మకర రాశి, కుంభ రాశి, మీన రాశి 2026 సెప్టెంబరు నెల సమగ్ర జాతక ఫలం
Horoscope: గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. సెప్టెంబరు నెలకు సంబంధించి మకర రాశి, కుంభ రాశి, మీన రాశి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను తెలుసుకుందాం.తులా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి 2026 సెప్టెంబరు నెల సమగ్ర జాతక ఫలంమకర రాశి (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు)మకర రాశి వారికి సెప్టెంబరు నెల అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి అనుకూలమైన కాలంగా ఉంటుంది. ఉద్యోగులకు పనివేళల్లో పురోగతి లభిస్తుంది. సరైన ప్రణాళికలతో కొత్త బాధ్యతలను విజయవంతంగా చేపడతారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తే సహకారం, మద్దతు అందుతుంది. ధన లాభం పెరిగే సూచనలున్నాయి. బహుళ మార్గాల ద్వారా ఆదాయం పెరిగి ఆర్థిక స్థితి బలపడుతుంది. అయితే, అవసరం లేని ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. వ్యక్తిగతమైన రహస్యాలను ఇతరులతో పంచుకోకపోవడం శ్రేయస్కరం. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. శనిదేవునికి శనివారం రోజున నువ్వుల నూనెతో అభిషేకం చేయడం లేదా వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం శుభకరం.కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి 2026 సెప్టెంబరు నెల జాతక ఫలంకుంభ రాశి (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)కుంభ రాశి వారికి సెప్టెంబరు నెల సహనం, ఆర్థిక క్రమశిక్షణ అవసరమయ్యే కాలంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం కారణంగా కొంత ఒత్తిడి ఎదురవుతుంది. వృత్తి రంగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆవేశపడి ఉద్యోగాలు మారడం లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం