
చచ్చేంత కష్టం ఏమొచ్చిందో
వారు ఇద్దరు.. వారికి ఇద్దరు! సొంతిల్లు ఉంది! బియ్యం వ్యాపారంలో భర్త బిజీ! ఇంట్లోనే ఉంటూ ఇద్దరు కుమారులు, అత్తగారి బాగోగులను చూసుకోవడమే.. ఘట్కేసర్లో రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య పెద్ద అంబర్‌పేట్‌లో సొంతిల్లు, బంగారంలాంటి ఇద్దరు పిల్లలు బియ్యం వ్యాపారంలో భర్త బిజీ.. ఆర్థిక లావాదేవీలే కారణమా? ఇతరులతో కలిసి రెడీ మిక్సర్ కొనుగోలు?.. రెండ్రోజులుగా డిప్రెషన్లో ఘట్కేసర్ రూరల్, అబ్దుల్లాపూర్‌మెట్, చెన్నారావుపేట, జూలై 3 (ఆంధ్రజ్యోతి): వారు ఇద్దరు.. వారికి ఇద్దరు! సొంతిల్లు ఉంది! బియ్యం వ్యాపారంలో భర్త బిజీ! ఇంట్లోనే ఉంటూ ఇద్దరు కుమారులు, అత్తగారి బాగోగులను చూసుకోవడమే లోకంగా ఉంటున్న భార్య! మరి, ఏమైందో ఏమో తెలియదు.. ఆ దంపతులు ఉన్నపళంగా ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు! ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ విషాద ఘటన జరిగింది. మృతులను పెద్ద అంబర్పేట్ కుంట్లూర్‌లో నివాసం ఉంటున్న బుడిగె రవికుమార్ (40), శిరీష (37)గా గుర్తించారు. దంపతులు ఒకరినొకరు హత్తుకొని రైలు పట్టాలపై నిల్చున్నారని.. క్షణాల్లోనే ఘోరం జరిగిపోయిందని లోకోపైలెట్ చెప్పడం అందరి గుండెలనూ కదిలించి వేసింది!! రైల్వే పోలీసులు, కుంట్లూర్‌లోని స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం రవి దంపతుల స్వస్థలం మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామం. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కొచ్చారు. ఈ దంపతులకు కుమారులు సుశాంత్ (13), విద్వేన్ష్ (11) ఉన్నారు. కుంట్లూర్ గణేశ్‌నగర్ ఫేజ్-2లో రవి ఓ ఇల్లు కొనుక్కొని కుటుంబసభ్యులతో కలిసి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. రవి తల్లి కూడా వీరితో పాటే ఉంటోంది. ఆమెకు ఇటీవల పక్షవాతం వచ్చింది. సుశాంత్ తొమ్మిదో తరగతి, విద్వేన్ష్ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. రవి చైతన్యపురిలో రైస్‌డిపో నిర్వహిస్తున్నాడు. రవి దంపతులకు హైదరాబాద్‌లో బంధువులు గానీ, సన్నిహితులు గానీ ఎవరూ లేరు. అయితే రెండ్రోజులుగా ఈ దంపతులు మానసికంగా తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. సొంతిటిని ఖాళీ