
తిలక్ వర్మ సహా ఇద్దరుస్టార్లకు బిగ్ షాక్.. టీమిండియాలో భారీ మార్పులు
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్ గురువారం రాత్రి 10:00 గంటలకు (IST) బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్లో జరగనుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన టీమ్ ఇండియా 0-2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇప్పుడు సిరీస్‌లో నిలవాలంటే ఈ నాలుగో మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలవాలి. అందుకే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్లేయింగ్-11లో రెండు పెద్ద మార్పులు చేసేందుకు రెడీ అయ్యాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా వరుసగా ఫ్లాప్ అవుతున్న ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మపై వేటు పడేలా ఉంది. అతని పేలవ ఫామ్ వల్ల టీమ్‌లో ప్లేస్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు తిలక్ వర్మ ప్లేస్‌లోకి స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్‌కు ఆడే ఛాన్స్ రాలేదు. అయితే టీమ్ ఇండియాకు ఇప్పుడు సాలిడ్ బ్యాటింగ్ లైనప్ అవసరం కాబట్టి, సంజూని మళ్లీ టీమ్‌లోకి తీసుకునే ప్లాన్ చేస్తున్నారు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజూ శాంసన్ ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆడాడు. కానీ ఆ తర్వాత 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం కోసం సంజూని పక్కన పెట్టాల్సి వచ్చింది. బీహార్‌కు చెందిన ఈ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ తన మొదటి రెండు టీ20 మ్యాచ్‌ల్లో భయం లేకుండా సూపర్ షాట్లు ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ, మంచి స్టార్ట్ దొరికినా దాన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌గా మార్చడంలో ఫెయిల్ అయ్యాడు. అయినా సరే, ఈ నాలుగో టీ20లో కూడా వైభవ్‌కు మరో ఛాన్స్ ఇస్తారని టాక్. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తన టాప్ ఆర్డర్లో కొన్ని ప్రయోగాలు చేయవచ్చు