భారీగా దూసుకెళ్తున్న గోల్డ్‌స్టాక్.. 4 రోజుల్లోనే 46 శాతం జంప్.. జేబులు నింపుకుంటున్నారు
Kalyan Jewellers Q1 Results : స్టాక్ మార్కెట్ పరిస్థితులతో పెద్దగా సంబంధం లేకుండా కొన్ని స్టాక్స్ అదరగొడుతుంటాయి. కంపెనీల నుంచి ప్రకటనలతో వరుసగా దూసుకెళ్తుంటాయి. ఇక్కడ మార్కెట్ లాభనష్టాలతో సంబంధం లేదు. స్టాక్ మార్కెట్ భారీగా పడిపోతున్నా దూసుకెళ్లే స్టాక్స్ ఉంటాయి. అందులోనే ప్రముఖ బంగారు, వజ్రాభరణాల విక్రయ సంస్థల్లో ఒకటైన కళ్యాణ్ జువెల్లర్స్ ఉంది. ఈ స్టాక్ వరుస సెషన్లలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ పరిస్థితి బాగోలేకున్నా, సూచీలు పడుతున్నా ఈ స్టాక్ అడ్డూఅదుపు లేకుండా పరుగులు పెడుతోంది. గత 4 ట్రేడింగ్ సెషన్లలోనే రికార్డు స్థాయిలో ఈ స్టాక్ ధర 46 శాతం పెరగడం బట్టి ఎలా పుంజుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సోమవారం సెషన్లో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ఉన్నాయి. పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్ మధ్య దాడులు జరుగుతుండగా, హర్ముజ్ జలసంధి మరోసారి మూసివేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్రూడాయిల్ ధరలు పెరగ్గా స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. సెన్సెక్స్ 250, నిఫ్టీ 90 పాయింట్ల వరకు పడిపోయినా కళ్యాణ్ జువెల్లర్స్ షేరుపై ఎలాంటి ప్రభావం కనిపించట్లేదు. కిందటి రోజు రూ. 476.15 వద్ద ముగిసిన ఈ స్టాక్ ఇవాళ ఆరంభంలో స్వల్ప నష్టంతోనే మొదలైంది. అయితే కాసేపటికే క్రమంగా పుంజుకుంటూ లాభాల్లోకి వెళ్లంది. మొదట 4-5 శాతం లాభాల్లోనే ఉన్నా ఇంట్రాడేలో ఇంకా పెరిగి ఉదయం 11 గంటల సమయంలో ఏకంగా 10 శాతం వరకు పెరిగి రూ. 521.85 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం అదే స్థాయిలో ట్రేడవుతోంది. దీంతో ఇన్వెస్టర్లకు మంచి లాభాలు వస్తున్నాయి. కళ్యాణ్ జువెల్లర్స్ మార్కెట్ విలువ కూడా క్రమంగా పెరుగుతూ వెళ్తోంది. ప్రస్తుతం రూ. 52,359 కోట్లుగా ఉంది. Read Also: షాపింగ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్- ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ముగిసిన డిస్కౌంట్ల కాలం- నో ఆఫర్స్!ఈ ఒక్కరోజే కాదు కళ్యాణ్ జువెల్లర్స్ స్టాక్ 4