
రూ.10 నాణేలతో బైక్ కొన్న కస్టమర్.. లెక్కపెట్టలేక తలలు పట్టుకున్న సిబ్బంది
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Nalgonda Viral News: సమాజంలో ఇప్పటికీ రూ.10 నాణేల చెల్లబాటుపై అక్కడక్కడా అపోహాలు నడుస్తూనే ఉన్నాయి. చాలా చోట్ల కిరాణా దుకాణ యజమానులతో పాటు వ్యాపారాలు చేసేవారు కూడా పది రూపాయల కాయిన్స్ తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉంటారు. అయితే, ఆ అపోహలను తొలగిస్తూ.. రూ.10 నాణేలు భారత అధికారిక కరెన్సీయేనని నిరూపించాడు నల్లగొండ జిల్లాకు చెందిన ఒక సాధారణ వ్యక్తి.. ఏకంగా రూ.1.10 లక్షల విలువైన బైక్‌ను కేవలం పది రూపాయల నాణేల రూపంలోనే బిల్ కట్టేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.. అసలేం జరిగిందంటే..? నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి అనే వ్యక్తి కొంతకాలంగా బైక్ కొనుగోలు చేయాలని అనుకున్నాడు.. అయితే, ఇందుకోసం ఆయన వినూత్నంగా ఆలోచించి.. రూ.10 నాణేలను భారీగా సేకరించాడట. చిట్యాల పట్టణంలోని ప్రముఖ మోటర్ సైకిల్ షోరూమ్‌కు వెళ్లాడు. అక్కడ తనకు నచ్చిన.. సుమారు రూ.1.10 లక్షల విలువైన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను కొనుగోలు చేశాడు.. నాణేల మూటలతో షోరూమ్‌కు.. ఇక అసలు కథ ఇక్కడే మొదలైంది. బైక్ కొనుగోలుకు సంబంధించిన నగదు చెల్లించే సమయం వచ్చేసరికి.. రఘుపతి తన వెంట తెచ్చుకున్న సంచులను ఓపెన్ చేశాడు. అందులో నోట్లకు బదులుగా గుట్టలు గుట్టలుగా రూ.10 నాణేలు దర్శనమిచ్చాయి. ఏకంగా 11,000 పది రూపాయల నాణేలను షోరూమ్ కౌంటర్‌పై కుమ్మరించాడు. అది చూసి షోరూమ్ సిబ్బందితో పాటు అక్కడున్న మిగతా కస్టమర్లు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. లెక్కపెట్టడానికి