
విహార యాత్రలో ఘోరం.. సాఫ్ట్ వేర్ వధువు అనుమానాస్పద మృతి
Vizag Techie Gayatri Dead: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ముస్సోరీ (Mussoorie)లో ఘోర కలకలం రేగింది. ఏడు నెలల క్రితమే పెళ్లయి, ఎంతో ఉల్లాసంగా వెకేషన్‌కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ (విశాఖపట్నం)కు చెందిన ఓ నవ వధువు.. హోటల్ రూమ్‌లో నగ్నంగా, రక్తపు మడుగులో శవమై కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. విహార యాత్ర మాటున జరిగిన ఈ అనుమానాస్పద మృతి (Suspicious Death) కేసు విశాఖలోని రెండు కుటుంబాలలో అంతులేని విషాదాన్ని నింపింది. Read Also:Vadodara Bus Accident: గుజరాత్లో ఘోర ప్రమాదం..ఆరుగురు దుర్మరణం! పోలీసుల సమాచారం ప్రకారం.. మృతురాలు, ఆమె భర్త ఇద్దరూ సాఫ్ట్వేర్ రంగంలోనే స్థిరపడ్డారు. ఏపీలోని విశాఖపట్నం (Visakhapatnam) నగరానికి చెందిన రాధా గాయత్రి ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త శ్రీచరణ్ పుణేలోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. వీరికి గతేడాది నవంబర్ 8న పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. వెకేషన్ కోసం జూన్ 13న ఈ జంట ఢిల్లీ నుంచి మొదట రిషికేష్ వెళ్లారు. ఆ మరుసటి రోజు (జూన్ 14) రాత్రి ఆలస్యంగా ముస్సోరీలోని తిప్రీధర్ ఏరియాలో ఉన్న ‘కియానా హోమ్‌స్టే’ (Kiana Homestay)కు చేరుకుని, అందులోని ‘బ్లిస్’ అనే రూమ్‌లో చెక్ ఇన్ అయ్యారు. భర్త శ్రీచరణ్ పోలీసులకు ఇచ్చిన ప్రాథమిక స్టేట్మెంట్ ప్రకారం.. రూమ్‌లోకి వెళ్లిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మద్యం తాగారు. చాలా సేపు మాట్లాడుకున్న అనంతరం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో నిద్రపోయారు. అయితే, ఉదయం లేచి చూసేసరికి రాధా గాయత్రి ఒంటిపై నూలుపోగు లేకుండా, తీవ్ర రక్తస్రావమై రక్తపు మడుగులో శవమై పడి ఉంది. దిగ్భ్రాంతికి గురైన హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది స్పాట్‌కు చేరుకున్నారు. అంబులెన్స్ ఫార్మసిస్ట్ పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. రూమ్‌లో భార్యాభర్తలు ఇద్దరే ఉండటం, భర్త