కాపురానికి రాలేదని భార్య ముక్క కొరికేసి.. మామపై దాడి
మంచిర్యాల జిల్లాలో కలకలం రేపిన దారుణ ఘటన ఇది. కాపురానికి రావడం లేదనే కోపంతో మల్లంపేటకు చెందిన మణి చందర్ అనే వ్యక్తి తన భార్య మమత, మామ నారాయణలపై దాడికి తెగబడ్డాడు. మామ తలపై కర్రతో కొట్టి, అడ్డువచ్చిన భార్య ముక్కును బలంగా కొరకడంతో ఆమె ముక్కు భాగం తెగిపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరికీ 8 ఏళ్ల క్రితం పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనస్పర్థల కారణంగా పుట్టింట్లో ఉంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఈ వ
