
ఇంటిని చూడటానికి వెళ్లిన దంపతులపై పిట్ బుల్ దాడి.. షాకింగ్ వీడియో వైరల్
పంజాబ్‌లోని పటియాలాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటిని కొనుగోలు చేసేందుకు రియల్ ఎస్టేట్ డీలర్‌తో కలిసి వెళ్లిన భార్యాభర్తలపై పిట్‌బుల్ కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లోని పటియాలాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటిని కొనుగోలు చేసేందుకు రియల్ ఎస్టేట్ డీలర్‌తో కలిసి వెళ్లిన భార్యాభర్తలపై పిట్‌బుల్ కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. ఇంటి వద్దకు చేరుకున్న దంపతులు డోర్‌బెల్ కొట్టగానే, ఇంటి ప్రాంగణంలో ఉన్న పిట్‌బుల్ ఒక్కసారిగా వారిపైకి దూసుకొచ్చింది. ఊహించని విధంగా కుక్క వారిపై దాడి చేసింది. ఇద్దరూ తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కుక్క వదల్లేదు. కుక్క దాడిలో దంపతులను తీవ్ర గాయాాలయ్యాయి. గమనించిన స్థానికులు.. పరుగెత్తుకుంటూ వెళ్లి వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయినా ఆ కుక్క వారిని వదలకుండా దాడి చేస్తూనే ఉంది. చివరకు ఎలాగోలా కుక్క నుంచి వారిని విడిపించారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం పటియాలాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నివాస ప్రాంతాల్లో ప్రమాదకర కుక్కలను పెంచుతున్న సందర్భాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం


