
ఉచితంగా కార్పొరేట్ విద్య .. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్ల ఏర్పాటు
సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖపట్నం, నెల్లూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు IIT-JEE, NEET ప్రవేశ పరీక్షలకు పూర్తిగా ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించనున్నారు. ఆధునిక తరగతి గదులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, వసతి, భోజన సౌకర్యాలతో గురుకుల విద్యాసంస్థలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనుంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వాలనే లక్ష్యంతో మొత్తం 13 భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా సుమారు రూ.11,569.91 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానుండగా, దాదాపు 31,431 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. చిత్తూరు జిల్లాలో మోండెలీజ్ ఇండియా ఫుడ్స్ సంస్థ రూ.1,801 కోట్లతో భారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, విద్యుత్ సబ్సిడీ వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోకో ఆధారిత చాక్లెట్ తయారీలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది. అదేవిధంగా వ్యర్థ నూనెతో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీ ప్రాజెక్టుకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా టూరిజం పాలసీలో కీలక మార్పులు చేశారు. భారీ సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అందించాలని నిర్ణయించారు. 20 వేల మంది వరకు హాజరయ్యే ఈవెంట్లకు రూ.2 కోట్ల వరకు, 50 వేల మంది వరకు పాల్గొనే కార్యక్రమాలకు రూ.5 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అవసరమైతే ప్రభుత్వ స్థలాలను కూడా ఉచితంగా కేటాయించేందుకు సిద్ధమైంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను