
హోటళ్లలో వైఫై వాడుతున్నారా.. మీ ఫోన్హ్యాక్ అవ్వొచ్చు
ఇంటర్నెట్ డెస్క్: పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు స్థానికంగా ఉండే హోటళ్లలో బస చేస్తుంటాం. ఫ్రీ వైఫై (Hotel Wi-Fi) అనగానే రూమ్‌లో ఉన్నంత సేపు తెగ వాడేస్తాం. అయితే దీనివల్ల మనం సైబర్ దాడుల బారిన పడే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తోంది (Microsoft warns travellers). హోటళ్లలో బస చేసే వారే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు దాడులు చేస్తున్నట్లు తెలిపింది. దీనిని ‘క్యాప్టివ్ క్రంచ్’ దాడిగా పేర్కొంది. ఈ ఏడాది మే నెల నుంచి ఇటువంటి హ్యాంకింగ్లు తరచూ జరుగుతున్నట్లు వెల్లడించింది. దీని వెనుక రష్యా హ్యాకర్ గ్రూప్‌ల హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఈ హ్యాకర్ గ్రూప్ పబ్లిక్ గెస్ట్ నెట్‌వర్క్‌లు, క్యాప్టివ్ పోర్టల్ స్క్రీన్ల ద్వారా దాడులు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. హోటళ్లు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రదేశాలలో ప్రజలు అక్కడి వైఫై (Wi-Fi)తో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు.. ఈ క్యాప్టివ్ పోర్టల్ స్క్రీన్లు యూజర్ల స్క్రీన్ డేటా, ఆడియోను రికార్డ్ చేస్తున్నాయి. దానిని అదనుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు డేటా చౌర్యానికి పాల్పడుతున్నట్లు టెక్ దిగ్గజం తెలిపింది. ఇప్పటికే పలు దేశాల్లో క్యాప్టివ్ పోర్టల్ ద్వారా సేవలు అందించే Wi-Fi నెట్‌వర్క్‌లు హ్యాకింగ్‌కు గురైనట్లు మైక్రోసాఫ్ట్ గుర్తించింది. కాన్ఫరెన్స్ సెంటర్లు, బహిరంగ వేడుకల్లో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలిపింది. కార్పొరేట్ ప్రయాణికుల ఖాతాలను యాక్సెస్ చేయడమే ఈ సైబర్ దాడుల వెనక ఉన్న అసలు ఉద్దేశమని పేర్కొంది. బహిరంగ ప్రదేశంలో లేదా హోటల్ Wi-Fiకి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. వెబ్ బ్రౌజర్‌ను అప్డేట్/నెట్వర్క్ ట్రబుల్షూటింగ్ యుటిలిటీలను యాక్సెప్ట్ చేయాలని వినియోగదారులకు నోటిఫికేషన్లు వస్తాయి. వాటిని క్లిక్ చేసిన వెంటనే సైబర్ నేరగాళ్లు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోకి చొరబడుతారు. మరికొన్ని సందర్భాలలో వినియోగదారులను నకిలీ లాగిన్ స్క్రీన్లకు మళ్లిస్తారు. లాగిన్ వివరాలు సమర్పించిన వెంటనే యాక్సెస్ పొంది.. వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే

