
వాళ్లు వేస్ట్, సైడ్క్యారెక్టర్లంటూ విమర్శలు.. కట్ చేస్తే.. గంభీర్ పరువు కాపాడి హీరోలుగా మారిన ఇద్దరు
Axar Patel, Washington Sundar Allround Performance: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ ఒక సాధారణ పోరులా కాకుండా, ప్రతి క్షణం ఉత్కంఠ రేకెత్తించే రోలర్ కోస్టర్ రైడ్‌ను తలపించింది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతుల్లో టీ20 సిరీస్‌లు కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు, బూడిద నుంచి లేచిన ఫీనిక్స్ పక్షిలా ఈ మ్యాచ్‌లో పుంజుకుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో 2014 తర్వాత ఇంగ్లాండ్ ఓడిపోవడం ఇదే తొలిసారి. అంటే సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ తన సొంత కోటలో ఓటమి చవిచూసింది. విశేషం ఏంటంటే, అప్పుడు, ఇప్పుడు ఆ కోటను బద్దలు కొట్టింది మన టీమిండియానే కావడం విశేషం. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ఓపెనర్లు వికెట్ పడకుండా 51 పరుగులు చేయడంతో భారత అభిమానుల్లో గుబులు మొదలైంది. అయితే, కుర్రాడు గుర్నూర్ బ్రర్ ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ వెంటనే జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ ఒకే ఓవర్లో జోస్ బట్లర్, సామ్ కరన్‌లను పడగొట్టి ఇంగ్లాండ్‌ను 80 పరుగులకే 5 వికెట్లతో పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. ఇది కూడా చదవండి: ఇంగ్లాండ్‌లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్‌కు 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే..? కానీ, స్టార్ బ్యాటర్ జో రూట్ ఇచ్చిన క్యాచ్‌ను శివం దూబే నేలపాలు చేయడంతో ఇంగ్లాండ్‌కు లైఫ్ దొరికింది. ఆ అదృష్టంతో జో రూట్ (75), లియాం డాసన్ (75) కలిసి 7వ వికెట్‌కు రికార్డు స్థాయిలో 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒకానొక దశలో మన బౌలర్లకు నరకం చూపించిన ఈ జోడీని చివర్లో అక్షర్ పటేల్ తన మాయాజాలంతో అడ్డుకున్నాడు. కేవలం 62 పరుగులిచ్చి 4




