
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఆ పార్టీ ఫ్లెక్సీలు చించివేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం ప్రతిగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ దాడి దానిని నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి అడ్డుకోబోయిన వర్షిత్‌రెడ్డి తల్లిని తోసివేసిన కార్యకర్తలు బీజేపీ ఆఫీసుపై కూడా దాడికి కాంగ్రెస్ నేతల యత్నం అడ్డుకున్న పోలీసులు..కానిస్టేబుల్‌కు గాయాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ /హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల దాడులు, నిరసనలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు కాంగ్రెస్ శ్రేణులు నల్లరంగు వేయగా, ప్రతిగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై, బిహార్‌లో విద్యార్థులపై బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న గేటుకు నల్ల రంగు పూసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టి»ొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు యూత్ కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే యూత్ కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. గాం«దీభవన్ ముట్టడికి యత్నం.. బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు యూత్ కాంగ్రెస్ శ్రేణులు నల్ల రంగు పూయడంపై బీజేవైఎం శ్రేణులు మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గాం«దీభవన్ ముట్టడికి యతి్నంచారు. గాంధీభవన్‌పై కోడ్డిగుడ్లు విసిరేసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అట్టుడికిన నల్లగొండ బీజేపీ, కాంగ్రెస్ పరస్పర నిరసన దాడులతో నల్లగొండ జిల్లా కేంద్రం అట్టుడికింది. శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి
