
భారీ వర్షాలకు ముంబై నగరం అతలాకుతలం.. 24 గంటల్లో ఏకంగా 300 మి.మీ. లరికార్డు వర్షం.. రెడ్
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Extreme Heavy rain continues in Mumbai city: మహారాష్ట్రలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ముంబై మహానగరాన్ని గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎక్కడ చూసిన ప్రజారవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల రైళ్లునిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్ని వరద నీళ్లలో చిక్కుకున్నాయి. గత 24 గంటల్లో ముంబైలోని పలు ప్రాంతాల్లో 250 నుంచి 300 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అంతే కాకుండా మరోసారి పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ఇప్పటి వరకు ముంబైలో 588 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జులై సగటుతో పొలిస్తే ఇది సుమారు 74 శాతంగా ఉంది. జులై 2వ తేదీన ముంబై శివారు ప్రాంతాలైన విక్రోలిలో అత్యధికంగా 316 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచనలు చేశారు. అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని హెచ్చరించారు. స్కూళ్లు, కాలేజీలకు వర్షాపాతం ను బట్టి సెలవుల్ని పొడించాలని ఇప్పటికే అధికారులు సూచించారు. పలు చోట్ల చెట్లు కూలిపోయి, విద్యుత్ తీగలు తెగిపడిన అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. రోడ్లపై నీళ్లు చేరి కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న తరుణంలో పలు ఎయిర్ లైన్స్ లు ప్రయాణికులకు పలు సూచనలు చేశాయి. ఇండిగో, అకాసా ఎయిర్, స్పైస్ జెట్ వంటి పలు విమాన అలర్ట్ ను జారీ చేసింది. వాతావణంలో