కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ పై విండ్ ఫాల్ టాక్స్ జీరో.. డీజిల్, ఏటీఎఫ్ పైనా తగ్గింపు.. లేటెస్ట్
Hyderabad Petrol Price : అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఓసారి దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు సహా వీటి టాక్స్ రేట్లను సవరిస్తోంది. చాలా వరకు రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోయినా మరోవైపు విండ్‌ఫాల్ టాక్స్ రేట్లను మాత్రం సవరిస్తూ వస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో దీనిని కూడా పెంచడం లేదా తగ్గించడం చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఆగస్ట్ 15న మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ గెయిన్స్ తగ్గించేసింది. దీనిని దేశీయంగా ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌పై విధిస్తుంది కేంద్రం. తాజాగా విండ్‌ఫాల్ టాక్స్ గెయిన్స్ తగ్గించడంతో విదేశాలకు ఇంధనం ఎగుమతి చేసి లాభాల్ని ఆర్జించే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి చమురు సంస్థలకు ప్రయోజనం అందనుంది. పూర్తి వివరాల్ని చూద్దాం.పెట్రోల్ ఎగుమతులపై నిన్నటి వరకు లీటరుపై విండ్‌ఫాల్ టాక్స్ రూ. 3.5 గా ఉండగా, దీనిని తాజాగా సున్నాకు పరిమితం చేసింది. అంటే ఇక్కడ విండ్‌ఫాల్ టాక్స్ మొత్తాన్ని తగ్గించింది. ఇదే సమయంలో డీజిల్‌పై లీటరుకు గతంలో రూ. 25.5 గా ఉండగా దీనిని స్వల్పంగా తగ్గించి ఇప్పుడు రూ. 24 కు పరిమితం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు విమాన ఇంధనంపై (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ లేదా జెట్ ఫ్యూయెల్) అంతకుముందు లీటరుపై విండ్‌ఫాల్ టాక్స్ రూ. 22 గా ఉంటే ఇప్పుడు రూ. 19.5 కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.అయితే ఇక్కడ విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించినంత మాత్రాన ఈ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రస్తుతం ఈ రేట్లు స్థిరంగానే ఉన్నాయి. ఆగస్ట్ 15న హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.73 గా ఉండగా, డీజిల్ రేటు లీటరు రూ. 103.82 పలుకుతోంది. ముడి