
ఫ్యాషన్ కేఫ్యాషన్ ఐకాన్.. పారిస్ లో రూ.280 కోట్ల నగలతో సుధారెడ్డి వైభవం
ప్రపంచ ఫ్యాషన్ రాజధాని పారిస్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక 'హాట్ కౌచర్ వీక్'లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ సుధారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జులై 6 నుంచి 9 వరకు జరిగిన ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ ఈవెంట్లో, ఆమె ధరించిన డిజైనర్ దుస్తుల కన్నా ఎక్కువగా.. సుమారు రూ.280 కోట్లు (33-34 మిలియన్ డాలర్లు) విలువ చేసే తన సొంత వజ్రాభరణాల కలెక్షన్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. అద్దెకు తెచ్చుకున్నవి కాకుండా, తన వ్యక్తిగత సేకరణలోని అరుదైన ఆభరణాలతో ఆమె ఈ వేడుకకు హాజరుకావడం విశేషం.పారిస్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా జార్జియో అర్మానీ, ఎలీ సాబ్, మనీష్ మల్హోత్రా వంటి దిగ్గజ డిజైనర్ల షోలకు సుధారెడ్డి ముందు వరుసలో కూర్చొని సందడి చేశారు. ప్రతీ షోకు ఆమె ఎంచుకున్న ఆభరణాలు ఫ్యాషన్ విశ్లేషకులను సైతం అబ్బురపరిచాయి.వివిధ షోలలో సుధారెడ్డి ధరించిన ఆభరణాల విశేషాలుజార్జియో అర్మానీ షో: అర్మానీ డిజైన్ చేసిన నీలి రంగు గౌనులో కనిపించిన సుధారెడ్డి, దానికి జతగా 30 క్యారెట్ల డైమండ్ పాంథర్ ఇయర్ కఫ్స్ ధరించారు. దీంతో పాటు, సుమారు రూ. 20 కోట్ల విలువ చేసే 23 క్యారెట్ల అరుదైన పసుపు వజ్రపు ఉంగరం ఆమె వేలికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఎలీ సాబ్ షో: పూల డిజైన్లతో ఉన్న ఎలీ సాబ్ గౌనులో మెరిసిన ఆమె, టర్కోయిస్ (నీలి రత్నం) జెమ్స్టోన్స్తో చేసిన ప్రత్యేకమైన ఇయర్ కఫ్స్‌ను ఎంచుకున్నారు.మనీష్ మల్హోత్రా షో: భారతీయ డిజైనర్ మనీష్ మల్హోత్రా తొలిసారిగా పారిస్