
పాన్, ఆధార్ వాట్సాప్ లో పంపుతున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
"మీ పాన్, ఆధార్, లేటెస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ వాట్సాప్ చేయండి" ఈ మాట మనకు తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. లోన్ ఏజెంట్, ప్రాపర్టీ బ్రోకర్ లేదా హోటల్ రిసెప్షనిస్ట్ వెరిఫికేషన్ కోసం అడిగినప్పుడు, మనం ఏమాత్రం ఆలోచించకుండా మన కీలక పత్రాలను పంపేస్తాం. కానీ, ఈ చిన్నపాటి నిర్లక్ష్యం మన అత్యంత సున్నితమైన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తీవ్రమైన ప్రమాదంలోకి నెడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సమస్య ఎక్కడ మొదలవుతుంది?మీరు వాట్సాప్‌లో డాక్యుమెంట్లు పంపినప్పుడు, అవి కేవలం అవతలి వ్యక్తికి చేరడమే కాదు, వారి వ్యక్తిగత ఫోన్, ల్యాప్‌టాప్ లేదా క్లౌడ్ బ్యాకప్‌లో శాశ్వతంగా నిల్వ ఉండిపోతాయి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అవతలి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేయకపోయినా, వారి డివైజ్ భవిష్యత్తులో హ్యాకింగ్‌కు గురైతే లేదా వారి అకౌంట్ పాస్వర్డ్ చోరీకి గురైతే, మీ డాక్యుమెంట్లు నేరగాళ్ల చేతికి చిక్కుతాయి. ఒక్కసారి పంపిన సమాచారంపై మన నియంత్రణ పూర్తిగా పోతుంది."ప్రజలు తమ డాక్యుమెంట్లను ఒక కంపెనీకి లేదా హోటల్‌కు పంపుతున్నామని అనుకుంటారు. కానీ వాస్తవానికి, వారు ఒక వ్యక్తిగత ఫోన్‌కు పంపి, తమ డేటాపై పూర్తి నియంత్రణ కోల్పోతున్నారు" అని డిజిటల్ ట్రస్ట్ ప్లాట్‌ఫామ్ 'డిజియో' సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అభినవ్ పరాశర్ వివరించారు.ఆర్థిక మోసాలకు ఆస్కారంముఖ్యంగా ఆర్థిక రంగంలో పనిచేసే డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు (డీఎస్ఏలు) కస్టమర్ల నుంచి కేవైసీ పత్రాలను తమ వ్యక్తిగత ఫోన్ నంబర్ల ద్వారా సేకరిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల ఆ సమాచారం కంపెనీ సైబర్ భద్రతా