
ఓటీటీలో అరాచకం సృష్టిస్తున్న నిజమైన రొమాంటిక్ వెబ్ సిరీస్
రొమాంటిక్ అట్మాస్పియర్ ఉన్న సినిమాల క్రేజ్ కి ఎక్స్ పైరీ డేట్ అనేది ఇంకా పుట్టలేదు. కంటెంట్ కూడా బాగుంటే ఇక ఆ సినిమా విజయ ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు. ఇటీవలి కాలంలో ఆ తరహా కంటెంట్‌కి ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే నెట్టింట విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటూ, ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోన్న సంచలనాత్మక వెబ్ సిరీస్ ‘పాంచాలి’. మహాభారతంలోని ద్రౌపది పాత్ర నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని సమకాలీన కోణంలో రూపొందించిన ఈ రొమాంటిక్ డ్రామా సిరీస్ డిజిటల్ వేదికపై సంచలనం సృష్టిస్తోంది. వినూత్నమైన కథనం, ఉత్కంఠ రేకెత్తించే మలుపులతో సాగే ఈ సిరీస్ వీక్షకులను ఆద్యంతం కట్టిపడేస్తోంది. ఈ సిరీస్ ప్రధాన కథాంశం ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల చుట్టూ తిరుగుతుంది. గ్రామీణ ఆచారాల నెపంతో భూమి అనే యువతి ఒకే ఇంట్లోని నలుగురు అన్నదమ్ములను వివాహం చేసుకుంటుంది. ఈ నలుగురు సోదరులతో కలసి జీవిస్తూ ఒక కుమారుడికి జన్మనిస్తుంది. అయితే, ఆ కుటుంబంలో పట్టణంలో చదువుకుని ఆధునిక ఆలోచనలతో పెరిగిన ఐదో తమ్ముడు కూడా ఉంటాడు. తమ వంశ పరంపర మరియు సాంప్రదాయం ప్రకారం అతడు కూడా తన వదిననే వివాహం చేసుకోవాలని నలుగురు అన్నలు కండిషన్ పెడతారు. కానీ నగరం నుండి వచ్చిన ఆ ఐదో తమ్ముడు ఈ విచిత్రమైన ఆచారాన్ని, పెళ్లి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఆ క్రమంలో కథ అనుకోని మలుపు తిరుగుతుంది. ఒకరోజు వారి ఇంట్లోని పూజ గదిలోని దేవుడి విగ్రహం నుండి ఆకస్మికంగా రక్తం కారడం కుటుంబ సభ్యులు గమనిస్తారు. ఐదో తమ్ముడు భూమిని పెళ్లి చేసుకోకపోవడం వల్లనే ఇంటికి ఈ అనర్థం మరియు దైవాగ్రహం కలుగుతోందని అన్నలు నమ్ముతారు. ఇక ఆ ఐదో తమ్ముడిని కూడా తన వలలో వేసుకుని పెళ్లికి ఒప్పించడానికి భూమి ఎలాంటి వ్యూహాలు పన్నింది, లోభం మరియు ఆకర్షణతో అతడిని ఎలా లోబరుచుకోవడానికి ప్రయత్నించింది