
వరలక్ష్మీవ్రతం రోజు ఈ లక్ష్మీ మంత్రాలు చదివితే జరిగే అద్భుతాలే
Varalakshmi Vratam Mantras: వరలక్ష్మీ వ్రతం రోజున, ప్రతి శుక్రవారం అమ్మవార్లకు సంబంధించిన మంత్రాలను జపించడంతోపాటు వినడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందట. ముఖ్యంగా వీటిని వింటే అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.. Varalakshmi Vratam Mantras: లక్ష్మీదేవి స్తోత్రాలతో పాటు మంత్రాలను వరలక్ష్మీ వ్రతం రోజున భక్తిశ్రద్ధలతో వినడం, చదవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా ఈ మంత్రాలను చదవడం వల్ల మానసికంగా, భౌతిక జీవితంలో విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.. అయితే, ఎలాంటి లాభాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. వరలక్ష్మీ వ్రతం రోజున వరలక్ష్మికి సంబంధించిన అమ్మవారి మంత్రాలను వినడం చదవడం వల్ల ధనధాన్యాలతో పాటు సంతానం ధైర్యాన్ని అందిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారి మంత్రాలని జపిస్తూ ఉంటారు. మంత్రాల్లోని నిర్దిష్ట బీజాక్షరాల ఉచ్చరణ ఇంటిలో, శరీరంలోని సానుకూల తరంగాలను పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి ప్రతి ఒక్కరిలోనూ పాజిటివిటీని పెంచుతాయి.. ఇంట్లో లక్ష్మీ మంత్రాలను నిరంతరంగా చదవడంతో పాటు వినడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి.. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడుతుందట.. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం రోజు వినడం, చదవడం చేయడం చాలా మంచిది.. లక్ష్మీ గాయత్రీ లేదా అమ్మవార్లకు సంబంధించిన అష్టోత్తర శతనామావళి వినడం వల్ల మానసిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆందోళనతో పాటు ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గుతుంది. మహిళలు వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవార్లకు సంబంధించిన మంత్రాలను చదవడం వల్ల కుటుంబ సమస్యలు తొలగిపోవడమే కాకుండా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు