
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ లెక్క మారింది- ఏపీలో ఇక.. 2029 కలిసొచ్చేది వారికే
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కీలక మైన మహిళా రిజర్వేషన్లు.. నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదించేలా కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందు కోసం భాగస్వామ్య పార్టీలకు సమాచారం అందిస్తోంది. లోక్ సభ తో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంచాలని నిర్ణయించింది. 2029 నుంచి అమల్లోకి రానుంది. దీంతో, ఏపీ రాజకీయ ముఖచిత్రం మారనుంది. ఎవరికి కలిసి వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.నియోజకవర్గాల పునర్విభజన 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చేలా బిల్లు తెచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగే అవకాశముంది. రాజ్యసభలో ఎన్డీయే మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలో ఉంది. లోక్‌సభలోనూ బలం పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్, నియోజక వర్గాల పునర్విభజనకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దం అవుతోంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల సంఖ్యాబలాన్ని 50 శాతం పెంచే ప్రతిపాదనను రాజ్యాంగ బిల్లులో పొందుపరచనుంది. జమిలి బిల్లును ప్రవేశ పెట్టే విధంగా తుది కసరత్తు జరుగుతోంది. దీంతో, ఏపీలో ఎంపీ- ఎమ్మెల్యే స్థానాలు పెరిగటం పైన స్పష్టత వస్తోంది. దీంతో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, తెలంగాణలో ప్రస్తుత 119అసెంబ్లీ స్థానాలు 179కి పెరుగుతాయి. పురందేశ్వరి కీలక బాధ్యతలు, బండికి ప్రమోషన్- సమూల ప్రక్షాళన..కొత్త టీం సిద్దం..!!ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదం..!అదే విధంగా ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించటం ద్వారా వచ్చే ఎన్నికల నుంచే ప్రత్యేకంగా సీట్లు కేటాయించనున్నారు. మహిళలకు ఏపీలో లోక్ సభ 13, అసెంబ్లీ స్థానాలు 87 సీట్లు మహిళలకు