
తెలంగాణ మొదటి రైల్వేస్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు
ఈ రోజుల్లో రైలు ప్రయాణం అంటే మనందరికీ చాలా కామన్. కానీ, అసలు మన తెలంగాణలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఎక్కడ కట్టారో తెలుసా? దానిని ఎవరు కట్టించారు? అసలు ఏ అవసరం కోసం అంత పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు? ఈ ప్రశ్నల వెనుక 150 ఏళ్ల నాటి ఒక అద్భుతమైన హిస్టరీ ఉంది. నాటి హైదరాబాద్ సంస్థానాన్ని బ్రిటీష్ ఇండియాతో కలపాలనే బలమైన ఆలోచనే నేటి తెలంగాణ రైల్వే నెట్‌వర్క్‌కు పునాది వేసింది. ఆ ఆసక్తికరమైన కథేంటో ఇప్పుడు చూద్దాం. మన తెలంగాణలో నిర్మించిన మొట్టమొదటి రైల్వే స్టేషన్ 'సికింద్రాబాద్ రైల్వే స్టేషన్'. ప్రస్తుతం మనం చూస్తున్న బిజీ బిజీ సికింద్రాబాద్ జంక్షనే మన రాష్ట్రంలోనే ఫస్ట్ స్టేషన్. దీనిని 1874 అక్టోబర్‌లో అప్పటి హైదరాబాద్ నిజాం పాలకుడు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ సిద్దిఖీ నిర్మించారు. 1870లోనే ఈ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన రాగా, నిజాం రాజు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు నాలుగేళ్ల పాటు జరిగిన నిర్మాణ పనుల తర్వాత, 1874 అక్టోబర్ 9న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, దానికి సంబంధించిన రైల్వే లైన్ పనులు పూర్తిగా పూర్తయ్యాయి. ఆ కాలంలోనే నిజాం శైలి మొఘల్, ఆసిఫ్ జాహి ఆర్కిటెక్చర్‌తో అద్భుతమైన మెయిన్ పోర్టికో, కాన్కోర్స్ రూమ్‌లను కట్టించారు. నిజాం రాజులు ఈ రైల్వే స్టేషన్‌ను ఎందుకు కట్టించారనే దానికి ఒక బలమైన కారణం ఉంది. అప్పట్లో హైదరాబాద్ ఒక ల్యాండ్లాక్డ్ స్టేట్. అంటే చూట్టూ భూభాగం ఉన్న రాజ్యం. బాంబే లేదా మద్రాస్ లాంటి పెద్ద నగరాలకు వెళ్లాలన్నా, వాణిజ్యం చేయాలన్నా సరైన రవాణా సౌకర్యం లేదు. అందుకే హైదరాబాద్ రాజ్యాన్ని గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే (GIPR) నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయాలని నిజాం డిసైడ్ అయ్యారు. అందుకోసం కొత్తగా 'సికింద్రాబాద్-వాడి' లైన్‌ను వేశారు. వాడి జంక్షన్ వద్ద బ్రిటీష్ ఇండియా రైల్వే లైన్‌తో