
Asian Games 2026: భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ జెర్సీ ఎందుకు వేసుకోలేదు? అసలు కారణం ఇదే
Asian Games 2026: భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ జెర్సీ ఎందుకు వేసుకోలేదు? అసలు కారణం ఇదే
© 2026 nimisham.in

Asian Games 2026: భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ జెర్సీ ఎందుకు వేసుకోలేదు? అసలు కారణం ఇదే

Asian Games 2026: జపాన్‌పై ఘన విజయం.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళల క్రికెట్ జట్టు

Asian Games 2026: ఆసియా క్రీడల కోసం టీమిండియా జట్టులో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి తప్పుకోగా, అతని స్థానంలో యువ ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్‌కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. నితీష్ కుమార్ రెడ్డిని ఆసియా గేమ్స్ జట్టు నుంచి తప్పించి వన్డే స్క్వాడ్‌లోకి ఎంపిక చేశారు.

భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా అఫ్గానిస్థాన్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో జపాన్ వేదికగా సెప్టెంబర్ 28 నుంచి జరగనున్న ఆసియా క్రీడలకూ వరుణ్ దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Asian Games 2026: ఆసియా గేమ్స్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్

Asian Games 2026: గోల్డ్ కోసం మొనగాళ్లనే పంపుతాం..: బీసీసీఐ

Asian Games | జపాన్‌లో భారీ వరదలు.. ఆసియా గేమ్స్‌కు ముప్పు.. అథ్లెట్స్ తరలింపు

ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌కు భారత బృందాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. మొత్తం 768 మంది సభ్యులతో కూడిన భారత బృందంలో 503 మంది క్రీడాకారులు, 246 మంది అధికారులు, సహాయక సిబ్బంది, 19 మంది కంటింజెంట్ సిబ్బంది ఉన్నారు.ఆసియా గేమ్స్ సమయంలో రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు విశ్రాంతి ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో భారత్ వైట్‌బాల్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గంభీర్‌కు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో లక్ష్మణ్ భారత పురుషుల జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు.లక్ష్మణ్‌కు సునీల్ జోషి, హృషీకేశ్ కనిత్కర్, శుభదీప్ ఘోష్ సహాయకులుగా వ్యవహరిస్తారు. మహిళల జట్టుకు అమోల్ ముజుందార్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. ఇంగ్లాండ్‌తో వైట్‌బాల్ సిరీస్ తర్వాత గంభీర్‌కు విశ్రాంతి ఇచ్చిన సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగనున్నాయి. 2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో రెండు జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. అప్పుడు పురుషుల జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించగా.. మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించారు.మరోవైపు ఆసియా గేమ్స్‌లో క్రికెట్ జట్లకు వసతి ఏర్పాట్లపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో జపాన్ క్రికెట్ సంఘం సీఈవో నవోకి అలెక్స్ మియాజీ కీలక

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తొలిసారిగా పోలీసు స్పోర్ట్ మీట్ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగం చేసేవారు 24 గంటలూ అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తొలిసారిగా పోలీసు స్పోర్ట్ మీట్ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగం చేసేవారు 24 గంటలూ అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. పోలీసు ఉద్యోగం నిత్యం అనేక సవాళ్లతో కూడుకున్న పని అని తెలిపారు. ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌ను డీజీపీ ఈరోజు (మంగళవారం) ప్రారంభించి, మాట్లాడారు. పోలీసులకు క్రీడల పట్ల కూడా అంత ఆసక్తి కనబరిచే సమయం ఉండదని.. కానీ క్రీడల వల్ల మెంటల్, ఫిజికల్ ఫిట్నెస్ వస్తోందని వివరించారు. ఇప్పుడు ఇలా అందరూ కలిసి క్రీడల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని డీజీపీ చెప్పారు. ఇక్కడ పోటీల్లో గెలవాలని చాలా కష్టపడతారని, ఆలోచన చేస్తారని అన్నారు. ఇదే విధంగా విధుల్లో కూడా అనేక సవాళ్లను ఎదుర్కొని ఆయా కేసులు చేధించేలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. నిత్యం క్రీడలు ఆడటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. పోలీసులు వృత్తి రీత్యా ఎంత బిజీగా ఉన్నా... క్రీడల్లో రాణించేలా పాల్గొనాలని సూచించారు. ఏపీ పోలీసులకు క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని డీజీపీ కొనియాడారు. గతంలో అనేక పతకాలు వచ్చినా, భవిష్యత్తులో రాష్ట్ర పోలీసులు సాధించే విజయాలతో ఏపీకి క్రీడల్లో మరింత గుర్తింపు రావాలని సూచించారు. యువత కూడా చదువు, ఉద్యోగాలతో పాటు క్రీడల్లో రాణించాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పిలుపునిచ్చారు. జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్ రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్

కిర్గిజ్ రాజధాని బిష్కెక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఐదేళ్లు దాటుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలంటూ పుతిన్ ముందే భారత్ తన శాంతి వైఖరిని అత్యంత స్పష్టంగా పునరుద్ఘాటించింది. అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు అడుగులు వేయడం మానవాళి శ్రేయస్సుకు అత్యవసరమని మోదీ తేల్చిచెప్పారు. గతంలో 2022 సమర్కాండ్ ఎస్సీఓ సదస్సులో ఇది యుద్ధాల యుగం కాదని చెప్పిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. 2025 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సు తర్వాత 2026లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి భేటీ ఇదే కావడం విశేషం. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత భూమి నుంచి ఎల్లప్పుడూ శాంతి సందేశమే ప్రపంచానికి వెళ్తుందని రష్యా అధ్యక్షుడికి ప్రధాని నేరుగా వివరించారు. శాంతి వైపు వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశను నింపుతుందని మోదీ స్పష్టం చేశారు. దీంతో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చలకు మరియు శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి వెల్లడించారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లోని సంఘర్షణల వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం మరియు భారతీయ నావికుల భద్రత తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భేటీలో మోదీ వ్యాఖ్యలపై స్పందించిన పుతిన్, భారత్ మరియు రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనియాడారు. ఫలితంగా 2026 మొదటి ఆరు నెలల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగిందని రష్యా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రక్షణ, ఇంధనం, ఎరువులు, అంతరిక్షం మరియు వినూత్న రంగాలు సహా ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై రెండు దేశాల అధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12–13

India vs Pakistan Womens Match: ఆసియా క్రికెట్ వేదికపై మరో హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నీ కోసం పాకిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరగనున్న ఈ సమరంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడే తేదీ కూడా ఖరారైంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ మ్యాచ్ షెడ్యూల్ వివరాలు ఇవే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా సమరం.. మహిళల టీ20 ఆసియా కప్ పదో సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ మెగా టోర్నీ అత్యంత ఘనంగా సాగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 ఆసియా దేశాలు పోటీ పడుతున్నాయి. వీటిని చెరో నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..! గ్రూప్-ఎ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, పాకిస్థాన్, థాయిలాండ్, హాంకాంగ్ జట్లు చోటు దక్కించుకున్నాయి. ఈ రెండు చిరకాల ప్రత్యర్థులు ఒకే గ్రూపులో ఉండటంతో లీగ్ దశలోనే దాయాదుల పోరు ఖాయమైంది. ఈ ప్రతిష్టాత్మక సమరానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తాజాగా 15 మంది సభ్యులతో కూడిన తమ బలమైన మహిళా జట్టును అధికారికంగా ప్రకటించింది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మహా సమరం ఎప్పుడంటే? క్రికెట్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో భారత జట్టు తమ ప్రయాణాన్ని ఆగస్టు 30వ తేదీన థాయిలాండ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా ప్రారంభిస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న హాంకాంగ్ జట్టుతో తలపడుతుంది. గ్రూప్ దశలో చివరిదైన అత్యంత కీలక పోరులో సెప్టెంబర్ 5న భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ

గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. సిద్దిపేట: గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. ఈరోజు (శనివారం) సంగారెడ్డిలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. దేశంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజునా చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి మరొకరు ఉండరని విమర్శించారు. సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4:20 గంటలకు ప్రసంగం ప్రారంభించి 420 మాటలు మాట్లాడారని మండిపడ్డారు. ఆయన తన ప్రసంగంలో ఉమ్మడి మెదక్ జిల్లా గురించి ఒక్క మాటా మాట్లాడలేదని ధ్వజమెత్తారు. రేవంత్ చేతకానితనం వల్లే సింగూరు ఖాళీ అయిందని ఆరోపించారు. కామారెడ్డి జిల్లాకు మంచినీళ్లు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి బాగుపడాలని గత ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రారంభిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మూలన పడేసిందని నిప్పులు చెరిగారు. జహీరాబాద్‌లో బసవేశ్వర విగ్రహం ప్రారంభించి ఏడాది అయిందని, ఆ రోజు ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలయ్యాయా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో ఈ మూడేళ్లలో ఒక్క రోడ్డు అయినా వేశారా? అని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చారని అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని, కానీ నేడు సంగారెడ్డిలో రేషన్ కార్డులు ఇవ్వలేదని చెబుతున్నారని ఆగ్రహించారు. నిరుపేదలకు రేషన్

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 డిసెంబరులో నిర్వహించేందుకు ఏర్పాట్లు మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోండి క్రీడా స్పూర్తిని చాటేలా పోటీలు ఉండాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్ లో ఖేలో ఇండియా యూత గేమ్స్ ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే ఈ పోటీలకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. డిసెంబరులో పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. హైదరాబాద్ లోని స్టేడియంలలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు సంబంధించిన ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు. మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి పని విభజన చేసుకుని బాధ్యత తీసుకోవాలని తెలిపారు. తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్ తో పాటు జాతీయస్థాయి క్రీడా ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో భాగంగా 20 రకాల స్పోర్ట్స్ కు సంబంధించిన పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో… క్రీడా విభాగాల వారీగా పోటీ ప్రదేశాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు. క్రీడా స్ఫూర్తిని చాటేలా నిర్వహణ ఉండాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Govt of Telangana: దేశీయంగా జరిగే ప్రతిష్టాత్మక క్రీడా పోటీలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026కు తెలంగాణ ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ క్రీడా పోటీలకు భారీ ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని స్టేడియంలలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లు, నిర్వహణపై క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితోపాటు క్రీడా శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఖేలో ఇండియా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు ఈ పోటీపడుతుండడంతో వాటికి సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. డిసెంబర్లో ఖేల్ ఇండియా పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఖేలో ఇండియా క్రీడా పోటీల సందర్భంగా హైదరాబాద్‌లోని స్టేడియంలలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి ఆదేశించారు. దీనిక అవసరమైన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఖేలో ఇండియా క్రీడా పోటీల ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు సంబంధించిన ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు వెంటనే కసరత్తు ప్రారంభించాలని సూచించారు. ఈ క్రీడా పోటీల సందర్భంగా మౌలిక వసతులు

భారత్‌లో పెద్దగా పరిచయం లేని సెపక్ టక్రా గేమ్స్‌లో మన జట్టు మరోసారి సత్తా చాటింది. ఆసియాగ్నేసియా ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన సెపక్ టక్రా గేమ్‌లో భారత్ తాజాగా కాంస్య పతకం సాధించింది. థాయ్‌లాండ్ వేదికగా జరిగిన కింగ్స్ కప్ సెపక్ టక్రా చాంపియన్‌షిప్‌లో పురుషుల క్వాడ్రాంట్ (నలుగురు ఆటగాళ్లు కలిసి) ఈవెంట్లో భారత్ ఈ పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో భాగంగా సెమీఫైనల్లో భారత్ 15-9, 9-15, 9-15తో ఆతిథ్య థాయ్‌లాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగిన పోరులో భారత ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించడం విశేషం. ఈ విజయంతో భారత్ ఆసియా గేమ్స్‌లో పతకం ఆశలు రేపుతోంది. ఎందుకంటే సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడల్లో సెపక్ టక్రా గేమ్ ఉండడమే దీనికి కారణం. ప్రతిష్టాత్మ ఆసియా క్రీడల్లో సెపక్ టక్రాలో భారత్ పతకం సాధించాలని ఆశిద్దాం. ఏమిటీ సెపక్ టక్రా? సెపక్ టక్రా లేదా సెపక్ట క్రా అనేది ఆగ్నేయాసియాకు చెందిన ప్రసిద్ధ క్రీడ. దీనిని బ్యాడ్మింటన్ కోర్టును పోలిన కోర్టులో ఇరు జట్ల నుంచి రెండు నుంచి నలుగురు ఆటగాళ్లు ఆడడం జరుగుతుంది. ఇక మ్యాచ్‌లో బెత్తన్ లేదా ప్లాస్టిక్‌తో చేసిన బంతిని ఉపయోగిస్తారు. ఈ ఆటలో బంతిని తాకడానికి ప్లేయర్లు తమ పాదాలు, మోకాలు, భుజాలు, ఛాతీ, తలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే సెపక్ టక్రా గేమ్ వాలీబాల్, ఫుట్‌బాల్‌ను పోలి ఉంటుంది. సెపక్ టక్రాను మలేషియా జాతీయ క్రీడగా పరిగణిస్తారు. అయితే ఇదే క్రీడను పలు దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. మలేషియాలో సెపక్ టక్రా, ఇండోనేషియాలో సెపక్ రాగా, థాయ్‌లాండ్‌లో టక్రా, మయన్మార్‌లో చిన్లోన్, ఫిలిప్పీన్స్‌లో సిపా, లావోస్‌లో లతావ్, కంబోడియాలో సెక్ డై, వియత్నాంలో కౌ మే వంటి పేర్లతో పిలుస్తుంటారు. పేర్లు ఏదైనా ఆట మాత్రం అన్నింటిలో అదే విధంగా ఉంటుంది. ఇక 1965లో కౌలలంపూర్‌లో జరిగిన

క్రీడారంగంలో మైదానంలో జరిగే పోటీలే కాదు, మైదానం బయట జరిగే కొన్ని సంఘటనలు కూడా దశాబ్దాల పాటు గుర్తుండిపోతాయి. అలాంటి ఓ సరదా సంఘటనను భారత బాక్సర్ నరేందర్ బెర్వాల్, ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలిచిన క్రీడాకారులను అభినందించేందుకు ప్రధాని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఆసక్తికర సంభాషణ జరిగింది. నరేందర్ చెప్పిన కథ విని ప్రధాని మోదీ సైతం పగలబడి నవ్వారు.2015లో జరిగిన వరల్డ్ మిలిటరీ గేమ్స్‌లో తన తొలి బౌట్ పాకిస్థాన్ బాక్సర్తో జరిగిందని నరేందర్ గుర్తుచేసుకున్నారు. అది మిలిటరీ గేమ్స్ కావడం, ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఉండటంతో.. పాకిస్థాన్‌పై ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడిపోవద్దని తనకు సైనిక అధికారుల నుంచి ఫోన్లు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఆ మ్యాచ్‌లో తాను 4-1, 3-2 తేడాతో గెలిచానని, అయితే ఇద్దరికీ గాయాలయ్యాయని తెలిపారు. దీంతో కుట్లు వేయించుకోవడానికి ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు.ఆసుపత్రిలో జరిగిన సంభాషణను నరేందర్ వివరిస్తూ, "2014లో మీరు (మోదీ) తొలిసారి ప్రధాని అయ్యారు. మాతో ఉన్న ఆర్మీ కోచ్ పేరు నరేంద్ర రాణా. నా పేరు నరేందర్. ఈ విషయాలను గమనించిన పాక్ బాక్సర్ నా దగ్గరకు వచ్చి 'సోదరా, ఒక మాట చెప్పనా?' అని అడిగాడు. చెప్పమని అన్నాను" అని తెలిపారు.అప్పుడు ఆ పాక్ బాక్సర్.. "నీ పేరు నరేందర్, నీ కోచ్ పేరు నరేందర్, మీ ప్రధాని పేరు కూడా నరేంద్ర. నాకు ఈ నరేంద్ర

కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేత బాక్సర్ నరేంద్ర బేర్వాల్.. ప్రధాని నరేంద్ర మోదీని నవ్వించాడు. పతకాలు సాధించిన అథ్లెట్లు మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాక్సర్ నరేంద్ర.. మోదీకి చెప్పిన ఓ సరదా సంఘటన అందరినీ నవ్వించింది. ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేత బాక్సర్ నరేంద్ర బేర్వాల్.. ప్రధాని నరేంద్ర మోదీని నవ్వించాడు. పతకాలు సాధించిన అథ్లెట్లు మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాక్సర్ నరేంద్ర.. మోదీకి చెప్పిన ఓ సరదా సంఘటన అందరినీ నవ్వించింది. 2015 మిలిటరీ వరల్డ్ గేమ్స్‌లో పాకిస్థాన్ బాక్సర్తో జరిగిన పోరును గుర్తుచేసుకున్న బేర్వాల్.. ఆ మ్యాచ్ తర్వాత అతడు చెప్పిన మాటలను మోదీకి వివరించాడు. ‘2015 మిలిటరీ వరల్డ్ గేమ్స్‌లో నా తొలి రౌండ్ పోరు పాకిస్థాన్ బాక్సర్తో జరిగింది. పాకిస్థాన్ ఆటగాడితో ఓడిపోవద్దని అప్పుడు ఉన్నతాధికారులు, సహచరులు చెప్పేవారు. ఆ మ్యాచ్‌లో నేను గెలిచాను. అయితే పోరులో ఇద్దరికీ గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి వెళ్లాం. మీరు 2014లో ప్రధానిగా వచ్చారు. మా ఆర్మీ కోచ్ పేరు కూడా నరేంద్ర రాణా. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. పాక్ బాక్సర్ ఓ విషయాన్ని గమనించాడు. ‘బ్రదర్ నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నా’ అన్నాడు. సరే చెప్పు అని బదులిచ్చా. ‘నీ పేరు నరేంద్ర. మీ కోచ్ పేరు నరేంద్ర. మీ ప్రధాని నరేంద్ర. నాకు ఈ పేరు అంటేనే అసహ్యం వచ్చేసింది’ అన్నాడు’ అని బాక్సర్ బేర్వాల్ చెప్పాడు. దీనికి మోదీ గట్టిగా నవ్వేశారు. జట్టు నుంచి పిలుపు రాకపోయినా ప్రయత్నాలు ఆపొద్దు.. షమీకి జహీర్ ఖాన్ సూచన బుమ్రా కాదు.. ఆ స్టార్ ప్లేయర్ గాయాలపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

PM Narendra Modi, CWG 2026 Medallists: స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. గత ఎడిషన్లతో పోలిస్తే ఈసారి కొన్ని క్రీడా విభాగాలను తొలగించినప్పటికీ, మన క్రీడాకారులు లభించిన అవకాశాలను రెండు చేతులా ఒసిసిపట్టుకున్నారు. భారత్ మొత్తం 39 పతకాలు సాధించి పతకాల పట్టికలో గర్వకారణంగా నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. తక్కువ క్రీడల్లో పాల్గొన్నప్పటికీ పతకాల సాధన రేటులో భారత్ అగ్రశ్రేణి ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ వేదికపై దేశ పతాకాన్ని ఎగురవేసింది. బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట.. ఈ టోర్నీలో భారత్‌కు అత్యంత బలాన్ని ఇచ్చిన విభాగంగా బాక్సింగ్ నిలిచింది. రింగులోకి దిగిన భారత బాక్సర్లు ప్రత్యర్థులపై విరుచుకుపడి రికార్డు స్థాయిలో 10 పతకాలను కొల్లగొట్టారు. ముఖ్యంగా మహిళా బాక్సర్లు ప్రదర్శించిన ధీరత్వం నభూతో నభవిష్యత్ అనేలా సాగింది. ఏకంగా ఐదు స్వర్ణ పతకాలను మహిళా బాక్సర్లే సాధించడం విశేషం. మిరాబాయి చాను వరుసగా మూడోసారి పసిడి పతకం గెలుచుకుని వెయిట్‌లిఫ్టింగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. జూడో, అథ్లెటిక్స్ విభాగాల్లోనూ మన క్రీడాకారులు అంచనాలను మించి రాణించారు. పారా-అథ్లెట్లు సైతం దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తూ పసిడి, రజత పతకాలతో మెరిశారు. "జో ఖేలేగా వో ఖిలేగా".. క్రీడాకారుల్లో నవ ఉత్తేజం.. విజేతలను తన నివాసానికి ఆహ్వానించిన ప్రధాని మోదీ వారితో ఎంతో ఆప్యాయంగా సమయం గడిపారు. క్రీడాకారుల అనుభవాలు తెలుసుకుంటూ వారి కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా పసిడి విజేత సాక్షి చౌదరి, ఇతర అథ్లెట్లతో కలిసి మోదీ ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఆడేవాడు ఎల్లప్పుడూ వికసిస్తాడు" అనే తన సంకల్పాన్ని మోదీ పునరుద్ధరించారు. ప్రతి పౌరుడు భారత క్రీడాకారులకు నిరంతరం అండగా నిలవాలని, వారి విజయాన్ని వేడుకగా జరుపుకోవాలని కోరారు. ప్రధాని

గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ వేదికగా జరిగిన ఈ భేటీలో పతక విజేతలతో ఆయన ముచ్చటించారు. క్రీడల్లో వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారుల కృషిని అభినందిస్తూ, వారి విజయాలు దేశ యువతకు ఎంతో స్ఫూర్తినిస్తాయని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత క్రీడా చరిత్రలో ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడలు కీలక మలుపుగా నిలిచాయి. గ్లాస్గోలో జరిగిన ఈ క్రీడల్లో భారత్ మొత్తం 39 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే తక్కువ క్రీడాంశాలు ఉన్నప్పటికీ, పతకాల పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. ముఖ్యంగా బాక్సింగ్‌లో భారత్ ఏకంగా 10 పతకాలు సాధించడం విశేషం. దీంతో క్రీడా ప్రపంచంలో భారత్ తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది. మహిళా బాక్సర్లు ఒంటరిగా 5 స్వర్ణ పతకాలను గెలుచుకుని చరిత్ర సృష్టించారు. మరోవైపు, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వరుసగా మూడోసారి కామన్వెల్త్ స్వర్ణాన్ని దక్కించుకుని అరుదైన ఘనత సాధించారు. ఇదిలా ఉండగా, జూడో మరియు అథ్లెటిక్స్‌లోనూ భారత క్రీడాకారులు ఆశించిన స్థాయికి మించి రాణించి మెరుగైన ఫలితాలను అందించారు. ఫలితంగా, గ్లాస్గో క్రీడల ముగింపు కార్యక్రమంలో కామన్వెల్త్ క్రీడల జెండాను భారత్‌కు అందజేశారు. 2030లో జరగబోయే సెంటెనీయల్ కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆస్ట్రేలియా తర్వాత రెండుసార్లు క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న రెండో దేశంగా భారత్ నిలవడం గమనార్హం. ఈ నేపథ్యంలో, క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. ఈ భేటీలో “ఆడేవారే ఎదిగే వారు” అంటూ మోదీ పిలుపునిచ్చారు. క్రీడాకారులకు నిరంతరం ప్రజా మద్దతు

ఇంటర్నెట్ డెస్క్: భారత బాక్సర్ లవ్లీనాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రశంసల వర్షం కురిపించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు ఆదివారం ప్రధానిని కలిసిన సంగతి తెలిసిందే. వారితో సరదాగా మాట్లాడిన మోదీ అథ్లెట్లకు లడ్డూలు తినిపించారు. ఈ సందర్భంగా బాక్సర్ లవ్లీనా.. గ్లాస్గోలో చేసిన పనిని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. అదేమీ చిన్న విషయం కాదని.. దేశమంతా సుదీర్ఘకాలం గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు. ప్రధాని: అసలేం జరిగింది? మీరు ఆ రెస్టరెంట్తో ఎందుకు పోరాడారు? లవ్లీనా: కామన్వెల్త్ గేమ్స్‌లో మంచి ప్రదర్శన చేశాం. అది చివరి రోజు. చాలా సంతోషంగా గడపాల్సిన సందర్భం. అందుకోసం ఓ రెస్టరంట్‌కు వెళ్లాం. అయితే, మన మ్యాప్ సరిగా లేదని అనిపించింది. ఇదే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లా. మార్పులు చేస్తామని చెప్పారు. ప్రధాని: సంబరాలు చేసుకుంటున్న సమయంలో మీరు మ్యాప్ ప్రాముఖ్యతను గుర్తించడం నిజంగా అభినందనీయం. ఆ వీడియో సాధారణమైంది కాదు. దేశ ప్రజలు సుదీర్ఘకాలం గుర్తుంచుకుంటారు. గ్లాస్గోలోని ఓ రెస్టరెంట్‌కు లవ్లీనా (Lovlina Borgohain)తోపాటు కొందరు భారత అథ్లెట్లు డిన్నర్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న హ్యాండ్ టవల్స్ (నాప్కిన్లు)పై భారత్ మ్యాప్ అసంపూర్తిగా ఉండటం లవ్లీనా గమనించింది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు కశ్మీర్ పూర్తి భూభాగాలను ఆ చిత్రపటంలో చూపించకపోవడంతో సోషల్ మీడియా వేదికగా లవ్లీనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత రెస్టరంట్ క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటనను జారీ చేసింది. అయితే, ఇది కావాలనే చేసిందని.. పొరపాటు కాదని అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరో బాక్సర్ నరేంద్ర బేర్వాల్ గతంలో తనకు పాక్ బాక్సర్తో ఎదురైన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. ‘‘పాకిస్థాన్ గురించి ఏ మాట్లాడినా నాకొక స్టోరీ గుర్తుకొస్తుంది సర్. అది 2015 మిలిటరీ గేమ్స్. నా ఫస్ట్ ఫైట్ పాకిస్థాన్ బాక్సర్‌తోనే. అప్పుడు ఉన్నతాధికారులు, సహచరులు ఒకటే చెప్పేవారు

కామన్వెల్త్ గేమ్స్ 2026 సందర్భంగా భారత మ్యాప్‌ను తప్పుగా ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్లో జాతీయ పతాకంలో ఈశాన్య రాష్ట్రాలు కనిపించకపోవడాన్ని గమించిన లవ్లీనా.. వెంటనే సిబ్బందికి చెప్పి సరి చేయించిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026 సందర్భంగా భారత మ్యాప్‌ను తప్పుగా ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్లో జాతీయ పతాకంలో ఈశాన్య రాష్ట్రాలు కనిపించకపోవడాన్ని గమించిన లవ్లీనా.. వెంటనే సిబ్బందికి చెప్పి సరి చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రస్తావించిన మోదీ.. దేశం పట్ల ఆమెకున్న గౌరవాన్ని అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి రక్షా ఖడ్సే, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లవ్లీనాను ఉద్దేశించి మోదీ సరదాగా.. ‘ఏమైంది? రెస్టారెంట్ వాళ్లతో గొడవ పడుతున్నారట?’ అని అడిగారు. దీనికి ఆమె నవ్వుతూ.. ‘సర్.. కామన్వెల్త్ గేమ్స్‌లో మేం చాలా బాగా ఆడాం. చివరి రోజు కావడంతో అందరం సంతోషంగా వేడుక చేసుకుంటున్నాం. అక్కడ జాతీయ పతాకాన్ని తప్పుగా ముద్రించి అక్కడ పెట్టారు. అది నాకు నచ్చలేదు. అందుకే రెస్టారెంట్ సిబ్బందికి మర్యాదగా చెప్పాను. వాళ్లు కూడా వెంటనే దాన్ని సరిచేశారు’ అని వివరించింది. కాగా లవ్లీనా చర్యను మోదీ అభినందించారు. ‘గేమ్స్ పూర్తయ్యాయి. మీరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో కూడా ఆ మ్యాప్ ప్రాముఖ్యాన్ని గుర్తించడం గొప్ప విషయం. గెలుపు సంబరాల్లోనూ దేశ ప్రతిష్ఠను గుర్తించి అభ్యంతరం వ్యక్తం చేయడం సామాన్యమైన విషయం కాదు. చాలా కాలం పాటు ప్రజలు దాన్ని

భారతదేశం నుంచి అత్యున్నత స్థాయి మార్షల్ ఆర్ట్స్ కళాకారులు అరుదుగా వస్తుంటారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఐదేళ్ల ఫతే సింగ్ గిల్, దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఎంఎంఏ ప్రాడిజీగా రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇటీవల థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో జరిగిన వరల్డ్ మార్షల్ ఆర్ట్ గేమ్స్ 2026లో స్కేట్స్‌పై గట్కా ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించాడు. సిక్కుల సాంప్రదాయ యుద్ధ కళ అయిన గట్కాను స్కేట్స్‌పై ప్రదర్శించిన మొట్టమొదటి చిన్నారిగా ఫతే చరిత్ర సృష్టించాడు.సాధారణంగా చిన్న పిల్లలు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం నేర్చుకునే వయసులో, ఫతే మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుతాలు చేస్తున్నాడు. అతని ప్రయాణం కేవలం రెండేళ్ల వయసులోనే ప్రారంభమైంది. అతని చేతి కదలికల్లోని ప్రత్యేకతను తల్లిదండ్రులు గమనించి, ఆ దిశగా ప్రోత్సహించారు. ఫతే తండ్రి రమణ్‌దీప్ కూడా ఒక అథ్లెట్. యూరప్‌లో బాడీబిల్డింగ్ పోటీలలో పాల్గొన్నారు. తన కొడుకు కూడా క్రీడల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. రెండేళ్ల వయసులోనే ఫతే మణికట్టు కదలికలు గట్కాకు సరిగ్గా సరిపోతాయని గుర్తించి, ప్రత్యేకంగా ఓ కిర్పాన్ (సిక్కులు ధరించే కత్తి) తయారు చేయించి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో ఫతే తల్లి నవప్రీత్ కౌర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "ఫతే కడుపులో ఉన్నప్పుడు మంచి పనులు చేయాలని మా అమ్మ చెప్పేవారు. అది బిడ్డ భవిష్యత్తుకు మేలు చేస్తుందని అనేవారు" అని ఆమె గుర్తుచేసుకున్నారు. రెండేళ్ల వయసులోనే ఫతే మతపరమైన ఛానళ్లలో గుర్బానీని శ్రద్ధగా వినేవాడని తెలిపారు

కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సీడబ్ల్యూజీ పతక విజేతలతో మోదీ సమావేశమై వారి ప్రదర్శనను ప్రశంసించారు. ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సీడబ్ల్యూజీ పతక విజేతలతో మోదీ సమావేశమై వారి ప్రదర్శనను ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు వారు చూపిన పట్టుదల, కృషిని కొనియాడారు. దేశంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. అన్ని క్రీడల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని.. యువత మరింత మంది క్రీడల వైపు వచ్చేలా వాతావరణాన్ని కల్పించాలని పిలుపునిచ్చారు. ‘జో ఖేలేగా వో ఖిలేగా. భారత్‌కు ఎప్పుడూ మద్దతుగా నిలవండి. భారత్ మాతా కీ జై!’ అంటూ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. యువత క్రీడల్లో పాల్గొనాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ గతంలోనూ ఆయన ‘జో ఖేలేగా వో ఖిలేగా’ నినాదాన్ని పలుమార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ప్రధానితో సమావేశమైన బాక్సింగ్ స్వర్ణ పతక విజేత సాక్షి చౌదరి ఈ భేటీపై ఆనందం వ్యక్తం చేశారు. ‘కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలందరినీ ప్రధానమంత్రి ఆహ్వానించారు. ఆయనను కలవడం ఎంతో గర్వంగా, సంతోషంగా అనిపించింది. ప్రధానమంత్రి చాలా సౌమ్యంగా ఉంటారు. ఆయనతో మాట్లాడటం అద్భుతమైన అనుభవం’ అని సాక్షి తెలిపింది. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పతకాల వేటలో బాక్సింగ్ కీలక పాత్ర పోషించింది. భారత బాక్సర్లు మొత్తం 10 పతకాలు సాధించగా.. అందులో ఏడు స్వర్ణాలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత బాక్సింగ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ముఖ్యంగా భారత మహిళా బాక్సర్లు అదరగొట్టారు. ఏడు స్వర్ణాల్లో ఐదు మహిళల ఖాతాలోనే చేరాయి. శ్రీలంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్.. టీమిండియా ఘన విజయం బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా.. కేంద్రం అనుమతి కోరనున్న బీసీసీఐ!

స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తిరిగి వచ్చిన భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన ఢిల్లీ నివాసంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ పతక విజేతలతో సుదీర్ఘంగా సంభాషించి.. వారి అనుభవాలను తెలుసుకున్నారు. వారి అద్భుతమైన ప్రదర్శనను ప్రశంసిస్తూ, యావత్ దేశం తరపున అభినందనలు తెలిపారు. ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా పంచుకున్నారు, అది వేగంగా వైరల్ అవుతోంది.రష్యా నుంచి భారత్‌కు నేరుగా రైలు? ఇక హార్ముజ్ ఇబ్బందులకు చెక్!ప్రధానమంత్రి తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకోవడం ద్వారా కామన్వెల్త్ గేమ్స్ అథ్లెట్లతో జరిగిన ఈ ప్రత్యేక సమావేశం గురించి తెలియజేశారు. ఆ వీడియోలో ఆయన స్వర్ణ పతక విజేత బాక్సర్ సాక్షి చౌదరి, పలువురు ఇతర ఛాంపియన్లతో సంభాషిస్తూ కనిపించారు. ఆ వీడియోలో సాక్షి చౌదరి ప్రధాని మోదీ నిరాడంబరతను ప్రశంసిస్తూ.. ప్రధానమంత్రిని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా వినయశీలి అని అన్నారు. సంభాషణ సందర్భంగా ఆటగాళ్లు ప్రధానమంత్రిని ఏదైనా మాట్లాడమని కోరగా.. దేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించే తన ప్రసిద్ధ సందేశాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు, జో ఖేలేగా, వో ఖిలేగా! ఆల్వేస్ చీర్4భారత్. అంటూ చివరకు భారత్ మాతా కీ జై అని నినాదాలు చేస్తూ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు.1947లో భారత్‌లోనే కలవాల్సిన దుబాయ్! మన పాస్‌పోర్ట్‌తో అరబ్ ప్రజలు...39 పతకాలు గెలిచిన భారత్గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణించి, మొత్తం 39 పతకాలను గెలుచుకోవడం గమనార్హం. వీటిలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచగా.. ప్రధానమంత్రితో ఈ సమావేశం అథ్లెట్ల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది