ఆకుకూరలు, పండ్లు సరిగ్గా కడగకపోతే కడుపులోకి 'సైక్లోస్పోరా', సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా
సైక్లోస్పోరా ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. యూఎస్ వ్యాప్తంగా 11 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సైక్లోస్పోరా అనేది 'సైక్లోస్పోరా కయేటనెన్సిస్' (Cyclospora cayetanensis) అనే అతి సూక్ష్మమైన పరాన్నజీవి (Parasite). ఇది చిన్నపేగును ఆశ్రయించి సైక్లోస్పోరియాసిస్ (Cyclosporiasis) అనే వ్యాధిని కలిగిస్తుంది. కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం ద్వారా ఈ పరాన్నజీవి శరీరం లోపలికి చేరుతుంది. పేగుల్లో చేరాక ఇది వేగంగా పెరిగి వాపు, మంటను కలిగిస్తుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. వర్షాకాలంలో దీని ముప్పు ఎక్కువగా ఉంటుంది.సరైన చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్ఫెక్షన్ కొన్ని రోజుల నుంచి వారాల పాటు వేధిస్తుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తులు కోలుకున్నప్పటికీ, చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది కాస్త తీవ్రంగా మారవచ్చు. సైక్లోస్పోరా రావడానికి కారణాలు, ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి నేరుగా సోకుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న పూర్తి వివరాలు గురించి డాక్టర్ అనుపమ ఎన్. కె. (సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరు) అందించారు.సైక్లోస్పోరా ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు కలుషిత ఆహారం, నీరు: కలుషితమైన నీటితో కడిగిన తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్లు తినడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. పారిశుధ్య లోపం: సరిగ్గా శుభ్రం చేయని నీటిని తాగడం, పరిశుభ్రత పాటించకుండా ఆహారం వండటం ప్రధాన కారణాలు. వ్యాప్తి చెందే విధానం: సరైన పారిశుధ్య వసతులు లేని ప్రాంతాల్లో ఇది ఎక్కువ. కానీ కలుషితమైన కూరగాయలు, పండ్లు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయినప్పుడు ఎక్కడైనా వ్యాపించే అవకాశం ఉంది.ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి నేరుగా సోకుతుందా? లేదు సైక్లోస్పోరా ఇన్ఫెక్షన్ ఒకరితో ఒకరు తిరగడం వల్ల లేదా తాకడం వల్ల నేరుగా సోకదు.గమనిక: రోగి మలం ద్వారా ఈ పరాన్నజీవి బయటకు వచ్చాక, వాతావరణంలో (గాలి, నీరు, నేలలో) కొన్ని రోజుల నుంచి వారాల సమయం
