
తిండి తిప్పలు! తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు
సీఎంసీలో అధ్వానంగా హోటళ్లు, రెస్టారెంట్లు హోటళ్లలో కుళ్లిన మాంసం, సింథటిక్ రంగులు, గడువు తీరిన నిల్వలు తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బెంబేలెత్తుతున్న నగరవాసులు సాక్షి, హైదరాబాద్: బిర్యానీల సిటీ, ఐటీ హబ్‌గా పేరుగాంచిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థల హాస్టళ్ల వంటగదులు కల్తీ, నాసిరకం పదార్థాలతో నిండి ఉంటున్నాయి. నిగనిగలాడే లైటింగ్, ఏసీల నడుమ కస్టమర్లను ఆకర్షించే బడా రెస్టారెంట్ల వంటగదులు (కిచెన్లు) సైతం దారుణంగా ఉన్నాయి. ప్రముఖ విద్యాసంస్థల హాస్టళ్లలోనూ అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇటీవల సీఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారులు కార్పొరేషన్ పరిధిలోని ప్రముఖ హోటళ్లపై జరుపుతున్న వరుస తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నయా మోసాలు, అధ్వాన్నపు నిర్వహణను అధికారులు ఎక్స్ వంటి సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేస్తుండటంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో నిర్వహించిన తనిఖీల్లో ప్రధానంగా కుళ్లిన మాంసం, ఫ్రిజ్‌లలో వారాల తరబడి నిల్వ ఉంచిన, వాసన వస్తున్న చికెన్, మటన్, సీ–ఫుడ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. – చికెన్ బిర్యానీ, కబాబ్స్ మరింత ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం నిషేధిత సింథటిక్ రంగులను వాడుతున్నారు. గడువు తీరిన సాస్‌లు, ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన చీజ్, బట్టర్, చిల్లీ సాస్‌లను వంటల్లో ఉపయోగిస్తూ దొరికిపోయారు. వంటగదుల్లో ఈగలు, బొద్దింకలు మాత్రమే కాకుండా, నిల్వ ఉంచిన పప్పులు, బియ్యం బస్తాలపై ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లైసెన్సులు కూడా లేవు చాలా రెస్టారెంట్లకు చెల్లుబాటులో ఉన్న లైసెన్సులు కూడా లేవు. ఉన్నవారు సైతం వాటిని ప్రదర్శించడం లేదు. వాటర్ అనాలిసిస్ రిపోర్టులు గానీ, సిబ్బంది మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు గానీ అందుబాటులో లేవు. గతంలోనూ నగరవ్యాప్తంగా పలుమార్లు ఫుడ్ సేఫ్టీ రైడ్స్ జరిగాయి. అప్పట్లో కేవలం జరిమానాలతో సరిపెట్టడం వల్ల యాజమాన్యాల్లో మార్పు రాలేదని స్పష్టమవుతోంది. బ్రాండెడ్ హోటళ్లలో ఘోరం! బడా బ్రాండ్లుగా


















.webp)