
నక్షత్రాల వర్షం.. ఆకాశంలో అరుదైన అద్భుతం.. ఒకే రోజు 4 ఖగోళ వింతలు
ఆకాశంలో అరుదైన అద్భుతం జగరబోతోంది. ఖగోళ ప్రేమికులకు, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారికి ఇది నిజంగా ఒక పండగ లాంటి వార్త. సాధారణంగా ఏడాదికి ఒకటి లేదా రెండు అరుదైన ఖగోళ సంఘటనలు జరుగుతుంటాయి. కానీ, ఒకే రోజు ఏకంగా నాలుగు వేర్వేరు ఖగోళ వింతలు జరగడం చాలా అరుదు. ఆగస్టు 12న సరిగ్గా 24 గంటల వ్యవధిలో నాలుగు అంతరిక్ష సంఘటనలు ఒకేసారి జరగనున్నాయి. ఈ రోజున ఆకాశంలో సిక్స్ ప్లానెట్ పరేడ్, సంపూర్ణ సూర్యగ్రహణం, న్యూ మూన్ ఫేజ్, పెర్సీడ్ ఉల్కాపాతం ఒకదాని తర్వాత ఒకటి దర్శనమివ్వనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు, స్కై వాచర్లు ఈ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 12న సూర్యోదయానికి ముందే ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. మన సౌరకుటుంబంలోని గురుడు (Jupiter), బుధుడు (Mercury), అంగారకుడు (Mars), శని (Saturn), యురేనస్ (Uranus), నెప్ట్యూన్ (Neptune) అనే ఆరు గ్రహాలు ఆకాశంలో తూర్పు నుండి పడమర వరకు ఒకే వరుసలో వరుసకట్టి కనిపిస్తాయి. దీనినే ఖగోళ శాస్త్రంలో 'ప్లానెట్ పరేడ్' అని పిలుస్తారు. 'ఆస్ట్రోనామర్స్ వితౌట్ బోర్డర్స్' కమ్యూనికేషన్స్ మేనేజర్ ఆండ్రూ ఫజేకాస్ తెలిపిన వివరాల ప్రకారం, ప్లానెట్ పరేడ్ అనేది అధికారిక సైంటిఫిక్ టర్మ్ కాదు. గ్రహాలన్నీ ఆకాశంలో ఒకే ప్రాంతంలో దగ్గరగా కనిపించడాన్ని సాధారణంగా ఈ పేరుతో పిలుస్తారు. ఇందులో కుజుడు, శని, గురుడు, బుధుడు గ్రహాలను మనం సాధారణ కంటితోనే చూడవచ్చు. కానీ యురేనస్, నెప్ట్యూన్ వంటి దూరంలో ఉన్న గ్రహాలను చూడటానికి బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ తప్పనిసరి. ప్లానెట్ పరేడ్ ముగిసిన కాసేపటికే మరో భారీ అంతరిక్ష సంఘటన జరగనుంది. అదే సంపూర్ణ సూర్యగ్రహణం. చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్య సరిగ్గా అడ్డంగా రావడం వల్ల సూర్యకాంతి భూమిపై పడకుండా పూర్తిగా మారిపోతుంది. దీంతో గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఉత్తర రష్యా ప్రాంతాల్లో పగటిపూటే