
లేడీబ్యాంక్ ఆఫీసర్ మిస్సింగ్ కేస్ మిస్టరీ! కళ్లు మూసి తెరిచేలోపే మాయం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఒక సంచలనాత్మక ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఆలమూరులోని యూనియన్ బ్యాంక్ శాఖలో రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గానుగపెంట సుప్రియ (28) ఆకస్మికంగా అదృశ్యమవ్వడం ఇప్పుడు తీవ్ర మిస్టరీగా మారింది. విధి నిర్వహణలో ఉన్న యువతి ఒక్కసారిగా మాయమవ్వడం, ఆమె వస్తువులు పంట కాలువ వద్ద లభించడంతో కోనసీమ వ్యాప్తంగా ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.ఈనెల 17వ తేదీన ఎప్పటిలాగే విధులకు హాజరైన సుప్రియ, తన మొబైల్ ఫోన్‌ను బ్యాంక్‌లోనే వదిలిపెట్టి బయటకు వెళ్లిపోయింది. ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన సిబ్బంది, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఆలమూరు మండలం చొప్పెల్ల లాకుల సమీపంలో సుప్రియకు చెందిన స్కూటీ, చెప్పులు, కళ్లజోడు పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకులో విధుల్లో ఉన్న వ్యక్తి ఫోన్ కూడా తీసుకెళ్లకుండా, కేవలం తన వస్తువులను లాకుల వద్ద వదిలివెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అమ్మాయిల అదృశ్యం వెనుక ఫ్రీ ఫైర్ గేమ్.. పేరెంట్స్ జాగ్రత్త!కాలువల్లో తీవ్రంగా గాలింపు.. రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్ దళాలు!చొప్పెల్ల లాకుల వద్ద లభించిన ఆధారాల ఆధారంగా సుప్రియ పంట కాలువలో దూకి ఉంటే ఏమోనన్న ప్రాథమిక అనుమానంతో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మొదట స్థానిక గజ ఈతగాళ్లతో కాలువను జల్లెడ పట్టించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఘటన తీవ్రతను గుర్తించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు ఎస్టీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లోకి దిగాయి. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్. విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై నరేష్ ల పర్యవేక్షణలో చొప్పెల్ల లాకులకు అనుసంధానంగా ఉన్న అన్ని పంట కాలువల్లో అత్యాధునిక పరికరాలతో గాలింపు ముమ్మరం చేశారు.జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్.. కారుపై మాట మార్చిన తాత! పోలీసులకు సవాల్‌గా మారిన