
మాతృత్వం.. ఇక్కడ పరిపూర్ణం
భారతీయ యువకుడిని ప్రేమించి పెళ్లాడి ఐరోపా నుంచి వచ్చి మన దేశ కోడలిగా ఇక్కడ అడుగుపెట్టింది క్సేనియా కాలా. ఇక్కడి సంస్కృతిని, జీవనశైలిని పూర్తిగా సొంతం చేసుకున్న ఆమె... భారతీయ యువకుడిని ప్రేమించి పెళ్లాడి ఐరోపా నుంచి వచ్చి మన దేశ కోడలిగా ఇక్కడ అడుగుపెట్టింది క్సేనియా కాలా. ఇక్కడి సంస్కృతిని, జీవనశైలిని పూర్తిగా సొంతం చేసుకున్న ఆమె ప్రస్తుతం నలుగురు పిల్లల తల్లి. పాశ్చాత్య దేశాల పద్ధతులకు పూర్తి భిన్నంగా ఉండే భారతీయ పెంపక సూత్రాలు తన మాతృత్వాన్ని సుసంపన్నం చేశాయంటూ ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. ‘‘నలుగురు పిల్లల తల్లిగా ఇన్స్టాగ్రామ్లో నేను చాలామందికి పరిచయం. నేను ఎంతో ఇష్టపడే ఒక అందమైన కుటుంబ జీవితాన్ని ఇక్కడ నిర్మించుకుంటున్నాను. ఇటీవల నా పెంపకం అనుభవాలపై నేను పంచుకున్న ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో అంతలా వైరల్ అవుతుందని, భారతీయుల మనసులను గెలుచుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. మొదట్లో నాకు కొత్తగా, వింతగా అనిపించిన కొన్ని భారతీయ సంప్రదాయాలు.. ఇప్పుడు నా కుటుంబ జీవితంలో అత్యంత ఇష్టమైన భాగాలుగా ఎలా మారిపోయాయో చెప్పాలనేది నా ఉద్దేశం. మా పాశ్చాత్య దేశాలలో ఒక అలవాటు ఉంది. పిల్లలు పుట్టిన కొన్ని రోజులకే లేదా ఐదేళ్ల వయసు వచ్చేసరికి వారిని ప్రత్యేక గదుల్లో ఒంటరిగా పడుకోబెడతాం. పిల్లల్లో చిన్నప్పటి నుంచే స్వతంత్ర భావాలు, ఒంటరిగా ఉండే ధైర్యం రావాలని అలా చేస్తాం. కానీ నేను భారత్కు వచ్చాక ఇక్కడి తల్లులు పిల్లలతో కలిసి ఒకే నాకు వింతగా అనిపించినా, నా పిల్లల విషయంలో ఈ పద్ధతినే పాటించడం ప్రారంభించాను. ఆ మార్పు నన్ను ఆశ్చర్యపరిచింది. పిల్లలతో కలిసి పడుకోవడంవల్ల నా బిడ్డలతో నాకున్న బంధం బలపడింది. ముఖ్యంగా రాత్రివేళల్లో వారికి పాలివ్వడం, వారిని చూసుకోవడం నాకు ఎంతో సులువైంది. పిల్లల శ్వాసను అంత దగ్గరగా అనుభవిస్తూ పడుకోవడం ఒక తల్లిగా నాకు, నా ఉనికికి