
అరుణాచల మోక్ష యాత్ర.. 5 రోజుల టూర్‌ప్యాకేజీ ఇదే
ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరుతో ఐదు రోజుల ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి ఐఆర్సీటీసీ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరుతో రూపొందించిన ఈ ప్యాకేజీలో పుదుచ్చేరి, తిరువణ్ణామలై (అరుణాచలం), కాంచీపురంలోని ప్రముఖ ప్రాంతాలు, ఆలయాలను సందర్శించే అవకాశం ఉంటుంది. కాచిగూడ నుంచి రైలు ప్రయాణంతో మొదలయ్యే ఈ యాత్రలో రైలు ప్రయాణంతో పాటు హోటల్ వసతి, స్థానిక సందర్శనలను ప్యాకేజీలో భాగంగా అందిస్తున్నారు. ప్రధాన ప్రాంతాలు: పుదుచ్చేరి, అరుణాచలం, కాంచీపురం 2026 జూన్ 1 నుంచి అమల్లో ఉన్న టారిఫ్ ప్రకారం, 1 నుంచి 3 మంది కలిసి ప్రయాణించే వారికి 3AC కంఫర్ట్ విభాగంలో ట్విన్ షేరింగ్ ధర ఒక్కొక్కరికి రూ.16,900గా ఉంది. ట్రిపుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికి రూ.13,210 చెల్లించాలి. పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.10,030, బెడ్ అవసరం లేకపోతే రూ.7,530గా ధర నిర్ణయించారు. SL స్టాండర్డ్ కేటగిరీలో ట్విన్ షేరింగ్ ధర రూ.14,820, ట్రిపుల్ షేరింగ్ ధర రూ.11,125. పిల్లలకు బెడ్‌తో రూ.7,950, బెడ్ లేకుండా రూ.5,450గా ఉంది. ఒక గ్రూప్‌గా 4 నుంచి 6 మంది ప్రయాణిస్తే ప్యాకేజీ ధరలో మార్పు ఉంటుంది. మొదటి రోజు – శుక్రవారం: యాత్ర కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు 17653 కాచిగూడ–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా రైలులో ప్రయాణం కొనసాగుతుంది. రెండో రోజు – శనివారం: ఉదయం 11:05 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి చెక్ఇన్ చేస్తారు. అనంతరం ఆరోవిల్, శ్రీ అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. రాత్రి పుదుచ్చేరిలోనే బస చేస్తారు. మూడో రోజు – ఆదివారం: ఉదయం హోటల్లో అల్పాహారం
