
రాష్ట్రంలో పెనమలూరుప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి
Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

డీఎస్పీ గొర్రె మధు దాతృత్వాన్ని కొనియాడిన ఉపాధ్యాయులు జూలూరుపాడు, సెప్టెంబర్ 01 : తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సహకరిస్తూ, విద్యార్థుల కష్టాలను తీర్చేందుకు పూర్వ విద్యార్థులు ముందుకురావడం అభినందనీయమని జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య అన్నారు. జూలూరుపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివి, సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ విద్యాభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థి, ప్రస్తుత మంచిర్యాల డీఎస్పీ గొర్రె మధు తన తల్లిదండ్రులు దివంగత గొర్రె నరసయ్య - బాలమ్మ జ్ఞాపకార్థం పాఠశాలకు సుమారు రూ.1,20,000 విలువైన సామగ్రిని విరాళంగా మంగళవారం అందజేశారు. [caption id="attachment_2499841" align="alignnone" width="1200"] పాఠశాలకు పూర్వ విద్యార్థి రూ.1.20 లక్షల విలువైన సామగ్రి అందజేత[/caption] ఇందులో భాగంగా విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్, తరగతి గదుల్లో కూర్చోవడానికి 20 బెంచీలు, అలాగే పాఠశాల కార్యాలయ పనులు, విద్యార్థుల ఆన్లైన్ డేటా ఎంట్రీ, స్కాలర్షిప్లు ఆధార్ అనుసంధాన ప్రక్రియల కోసం ల్యాప్‌టాప్ ప్రింటర్‌ను సమకూర్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ఎస్ఎంసీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. ఉన్నత స్థానానికి చేరుకున్నా మూలాలను మర్చిపోకుండా, పేద విద్యార్థుల అవసరాలను గుర్తించి పెద్ద మనసుతో చేయూతనిచ్చిన డీఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు. [caption id="attachment_2499842" align="alignnone" width="1200"] పాఠశాలకు పూర్వ విద్యార్థి రూ.1.20 లక్షల విలువైన సామగ్రి అందజేత[/caption]

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. School girl dies in delhi after teacher stand in sun punishment: సాధారణంగా సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంతో గౌరవంగా చూస్తారు. టీచర్లు తమ పిల్లలకు పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా చెబుతారని తల్లిదండ్రులు వారిపైన ఎంతో నమ్మకాలు పెట్టుకుంటారు. కానీ ఇటీవల కొంత మంది ఉపాధ్యాయుల ప్రవర్తన వారి పవిత్రమైన వృత్తికే మాయనిమచ్చగా మారుతుంది. కొంత మంది తప్పతాగి క్లాసులకు రావడం, తోటి మహిళ సిబ్బంది పట్ల నీచంగా ప్రవర్తించడం, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారి పనులు చేయించుకొవడం చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం స్టూడెంట్స్ పట్ల పైశాచీకంగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని తూర్పు వినోద్ నగర్‌లోని సర్వోదయ కన్యా విద్యాలయం ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల పదేళ్ల బాలిక స్కూల్ లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి పడిపోయినట్లు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. అయితే.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా గంటల వ్యవధిలోనే చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర దుమారం రాజుకుంది. దీనిపై అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదేళ్ల విద్యార్థిని స్కూల్ కు పుస్తకం తెలేదని విషయంలో టీచర్ ఆమెను ఆగస్టు 27న రోజంతా ఎండలో నిలబెట్టింది. దీంతో బాలిక ఆరోగ్యం క్షీణించింది. తర్వాత పాఠశాల వారు బాలిక తల్లి అంజలికి ఫోన్ చేశారు. తమ కూతురు స్కూల్ కు వెళ్లే వరకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని ఆమె కుటుంబ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Govt School Uniform Issue Telangana: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల (యూనిఫాం) పంపిణీలో తీవ్ర అక్రమాలు, అలసత్వం వెలుగుచూశాయి. సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన యూనిఫాంల పంపిణీ కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారితీసింది. పంపిణీ చేసిన దుస్తుల కొలతల్లో భారీ తేడాలు రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాఠశాలల్లో బాలికలకు కేటాయించిన దుస్తులు కొంతవరకు ఫర్వాలేదనిపించినా, బాలురకు అందించిన చొక్కాలు (అంగీలు), లాగుల పరిస్థితి మాత్రం మరీ అధ్వానంగా తయారైంది. కొందరు విద్యార్థులకు చొక్కాలు మరీ పొట్టిగా, బిగుతుగా ఉంటే.. మరికొందరికి అతిగా పొడవుగా, వదులుగా ఉన్నాయి. నాణ్యత లేని కుట్లు ఉండటంతో పాటు చొక్కాలు, లాగులు ఒకవైపు పైకి, మరోవైపు కిందికి వేలాడుతూ అసమానంగా ఉన్నాయని ఉపాధ్యాయులు గుర్తించారు. ఈ లోపాలను గమనించిన పలువురు ఉపాధ్యాయులు, ఇలాంటి నాసిరకం దుస్తులను విద్యార్థులకు పంపిణీ చేయలేమని స్పష్టం చేస్తూ పంపిణీ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌తో పాటు వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లోనూ ఇదే తరహా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారముపై హుస్నాబాద్ ఎంఈవో మనీల స్పందిస్తూ.. యూనిఫాంల కొలతల్లో తేడాలు వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ దుస్తులను కుట్టిన మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో మాట్లాడి, కొలతలను సరిచేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దుస్తులను పునర్నిర్మించి సరిచేసే వరకు విద్యార్థులకు పంపిణీ చేయవద్దని హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. విద్యార్థుల దుస్తుల నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సినీ కార్మికుల పిల్లల కోసం త్వరలోనే కార్పొరేట్ స్థాయి పాఠశాలను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ పాఠశాల నిర్మాణం కోసం స్థలాన్ని కూడా ఎంపిక చేశామని ఆయన వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా నవీన్ యాదవ్ ఈ కీలక వివరాలను పంచుకున్నారు. ఇదిలా ఉండగా, 2025 అక్టోబర్‌లో జూబ్లీహిల్స్‌లో జరిగిన సినీ కార్మికుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక హామీలు ఇచ్చారు. కృష్ణానగర్ సమీపంలో 3 నుండి 4 ఎకరాల విస్తీర్ణంలో నర్సరీ నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యాసంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్మికుల కుటుంబాలకు ఆరోగ్య బీమా, గృహ వసతి మరియు వెల్ఫేర్ ఫండ్ వంటి పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో 2025 నవంబర్‌లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సినీ కార్మికులు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నవీన్ యాదవ్ కుటుంబానికి చిత్రపురి హౌసింగ్ సొసైటీ మరియు సినీ పరిశ్రమతో గత 40 ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ మాట్లాడుతూ ‘విశ్వనాథ్ & సన్స్’ దర్శకుడు వెంకీ అట్లూరి తమ కుటుంబ మిత్రుడని గుర్తు చేసుకున్నారు. వెంకీ తండ్రి అట్లూరి సుబ్బారావు రియల్టర్‌గా, నిర్మాతగా ఎంతో కృషి చేశారని కొనియాడారు. సినీ కార్మికులకు ఎలాంటి సహాయం కావలసి వచ్చినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఫలితంగా ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలంలో త్వరలోనే స్కూల్ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. సూర్య, మమితా బైజు నటించిన ‘విశ్వనాథ్ &