మూడు ముక్కలాట ముగిసింది.. మావిగన్ అంటున్నారు .. చంద్రబాబు
మావిగన్.. ఏపీలో ఇప్పుడు ఈ పదం మరోసారి తెరపైకి వచ్చింది. అమరావతికి ప్రత్యామ్నాయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనే మావిగన్. బుధవారం రోజున విలేకర్ల సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. మావిగన్‌పై చేసిన వ్యాఖ్యలతో దీనిపై మరోసారి చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మావిగన్ రాజధాని ఎజెండాతో వైసీపీ ముందుకెళ్తుందన్న జగన్.. అమరావతి రాజధాని కావాలనుకునేవాళ్లు చంద్రబాబుకు ఓటేసుకోవచ్చంటూ బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో జగన్ మావిగన్ గురించి చంద్రబాబు స్పందించారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు.గతంలో మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడినవాళ్లు.. ఇప్పుడు మావిగన్ అంటూ వస్తున్నారని.. మావిగన్ అంటే తనకే అర్థం కావడం లేదంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. జగన్‌ను జైలులో పెట్టడం నిమిషం పని.. నన్ను జైలులో పెట్టాడు. నేను అతణ్ని జైలులో పెట్టాలనుకుంటే అది నాకు నిమిషం పని. నాకు చేతకాకకాదు. అనుభవం లేక కాదు. నా ఉద్దేశం అది కాదు. నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలి. ఏపీని కేరాఫ్ అడ్రస్ చేయాలి. అదీ నా ఉద్దేశం" అని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను బటన్ నొక్కే వ్యక్తిని కాదన్న చంద్రబాబు.. ప్రజలలో ఉండే వ్యక్తిని అని స్పష్టం చేశారు. అందుకే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు.ప్రతి నెలా 62.20 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నామని.. ఇందుకోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ పునర్నిర్మాణానికి తాను, పవన్ కళ్యాణ్ కృషి చేస్తుంటే.. వైసీపీ కులాలు, మతాలు, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రోజుకో ఫేక్ వార్తను ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. MAVIGUN గురించి మళ్లీ వివరించిన వైఎస్ జగన్మొన్నటి వరకూ మూడు రాజధానుల పేరుతో
