
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం.. ప్లేయింగ్ 11లో చోటిస్తే చుక్కలే ఇక
IND vs ENG Today Match: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన చేదు అనుభవాలను పక్కనబెట్టి, టీం ఇండియా మరో మహా సమరానికి సిద్ధమైంది. నేటి నుంచే ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల ఉత్కంఠభరిత టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత యువ జట్టు ఎలా పుంజుకుంటుంది, సిరీస్ బోణీ కొట్టడానికి గౌతమ్ గంభీర్ ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాడనేది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఐర్లాండ్ పరాభవం నుంచి ఇంగ్లాండ్ సవాల్ వైపు.. ఐర్లాండ్‌తో జరిగిన గత సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా సీనియర్ల గైర్హాజరీలో బాధ్యత తీసుకుంటారనుకున్న సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్‌గా తొలి సిరీస్ అందుకున్న శ్రేయస్ అయ్యర్ అటు సారథిగా, ఇటు బ్యాటర్‌గా ఒత్తిడికి లోనై తడబడ్డాడు. దీంతో ఈ ఇంగ్లాండ్ పర్యటన అతడి కెరీర్‌కు అత్యంత కీలకమైన పరీక్షగా మారింది. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక మ్యాచ్‌లో మెరిసినా, తర్వాతి మ్యాచ్‌లో చేతులెత్తేసాడు. యువ బ్యాటర్ తిలక్ వర్మ అర్ధ సెంచరీ చేసినప్పటికీ, అతడి నెమ్మదైన ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. ఈ బ్యాటింగ్ వైఫల్యాలన్నింటినీ అధిగమించి, బలమైన ఇంగ్లాండ్ జట్టును వారి సొంత గడ్డపై ఢీకొట్టడం ఇప్పుడు యువ భారత్‌కు సవాల్‌గా మారింది. ఇది కూడా చదవండి: IND vs ENG 1st T20I: బుడ్డోడిని తొలి బంతికే ఇంటికి పంపిస్తా.. తొడగొట్టి మరీ సవాల్ చేసిన వైభవ్ దోస్త్..! ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత జట్టుకు కొండంత అండగా మారేందుకు ఒక యువ కెరటం సిద్ధంగా ఉంది. అతడే యువ పేసర్ ప్రిన్స్ యాదవ్. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్, తొలి మ్యాచ్‌లోనే మూడు కీలక వికెట్లు తీసి అందరి దృష్టిని
