
IBPS RRBలో 13,706 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. సెప్టెంబర్ 21తో ముగుస్తున్న దరఖాస్తుల గడువు
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు IBPS శుభవార్త అందించింది. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో వివిధ పోస్టుల భర్తీకి CRP RRBs XV నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 13,706 పోస్టుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-I, II, III ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, CA, MBA వంటి అర్హతలు అవసరం. ప్రిలిమ్స్, మెయిన్స్/సింగిల్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 21, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు..
