
మా ఇడ్లీ-సాంబార్ అంటే సెలబ్రిటీలకూ ఇష్టం
అన్నం ఉడికిందో, లేదో చెక్ చేయడానికి ఒక్క మెతుకు పరిశీలిస్తే సరిపోతుంది. అదేవిధంగా తమ రెస్టరంట్ రుచుల ప్రత్యేకత తెలుసుకోవాలంటే ఒక్క మెత్తటి ఇడ్లీ టేస్ట్ చేస్తే చాలంటున్నారు బీనా గాంధీ. స్వతహాగానే ఆహార ప్రియురాలైన ఆమెకు పాకశాస్త్రంలోనూ ప్రావీణ్యం ఉంది. అన్నం ఉడికిందో, లేదో చెక్ చేయడానికి ఒక్క మెతుకు పరిశీలిస్తే సరిపోతుంది. అదేవిధంగా తమ రెస్టరంట్ రుచుల ప్రత్యేకత తెలుసుకోవాలంటే ఒక్క మెత్తటి ఇడ్లీ టేస్ట్ చేస్తే చాలంటున్నారు బీనా గాంధీ. స్వతహాగానే ఆహార ప్రియురాలైన ఆమెకు పాకశాస్త్రంలోనూ ప్రావీణ్యం ఉంది. ఈ ఆసక్తే ఆమెను ఫుడ్ ఆంత్రప్రెన్యూర్ని చేసింది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్, ముంబయిల్లో ఇప్పటికే ఆరు అవుట్లెట్స్ని తెరిచిన ఆమె.. దక్షిణాదిన ప్రాచుర్యం పొందిన టిఫిన్స్, ఇతర వంటకాల్ని ఈ వేదికగా అక్కడి వారికి పరిచయం చేస్తున్నారు. ‘సామాన్యులే కాదు.. పలువురు సెలబ్రిటీలూ దక్షిణాది వంటకాల రుచిని ఆస్వాదించడానికి తరచూ మా రెస్టరంట్లకు వస్తుంటారు..’ అంటోన్న బీనా వ్యాపార ప్రయాణం గురించి తెలుసుకుందాం.. తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టి పెరిగారు బీనా. ఈ ప్రాంతం పేరు వినగానే ఇడ్లీ-సాంబార్, వడ, దోశ.. వంటి రుచికరమైన అల్పాహారాలే గుర్తొస్తాయి. చిన్నతనం నుంచి వీటి రుచిని ఆస్వాదిస్తూ పెరిగారామె. అంతేకాదు.. వాటిని అంతే రుచికరంగా తయారుచేయడమూ నేర్చుకున్నారు. అయితే పెళ్లయ్యాక తన భర్తతో కలిసి ముంబయి వెళ్లిపోయారు బీనా. ‘పెళ్లయ్యాక అమ్మ చేతి వంటను, కోయంబత్తూరు రుచుల్ని చాలా మిస్సయ్యా. అత్తారింట్లో గరిట తిప్పినా నేను చేసిన వంటకాలకు అక్కడి రుచిని తీసుకురాలేకపోయానేమో అనిపించేది. అప్పుడర్థమైంది.. వాటి రుచి బియ్యంలో దాగుందని! దాంతో మా నాన్నకు ఫోన్ చేసి అక్కడి నుంచి బియ్యం తెప్పించుకునేదాన్ని. వాటితోనే సాంబార్ రైస్, రసం రైస్.. వంటి దక్షిణాది ప్రత్యేక వంటకాల్ని తయారుచేసి మా అత్తింటి వారికి పరిచయం చేశా. ఈ రుచులు మా మామగారికి ఎంతో నచ్చాయి. దాంతో అప్పుడప్పుడూ బంధువుల్ని ఇంటికి పిలిచి.. నా