సుభాష్ చంద్ర రూ.22000 కోట్ల మాఫీలో బిగ్‌ట్విస్ట్.. దివాలాప్రక్రియకుబ్రేక్.. చరిత్రలో తొలిసారిస్పెషల్ బెంచ్
Shubhas Chandra NCLT: మీడియా దిగ్గజం, ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకులు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది.రూ.22006.57 కోట్ల క్లెయిమ్‌లకు గాను కేవలం రూ.6.5 కోట్ల చెల్లింపు ప్రణాళికకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ దివాలా ప్రణాళికకు డివిజన్ బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో NCLT ప్రెసిడెంట్ జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ నేతృత్వంలో 5 మంది సభ్యుల ప్రత్యేక రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు చేశారు. ఎన్సీఎల్టీ చరిత్రలోనే ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్ సెప్టెంబర్ 1, 2026న ఈ కేసులో నోటీసులు జారీ చేసింది.కుదరని ఏకాభిప్రాయంగతంలో అశోక్ కుమార్ భరద్వాజ్, రీనా సిన్హాలతో కూడిన రెండవ నంబర్ ఎన్సీఎల్టీ డివిజన్ బెంచ్ ఈ దివాలా ప్రణాళికపై ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. మూడో సభ్యుడైన నిలేశ్ శర్మ ఇచ్చిన స్వతంత్ర ఉత్తర్వు సైతం డివిజన్ బెంచ్‌లోని ఇద్దరితో విభేదించడంతో మేజారిటీ తీర్పు లేనందున ఎటువంటి తుది ఉత్తర్వులు ఇవ్వలేమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. మెజారిటీ అభిప్రాయం రాకపోవడంతో కేసును NCLT ప్రెసిడెంట్‌కు పంపారు.కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 419 (5) ప్రకారం చరిత్రలోనే మొదటిసారిగా 5 మంది సభ్యుల ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్, జ్యుడీషిల్ సభ్యులు బచు వెంకట్ బలరామ్ దాస్, మహేంద్ర ఖండేల్వాల్, టెక్నికల్ మెంబర్స్ అతుల్ చతుర్వేది, రవీంద్ర చతుర్వేదిలు ఉన్నారు. ఎన్సీఎల్టీ ప్రధాన ధర్మాసనంలో ఈ బెంచ్ సెప్టెంబర్ 1న విచారణ చేపట్టిన నోటీసులు జారీ చేసింది.Read Also: సుభాష్ చంద్ర రూ.22000 కోట్ల మాఫీ ఎఫెక్ట్.. కుప్పకూలిన జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు.. ఒక్కరోజే 14 శాతం డౌన్!వివాదం ఇదిసుభాష్ చంద్ర వ్యక్తిగత హామీలపై రూ.22,006.57 కోట్ల రుణాలకు సంబంధించి రుణ దాతల క్లెయిమ్‌లపై ఆయన దివాలా పరిష్కార ప్రణాళికకు వెళ్లారు. ఈ క్రమంలో కేవలం