు. ఆస్ట్రేలియా అగ్రశ్రేణి బ్యాటర్లైన స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రవిస్ హెడ్లను తక్కువ పరుగులకే పెవిలియన్‌కు పంపి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. దీంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 57 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఆస్ట్రేలియాను వారి సొంత మైదానంలోనే మట్టికరిపించి ఈ చారిత్రాత్మక విజయాన్ని అందుకోవడం బంగ్లాదేశ్ క్రికెట్ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఎంతో కాలంగా ఆస్ట్రేలియా గడ్డపై విజయం కోసం నిరీక్షిస్తున్న బంగ్లాదేశ్‌కు ఇది అత్యంత తీపి జ్ఞాపకం.. ఈ విజయం ఆసియా క్రికెట్‌కు కూడా పెద్ద ఎత్తున

స్టార్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం `అగధ`. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. శ్రావణ్ రెడ్డి, షిజ్జు, వనితా విజయ్ కుమార్, జోవికా, ఉల్కా గుప్తా, భాను చందర్ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం విడుదలయ్యింది. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలో మూవీ రిజల్ట్ పై దర్శకుడు ఎంఎస్ రాజు ఒక నోట్‌ని రిలీజ్ చేశారు. ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పారు. ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లని అభినందించారు. `మా చిత్రం `అగధ` ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఎంతో అలరిస్తూ, షో షోకి కలెక్షన్లు పెరుగుతూ బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేస్తోంది. అందరూ మా చిత్రాన్ని `దేవి, `అరుంధతి` సినిమాలతో పోలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం హర్రర్ చిత్రం మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని, మహిళా ప్రేక్షకులను అలరిస్తుందని అందరూ అంటున్నారు. నిన్న ఫోన్ కాల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఈ చిత్రం విజయాన్ని తెలియజేస్తుండటంతో మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారందరికీ మా కృతజ్ఞతలు. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా సమర్పకులైన అజయ్ కె ఆర్ గారికి, నిర్మాత అయిన కాశీ విశాలక్షి బలుసు గారికి అభినందనలు` అని చెప్పారు ఎంఎస్ రాజు. ఇంకా ఇందులో ఆయన ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల గురించి చెబుతూ, `మహాదేవి పాత్రను అద్భుతంగా పోషించిన కామాక్షి భాస్కర్ల ఈ చిత్రం కోసమే పుట్టిందని అందరూ పొగుడుతుండటం ఎంతో సంతోషాన్ని కలిగించింది. సింహ పాత్రను పోషించిన శ్రవణ్ రెడ్డి నటన గురించి వస్తున్న ప్రశంసల వెల్లువ నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అలాగే ఈ చిత్రంలో నటించిన జోవికా, ఉల్కా, సిజ్జు వారి పాత్రలను అద్భుతంగా పోషించారని అందరూ అంటున్నారు. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా

కష్టపడి చదివి డీఎస్సీ పరీక్షలు రాస్తే.. తమను అవమానిస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. తమను అవమానిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలను వారు హెచ్చరించారు. అమరావతి, ఆగస్టు15: కష్టపడి చదివి డీఎస్సీ పరీక్షలు రాస్తే.. తమను అవమానిస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. తమను అవమానిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలను వారు హెచ్చరించారు. శనివారం విజయవాడలో డీఎస్సీ-2025 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులు మాట్లాడారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తామంతా తిప్పి కొట్టాలని నిర్ణయించినట్లు వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం విజయవాడలో ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉదయం 10.30 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు వివరించారు. అనంతరం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ర్యాలీ చేయనున్నట్లు వివరించారు. ఈ ర్యాలీలో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలిపారు. ఈ ర్యాలీలో సుమారు 7 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొనున్నారని సమాచారం. గత వారం డీఎస్సీ-2025లో విజేతలుగా నిలిచిన ఉపాధ్యాయులు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాయలసీమ జిల్లాల్లో డీఎస్సీ 2025లో విజేతలుగా నిలిచిన ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 2025లో కూటమి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించింది. అయితే ఈ పరీక్షల్లో భారీగా అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయంటూ వైసీపీ నేతలు ప్రచారానికి తెగబడ్డారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. అయినా వైసీపీ నేతలు మాత్రం ఆరోపణలను ఆపడం లేదు. దీంతో వైసీపీ నేతల విమర్శలను ఈ డీఎస్సీలో ఉత్తీర్ణులైన వారే తిప్పికొడుతున్నారు. అందుకోసం వారు స్వయంగా రంగంలోకి దిగి.. వైసీపీ నేతలకు క్లారిటీ ఇస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం

హైదరాబాద్ ఫార్మా రంగం మరోసారి తన సత్తా చాటింది. ప్రముఖ హెల్త్ అండ్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం 'వియాష్ సైంటిఫిక్' (Viyash Scientific) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1 FY27) ఫలితాల్లో ఊహించని రీతిలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రదర్శన నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన ఏకంగా 114.9 శాతం వృద్ధితో రూ.793 కోట్ల భారీ నికర లాభాన్ని ఆర్జించి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఫార్ములేషన్లు, ఏపీఐ (API), కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (CDMO) విభాగాల్లో నమోదు చేసిన బలమైన వృద్ధితో కంపెనీ ఏకీకృత ఆదాయం కూడా 19.5 శాతం పెరిగి రూ.946.4 కోట్లకు ఎగబాకింది. కంపెనీ ఈబిట్డా (EBITDA) 59.2 శాతం వృద్ధితో రూ.204.7 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఈవో హరిబాబు మాట్లాడుతూ... కంపెనీ చేపట్టిన వ్యూహాత్మక చర్యలు, విలీనాలు, ఖర్చుల నియంత్రణ వల్లే ఈ రికార్డు ఫలితాలు సాధ్యమయ్యాయని వెల్లడించారు. ఇటలీకి చెందిన 'బయో ఫర్ లైఫ్' (BioForLife) సంస్థ కొనుగోలుతో యూరోపియన్ పెట్/యానిమల్ కేర్ మార్కెట్లలో కంపెనీ పట్టు మరింత బిగుసుకుంది. భారత్, యూరప్, అమెరికా సహా 100కు పైగా దేశాల్లో విస్తరించిన వియాష్ సైంటిఫిక్, భవిష్యత్ ప్రణాళికలను ఇన్వెస్టర్లకు వివరించేందుకు ఈ సాయంత్రం ప్రత్యేక ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించనుంది

AP EAPCET 2026 Seat Allotment: ఆంధ్రప్రదేశ్‌లో EAPCET 2026 (ఎంసెట్) కౌన్సెలింగ్‌కు సంబంధించిన తొలి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అధికారులు ఫలితాలను విడుదల చేశారు. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు అధికారిక AP EAPCET Website ద్వారా తమ అలాట్మెంట్ వివరాలను సులభంగా చెక్ చేసుకోవచ్చు. మెరిట్ ర్యాంక్, వెబ్ ఆప్షన్లు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఈ సీట్లు కేటాయించబడ్డాయి. సీట్లు పొందిన విద్యార్థులు నిర్దేశిత గడువులోగా తగిన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు కేటాయించిన కాలేజీలో నేరుగా ఫిజికల్ రిపోర్టింగ్ చేయడం తప్పనిసరి. ఈ రిపోర్టింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు AP SCHE Portal ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలు చెక్ చేసుకునే విధానం.. 1) ముందుగా అధికారిక AP EAPCET Website ఓపెన్ చేయాలి. 2) హోమ్‌పేజీలో ఉండే 'Candidate Login' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 3) లాగిన్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. 4) స్క్రీన్‌పై కనిపించే సీట్ల కేటాయింపు ఫలితాన్ని పరిశీలించి, అలాట్మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ముఖ్యమైన తేదీలు, నిబంధనలు.. సీటు పొందిన అభ్యర్థులు ఆన్లైన్, ఫిజికల్ రిపోర్టింగ్‌లను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియకు సంబంధించి విద్యార్థులు Andhra Pradesh State Council of Higher Education సూచనలను పాటించవలసి ఉంటుంది. ఒకవేళ గడువులోగా ఈ రెండు విధానాలను పూర్తి చేయకపోతే కేటాయించిన సీటు రద్దు కానుంది. అంతేకాకుండా, తదుపరి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం కూడా కోల్పోవాల్సి వస్తుంది. తొలి దశలో సీట్లు సాధించిన విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షల నిర్వహణ, కౌన్సెలింగ్, ఇతర అధికారిక సమాచారం కోసం విద్యార్థులు ఎల్లప్పుడూ AP EAPCET Official Portalను మాత్రమే సందర్శించాలి. సోషల్
Power India Share Price Today: స్టాక్ మార్కెట్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందుగానే చెప్పలేం. కొన్ని స్టాక్స్ అప్పటికప్పుడు పతనమైనా, ఇంకొన్ని స్టాక్స్ మాత్రం భారీ రిటర్న్స్ అందిస్తుంటాయి. ఎప్పుడు ఎలా స్పందిస్తుంటాయో మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తే అంచనా వేయొచ్చు. అలా అని పెరుగుతుందని కొనేయడం, పడుతుంది కదా అని అమ్మేయడం కూడా చేయొద్దు. ఇక్కడ ఆయా కంపెనీల ఫలితాలు, ప్రకటనలు, భవిష్యత్తు వ్యూహాలు, పెట్టుబడి ప్రణాళికలు ఇలా అన్నీ కీలక పాత్ర పోషిస్తుంటాయి. వీటి గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తెలుసుకోవడం ముఖ్యం. ఏదేమైనా రిస్క్‌తో కూడుకున్న స్టాక్ మార్కెట్లలో మాత్రం ఆర్థిక నిపుణుల సలహాతోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. అప్పుడే రిస్క్ ఉన్నా దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉండొచ్చు.ముఖ్యంగా ఫలితాల సమయంలో చూస్తే కొన్ని స్టాక్స్ ఫలితాలకు ముందూ, తర్వాత రికార్డు స్థాయిలో పెరిగేవి ఉంటాయి. ఫలితాలు నిరాశపర్చితే అదే స్థాయిలో పడిపోయేవి ఉంటాయి. ఇప్పుడు 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించిన అనంతరం ఒక స్టాక్ భారీగా పుంజుకుంది. అదే భారతదేశంలోని ప్రముఖ పవర్ ట్రాన్స్మిషన్, క్లీన్ ఎనర్జీ మౌలిక వసతుల రంగంలో పనిచేస్తున్న పవర్ టెక్నాలజీ సంస్థ హితాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్. ఇది స్టాక్ ఎక్స్చేంజీల్లో పవర్ ఇండియా పేరుతో లిస్టయి ఉంది.సోమవారం సెషన్లో ఈ స్టాక్ ధర ఊహించని స్థాయిలో పెరిగింది. గత శుక్రవారం రోజు NSE లో ఈ స్టాక్ ధర రూ. 32,600 వద్ద ముగియగా ఇవాళ నేరుగా 7 శాతానికిపైగా పెరిగి రూ. 35 వేల వద్ద ఓపెన్ అయింది. అంతటితో ఆగిందా లేదు. ఇంకా పెరిగి ఇంట్రాడేలో ఒక దశలో ఏకంగా 10 శాతానికిపైగా పుంజుకొని రూ. 35,880 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక్కడ స్టాక్ ధర ఒక్కో షేరుపై ఒక్కరోజులోనే ఏకంగా రూ. 3280 పెరగడం విశేషం. దీంతో ఈ

ఇటీవల తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలియంది కాదు. మెగాస్టార్ చిరంజీవి, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్.. ఇలా అందరూ అసోసియేషన్‌లో ఎటువంటి గొడవలు లేకుండా, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఇటీవల తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (Telugu Film And TV Dancers and Dance Directors Association)లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలియంది కాదు. మెగాస్టార్ చిరంజీవి, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్.. ఇలా అందరూ అసోసియేషన్‌లో ఎటువంటి గొడవలు లేకుండా, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. దాదాపు సమస్య ముగిసిందని చెబుతూ మీడియా సమావేశం కూడా నిర్వహించారు. కానీ, వారందరి మాటని లెక్క చేయకుండా జానీ మాస్టర్ వైఫ్, అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత (Sumalatha) రిజైన్ చేసిన సభ్యుల స్థానాలకు ఆదివారం (ఆగస్ట్ 9) బై ఎలక్షన్ నిర్వహించారు. అంతకుముందు పెద్దల మాటను, ఫెడరేషన్ నిర్ణయాన్ని లెక్కచేయని సుమలతపై పలువురు డ్యాన్సర్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టుగా కూడా ఫెడరేషన్ ప్రకటించింది. అయినప్పటికీ సుమలత వెనక్కి తగ్గలేదు. దాదాపు 600 మంది సభ్యులు ఉన్న అసోసియేషన్‌లో 502 మందికి ఓటు హక్కు ఉండగా.. కేవలం 116 మంది మాత్రమే ఈ బై ఎలక్షన్లో పాల్గొన్నారంటే.. ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ వంటి వారంతా ఈ ఎన్నికలకు దూరంగా ఉండి, తమ అభిప్రాయం ఏంటో స్పష్టం చేశారు. ఇక ఈ ఉప ఎన్నికల ఫలితాలను కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్, న్యాయ సలహాదారుడైన వి. సామ్రాట్ అశోక్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. మొత్తం 502 ఓట్లు ఉండగా.. 114 ఓట్లు మాత్రమే పోలాయ్యాయి.. వాటిలో 2 ఓట్లు చెల్లనివిగా గుర్తించినట్లుగా తెలిపారు