
అమెరికాలో లక్షల్లో జీతం.. హెచ్ -1బీ వీసా.. అయినా భారత్ కు తిరిగొచ్చేసింది
అమెరికాలో మంచి ఉద్యోగం. ఆరు అంకెల జీతం. హెచ్-1బీ వీసా కూడా వచ్చింది. అయినా ఆ భారతీయ యువతి అన్నింటినీ వదిలేసి భారత్‌కు తిరిగొచ్చింది. కుటుంబంతో కలిసి ఉండటమే తనకు ముఖ్యమని చెబుతోంది. అమెరికాలో ఉన్నప్పుడు స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం పెరిగినా.. ఒంటరితనం మాత్రం తనను ఇబ్బంది పెట్టిందని 28 ఏళ్ల దిశా లాంబా తెలిపింది.న్యూయార్క్‌లో ఉన్నప్పుడు సాయంత్రం 5 గంటలకు పని ముగిసేది. ఆ తర్వాత తన రోజు ఎలా గడిచిందని అడిగే కుటుంబ సభ్యులు దగ్గరలో ఉండేవారు కాదని ఆమె చెప్పింది. స్నేహితులు ఉన్నా.. వాళ్లు కుటుంబానికి ప్రత్యామ్నాయం కాలేరని పేర్కొంది. భారత్‌లో ఉన్న తల్లితో మాట్లాడేందుకు కూడా సమయ వ్యత్యాసాన్ని బట్టి ముందుగానే కాల్స్ ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేదని తెలిపింది.2021లో అమెరికాకు..దిశా 2021లో న్యూయార్క్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లింది. చదువు పూర్తయ్యాక 2024లో సీఎస్ఎస్ హెల్త్‌లో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం సంపాదించింది. కెరీర్ కూడా మంచి స్థాయిలో సాగింది.అయితే హెచ్-1బీ వీసాతో ఉన్న పరిమితులు ఆమెకు నచ్చలేదు. ఉద్యోగం మార్చుకోవడం, అదనపు ఆదాయ మార్గాలు ఎంచుకోవడం, కొంతకాలం కెరీర్‌కు విరామం ఇవ్వడం కష్టంగా అనిపించిందని చెప్పింది. భారత్ నుంచి అమెరికాకు తిరిగి వెళ్లేందుకు వీసా స్టాంపింగ్ ప్రక్రియ కూడా ఇబ్బందిగా ఉండేదని తెలిపింది.ఉద్యోగం వదిలి గురుగ్రామ్‌కు..2026 మేలో దిశా అమెరికాను వీడి గురుగ్రామ్‌కు తిరిగొచ్చింది. ప్రస్తుతం తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఉంటోంది. ఉద్యోగం వదిలిన తర్వాత రెండు నెలల కెరీర్ బ్రేక్ తీసుకుంది. వీసా పరిమితులు లేకపోవడం వల్ల