© 2026 nimisham.in

హరియాణాలోని గురుగ్రామ్‌లో గురువారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో కరుడుగట్టిన దీపక్ నందల్ గ్యాంగుకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఒక గ్యాంగ్‌స్టర్‌తోపాటు... గురుగ్రామ్ ఎన్కౌంటర్లో నలుగురు గ్యాంగ్స్టర్ల కాల్చివేత వ్యాపారవేత్త విశాల్ బేరీ కిడ్నాప్‌నకు నందల్ గ్యాంగ్ యత్నం విశాల్ ఇంటిపై దాడి.. విచక్షణా రహితంగా కాల్పులు ముందుగానే పసిగట్టి ఇంటివద్ద మాటువేసిన పోలీసులు ఎదురుకాల్పుల్లో నలుగురి మృతి.. వీరిలో ఒకరు ఇంటర్ విద్యార్థి గురుగ్రామ్, జూలై 10: హరియాణాలోని గురుగ్రామ్‌లో గురువారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో కరుడుగట్టిన దీపక్ నందల్ గ్యాంగుకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఒక గ్యాంగ్‌స్టర్‌తోపాటు ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులు ఓ యాక్షన్ సినిమాను తలపిస్తున్నాయి. విదేశాల్లో ఉండి భారత్‌లో తన గ్యాంగును నడిపిస్తున్న దీపక్ నందల్ ప్రముఖ వ్యాపారవేత్త విషాల్ బేరీని టార్గెట్ చేశాడు. కొన్నిరోజులుగా ఆయనను ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎ్‌సల ద్వారా కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నాడు. ఆయన స్పందించకపోవటంతో తన గ్యాంగును నేరుగా రంగంలోకి దింపి బెదిరించాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగా నందల్ గ్యాంగులోని ఆర్యన్, నితిన్, అంకిత్, సందీప్, శివమ్ అనే గ్యాంగ్స్టర్లు ఒక నలుపురంగు స్కార్పియో వాహనంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్‌లో ఉన్న బే దీ నివాసంలోకి దూసుకొచ్చి కాల్పులు మొదలుపెట్టారు. ఈ వ్యవహారాన్ని దీపక్ నందల్‌కు తెలిపేందుకు ఆ దృశ్యాలను గ్యాంగులోని ఒక వ్యక్తి వీడియో తీయటం మొదలుపెట్టాడు. అయితే, నందల్ కోసం చాలాకాలంగా వెదుకుతున్న హరియాణా పోలీసులు.. ఈ గ్యాంగు కదలికలను కొద్దిరోజులుగా దగ్గరి నుంచి గమనిస్తున్నారు. ఈ విషయం తెలియని గ్యాంగు.. అత్యాధునిక ఆయుధాలతో ఏకంగా బేరీ ఇంటిపై దాడిచేసింది. నిఘా వర్గాల సమాచారంతో అప్పటికే ఆ ఇంటివద్ద మాటువేసి ఉన్న క్రైమ్‌బ్రాంచ్ యాక్షన్ టీం వెంటనే రంగంలోకి దిగింది. లొంగిపోవాలని వారిని హెచ్చరించింది. గ్యాంగ్స్టర్లు అదేమీ పట్టించుకోకుండా పోలీసులపై కాల్పులు మొదలుపెట్టడంతో ఇరు

గురుగ్రామ్‌లో నిన్న జరిగిన భారీ పోలీస్ ఎన్కౌంటర్లో నలుగురు గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. సుశాంత్ లోక్ ఫేజ్-2లోని ఒక ప్రముఖ వ్యాపారి నివాసం సమీపంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో మరో గ్యాంగ్‌స్టర్ గాయపడగా, ముగ్గురు పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.పోలీసుల కథనం ప్రకారం, ఎస్జీటీ యూనివర్సిటీ వ్యవస్థాపకుడి కుమారుడి నుంచి డబ్బు వసూలు చేసేందుకు కొందరు సాయుధ దుండగులు ఎస్‌యూవీలో వచ్చారు. విదేశాల్లో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ దీపక్ నందల్ పేరుతో వీరు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. దుండగులు వ్యాపారి ఇంటిపై కాల్పులు జరపడంతో, సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్యాంగ్స్టర్లకు మధ్య భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ఎన్కౌంటర్లో నలుగురు గ్యాంగ్స్టర్లు అక్కడికక్కడే హతమయ్యారు. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. నిందితుల నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మరణించిన గ్యాంగ్స్టర్ల నేర చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు

గురుగ్రామ్‌లో (హర్యానా) గురువారం సాయంత్రం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్స్టర్లు మరణించారు. ఇంటర్నెట్ డెస్క్: గురుగ్రామ్‌లో (హర్యానా) గురువారం సాయంత్రం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్స్టర్లు మరణించారు. స్థానికంగా ఒక వ్యాపారి ఇంటి ముందు గ్యాంగ్స్టర్లు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్‌యూవీలో కొందరు సాయుధులైన వ్యక్తులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో, పోలీసులు సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో వ్యాపారి ఇంటిముందు గ్యాంగ్స్టర్లు అత్యాధునిక తుపాకీతో కాల్పులు ప్రారంభించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్స్టర్లు మరణించగా ఒక క్రిమినల్ గాయపడ్డాడు. ముగ్గురు పోలీసులకు కూడా తూటా గాయాలయ్యాయి. కొద్ది రోజులుగా ఆ వ్యాపారికి విదేశీ గ్యాంగ్‌ల నుంచి బెదిరింపులు వస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతంలో కాల్పులకు తెగబడ్డ వారి వివరాలు, వారి నేర చరిత్ర గురించి త్వరలో వెల్లడిస్తామని పోలీసు శాఖ ప్రతినిధి తెలిపారు. ఘటనా స్థలంలో ఫారెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని అన్నారు. నిందితుల నుంచి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. హుండీ నుంచి స్టాక్స్‌లోకి.. రాముడి సొమ్ముతో లాభాల వేట
బక్రీద్ రోజు స్నేహితుడిని ఇంటికి పిలిచి హత్య.. నిందితుడి ఎన్కౌంటర్! ఘాజియాబాద్‌లో కలకలం సృష్టించిన... సూర్య చౌహాన్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అసద్... శనివారం అర్ధరాత్రి జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. బక్రీద్ పండుగ రోజున... సూర్య చౌహాన్‌ను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు... అసద్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. ఈ వార్తకు సంబంధించిన