
లగేజీ సర్దుకుని వచ్చేయండ్రా అబ్బాయిలు.. హ్యాపీగా ఐపీఎల్ ఆడుకోవచ్చు
India Biggest Defeat in T20Is: భారత క్రికెట్ అభిమానులు కలలో కూడా ఊహించని ఘోర పరాజయాన్ని టీమిండియా చవిచూసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మన జట్టు ఘోరంగా కుప్పకూలింది. చేతుల్లో వికెట్లు ఉన్నా, క్రీజులో నిలదొక్కుకోలేక పరుగుల వరద పారించాల్సిన చోట చేతులెత్తేసింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్‌కు ఇది అత్యంత పెద్ద అవమానకర ఓటమిగా మిగిలిపోయింది. ఆరంభం నుంచే ఇంగ్లండ్ ఉధృతి.. సాల్ట్ మెరుపులు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు భారత బౌలర్లపై విరుచుకుపడింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం 70 పరుగులతో భారత బౌలింగ్ విభాగాన్ని చిన్నాభిన్నం చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమవడంతో ఆతిథ్య జట్టుకు తిరుగులేకుండా పోయింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. ఇది కూడా చదవండి: ఏమిరా శ్రేయాస్.. టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..! కార్డుల పేకలా కూలిన భారత బ్యాటింగ్ లైనప్.. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ సేన ఏ దశలోనూ పోరాడే పటిమను ప్రదర్శించలేదు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. కనీసం పోరాటం కూడా చేయకుండా కేవలం 11.4 ఓవర్లలోనే 72 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. టీ20 చరిత్రలో భారత్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. కేవలం 11.4 ఓవర్లలోనే ఇన్నింగ్స్ ముగిసిపోవడం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఆలౌట్ అయిన రికార్డుగా నమోదైంది. ఈ ఒకే ఒక్క ఓటమితో టీమిండియా ఎన్నో అపకీర్తి మూటగట్టుకుంది. ఇప్పటివరకు భారత్ టీ20ల్లో ఎదుర్కొన్న అతిపెద్ద ఓటమి 80 పరుగులు (న్యూజిలాండ్‌పై, 2019లో)











