విశాఖవాసులకు అద్భుత అవకాశం.. తక్కువ ఫీజుతోడ్రైవింగ్ నేర్చుకోవచ్చు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
Kancharapalem Government ITI Vehicle Driving Training: విశాఖపట్నంలో తక్కువ ఫీజుతో డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నారు. కంచరపాలెంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో తక్కువ ఫీజులో డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. ఈ మేరకు లైట్ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకునేందుకు దరఖాస్తుల్ని ఆహ్వానించారు. ప్రతి రోజూ 12మందికి శిక్షణ ఇస్తారు.. ఉదయం ఆరుగురు.. మధ్యాహ్నం ఆరుగురికి అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. 18 ఏళ్లు నిండినవారు ఈ డ్రైవింగ్ శిక్షణకు అర్హులు.
