బ్యాంక్ ఖాతాదారులకు రిలీఫ్.. ఒక్క ఆదేశంతోబ్యాంకులకు రూ.300 కోట్లు నష్టం, కారణం ఇదే
RBI SMS Order: బ్యాంకు ఖాతా తెరిచినప్పటి నుంచి ప్రతి చిన్న లావాదేవీకి మన మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. దీని కోసం బ్యాంకులు ప్రతి 3 నెలలకు ఒకసారి మన ఖాతా నుంచి నిర్ణీత మొత్తాన్ని ఎస్ఎంఎస్ ఛార్జీల రూపంలో వసూలు చేస్తుంటాయి. బ్యాంకులను బట్టి ఇది రూ.15 నుంచి రూ.25 వరకు ఉంటుంది. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఆదేశాలు బ్యాంకులకు షాక్ ఇవ్వగా, సామాన్య కస్టమర్లకు పెద్ద ఉపశమనం కలిగించాయి. నిర్ణీత పరిమితి దాటిన లావాదేవీలకు ఎస్ఎంఎస్ తప్పనిసరిగా పంపించాలని, ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో బ్యాంకులకు ప్రతి ఏటా వందల కోట్ల ఆదాయం తగ్గిపోతున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.నిబంధనల అమలు, అవగాహన లేదా ప్రచార కార్యక్రమాల కోసం పంపే SMS అలర్ట్‌లకు సంబంధించి వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయకూడదని బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల వల్ల పెద్ద బ్యాంకులు రూ.300 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక అవసరాల కోసం పంపించే ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం కస్టమర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయవద్దని జూన్ 24వ తేదీన బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. చాలా బ్యాంకులు ఆయా ఎస్ఎంఎస్ల కోసం రూ.15-25 వరకు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది.తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు తప్పనిసరిగా పంపాల్సిన అలర్ట్‌ల SMSల విషయంలో బ్యాంకులు వెసులుబాటు కల్పించారు. తక్కువ విలువ లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపాల వద్దా అనే విషయంపై బ్యాంకులో నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. అయితే, టెక్నాలజీ వినియోగం, కస్టమర్ అనుభవాల విషయంలో తమకున్న మంచి పేరుకు భంగం కలగకుండా చూసుకునేందుకు HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ వంటి ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు ఇటువంటి లావాదేవీలకు

