
అందరినీ అలరిస్తున్న ఆటా సాంస్కృతిక పోటీలు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా), దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఝుమ్మంది నాదం’ (గాన పోటీలు) మరియు ‘సయ్యంది పాదం’ (నృత్య పోటీలు) కార్యక్రమాల ద్వారా వేలాది మంది యువతను తెలుగు భాష, సంగీతం, నృత్యం, సంస్కృతి వైపు ఆకర్షిస్తూ, విదేశాల్లో పెరుగుతున్న భావితరాలకు తెలుగు సంస్కృతికి వారధిగా నిలుస్తోంది. వర్జీనియా, చికాగో, డెలావేర్ వ్యాలీ, న్యూజెర్సీ, ఆర్లాండో, ఆస్టిన్, ఫీనిక్స్, అట్లాంటా, డల్లాస్, రాలీతో పాటు అమెరికాలోని అనేక ప్రధాన నగరాలలో నిర్వహించిన ఈ పోటీలలో ప్రతి నగరంలో సగటున 150 నుండి 200 మంది వరకు పాల్గొన్నారు. మొత్తం మీద వేలాది మంది విద్యార్థులు, వందలాది కుటుంబాలు ఈ కార్యక్రమాలలో భాగస్వాములై తెలుగు సంస్కృతి పరిరక్షణ పట్ల తమ అంకితభావాన్ని చాటిచెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా ఆటా ఉత్తర అమెరికాలో తెలుగు సమాజానికి సేవలందిస్తూ సాంస్కృతిక, విద్యా, సాహిత్య, యువజన, సేవా మరియు మానవతా కార్యక్రమాల ద్వారా తెలుగు వారసత్వ పరిరక్షణకు విశేష కృషి చేస్తోంది. ఆ దిశగా ఝుమ్మంది నాదం మరియు సయ్యాండి పాదం కార్యక్రమాలు ఆటా నిర్వహిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ప్రభావవంతమైన సాంస్కృతిక వేదికలుగా గుర్తింపు పొందాయి. ఈ కార్యక్రమాలు కేవలం గాన, నృత్య పోటీలు మాత్రమే కావు. తెలుగు సంగీతం, సాహిత్యం, నృత్య సంప్రదాయాలు, కళా వైభవం మరియు మన సంస్కృతి గొప్పతనాన్ని యువతకు పరిచయం చేసే సాంస్కృతిక విద్యాలయాలు. అమెరికా వంటి బహుళ సంస్కృతులు, భాషలు, జాతులు కలిసి జీవిస్తున్న సమాజంలో పెరుగుతున్న తెలుగు పిల్లలకు తమ మూలాలను గుర్తు చేస్తూ, తమ సంస్కృతిపై గౌరవాన్ని పెంపొందించే విలువైన వేదికలుగా ఇవి నిలుస్తున్నాయి. తెలుగు భాష, సంస్కృతి, కళలు కేవలం వినోదానికి సంబంధించిన అంశాలు కావు; అవి మన చరిత్రకు, మన సంప్రదాయాలకు, మన కుటుంబ విలువలకు, మన అస్థిత్వానికి ప్రతీకలు. విదేశాల్లో జన్మించి పెరుగుతున్న రెండవ, మూడవ తరం యువతకు తమ మూలాలను పరిచయం
