
వాషింగ్ మెషిన్ లో పసిపిల్లలు.. ఏడిస్తే చిత్రహింసలు..! డే కేర్ సెంటర్ లో దారుణం
తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లే సమయంలో తమ పిల్లలు క్షేమంగా ఉంటారని నమ్మి డేకేర్ సెంటర్లో వదిలి వెళ్తారు. కానీ అదే డేకేర్... పసిపిల్లలకు నరకంగా మారితే? బెంగళూరులోని ఓ ప్రముఖ డేకేర్ సెంటర్లో వెలుగులోకి వచ్చిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.రెండేళ్ల నుంచి మూడేళ్ల వయసున్న చిన్నారులను వాషింగ్ మెషిన్లో బంధించడం...చీకటి బాత్రూమ్లలో లాక్ చేయడం... టాయిలెట్ జెట్‌తో నీళ్లు చల్లి వేధించడం వంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయి. ఈ ఘటనపై ఐదుగురు మహిళా కేర్‌టేకర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు అక్కడ ఏం జరిగింది? పసిపిల్లలపై ఇంతటి అమానుషానికి కారణమేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీ హాల్ క్యాంపస్‌లోని డేకేర్ సెంటర్లో ఇలాంటి దారుణ ఘటన జరగడం ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. రెండేళ్ల వయస్సు గల చిన్నారులను డేకేర్ సిబ్బంది అత్యంత క్రూరంగా హింసించినట్లు సమాచారం. పసిపిల్లలని కూడా చూడకుండా వారిని వాషింగ్ మెషిన్ డ్రమ్‌లో బంధించడం, డార్క్ బాత్రూమ్లలో లాక్ చేసి, టాయిలెట్ జెట్ స్ప్రేతో నీళ్లు చల్లి వేధించడం వంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వివరాల ప్రకారం... ఐటీ ఉద్యోగులు విధులకు వెళ్లే సమయంలో తమ చిన్నారులను ఈ డేకేర్ సెంటర్లో వదిలి వెళ్తున్నారు. అయితే అక్కడ పనిచేస్తున్న మంజుల, విజయలక్ష్మి, సింధు, భవాని, బిందు అనే ఐదుగురు మహిళా కేర్టేకర్లు...పిల్లలను సైలెంటుగా ఉంచడానికి ఈ పైశాచిక పద్ధతులు పాటిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. వైరల్ అయిన వీడియోల ప్రకారం, ఏడుస్తున్న చిన్నారులను సిబ్బంది ఫ్రంట్‌లోడింగ్ వాషింగ్ మెషిన్ డ్రమ్‌లో కూర్చోబెట్టి తలుపు మూసి భయపెట్టినట్లు కనిపిస్తోంది. చిన్నారులు భయంతో ఏడుస్తున్నా వారిపై కనికరం చూపకుండా ఇలా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. పిల్లలను నిశ్శబ్దంగా ఉంచేందుకు ఇలాంటి పద్ధతులను అనుసరించినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా, మరో వీడియోలో ఒక చిన్నారిని వెస్ట్రన్ టాయిలెట్ సీటుపై