
కుక్క పని గాడిద చేస్తే ఏమ వుతుందో తెలుసా.? మీ కండ్లు తెరిపించే కథ
అనగనగా రామాపురం అనే ఓ అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వీరేశం అనే రజకుడు జీవించేవాడు. గ్రామంలోని ప్రజల దుస్తులు సేకరించి, వాటిని చెరువు దగ్గరకు తీసుకెళ్లి శుభ్రంగా ఉతికి, ఆరబెట్టి తిరిగి వారి ఇళ్లకు అందించడం అతని వృత్తి. పని ఎక్కువగా ఉండటంతో వీరేశం తనకు సహాయంగా ఓ గాడిదను, ఓ కుక్కను పెంచుకున్నాడు. ప్రతిరోజూ ఉదయం గ్రామంలోని ఇళ్ల నుంచి దుస్తులు సేకరించిన తర్వాత వాటిని గాడిదపై వేసేవాడు. గాడిద ఆ బరువును మోస్తూ వీరేశంతో కలిసి చెరువు వరకు వెళ్లేది. అదే సమయంలో కుక్క కూడా గాడిద వెంట నడుస్తూ దానికి తోడుగా ఉండేది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా కుక్క ఇంటి పరిసరాల్లో తిరుగుతూ కాపలా కాసేది. ఇలా ఇద్దరూ తమకు అప్పగించిన పనిని నిత్యం చేసేవారు. వీరేశం దృష్టిలో గాడిదే ఎక్కువగా పనిచేస్తున్నట్లు కనిపించేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బట్టల మూటలను మోసేది. చెరువుకు వెళ్లడం, తిరిగి రావడం ఇలా రోజంతా శ్రమించేది. కుక్క మాత్రం ఎలాంటి బరువులు మోయదు. తనతో పాటు నడుస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అందుకే కుక్క పెద్దగా ఉపయోగపడటం లేదని వీరేశం భావించాడు. దాంతో గాడిదకు మంచి ఆహారం పెట్టేవాడు. దాని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు. కానీ కుక్క విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దీంతో కుక్క బాధపడుతూ ఉండేది. ఒకరోజు రాత్రి వీరేశం కుటుంబ సభ్యులంతా గాఢంగా నిద్రపోతున్నారు. అదే సమయంలో ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ విషయాన్ని కుక్క గమనించింది. అయితే అది వెంటనే మొరగలేదు. ఇదంతా గమనించిన గాడిదకు ఆశ్చర్యం వేసింది. “దొంగ ఇంట్లోకి వచ్చాడు కదా! నువ్వు ఎందుకు అరవడం లేదు? వెంటనే యజమానిని నిద్రలేపాలి కదా?” అని కుక్కను అడిగింది. “మన యజమానికి నేను ఎప్పుడైనా విలువైనదాన్నిగా అనిపించానా? నువ్వే